Author: Kumar

  • ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు ఇదే: ధర మరియు పూర్తి వివరాలు ఇవే..

    ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు ఇదే: ధర మరియు పూర్తి వివరాలు ఇవే..

    Volkswagen Golf GTI India Launch: చెప్పినట్లుగానే ఫోక్స్‌వ్యాగన్.. తన ‘గోల్ఫ్ జీటీఐ’ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫోక్స్‌వ్యాగన్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    ధర మరియు బుకింగ్స్

    కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు ధర రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశంలోకి వస్తుంది, ఈ కారణంగానే దీని ధర అధికంగా ఉంటుంది.

    దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కారు.. ప్రారంభంలో 150 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే ఈ కారును కేవలం 150 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులు. దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు మరో 100 యూనిట్లను విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

    ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్

    లేటెస్ట్ డిజైన్ కలిగిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్‌ను పొందుతుంది. దీని ముఖ్యమైన ఎక్స్‌టీరియర్ ఫీచర్లు:

    • ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్
    • సన్నని డీఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్స్)
    • స్పోర్టీ డిజైన్ బంపర్
    • ఎక్స్-షేప్ ఎల్ఈడీ ఫాగ్ లైట్
    • గ్రిల్ మీద జీటీఐ బ్యాడ్జ్
    • ఫ్రంట్ డోర్స్ మరియు టెయిల్‌గేట్‌పై జీటీఐ బ్యాడ్జ్
    • 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్
    • రెడ్ బ్రేక్ కాలిపర్స్
    • ఎల్ఈడీ టెయిల్ లైట్స్
    • రూఫ్ స్పాయిలర్
    • రెండు ఎగ్జాస్ట్ టిప్స్

    ప్రీమియం ఇంటీరియర్ మరియు ఫీచర్లు

    ఇంటీరియర్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ లోపల ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి:

    • హెడ్‌రెస్ట్‌పై రెడ్ కలర్ జీటీఐ స్టిచ్చింగ్ కలిగిన స్పోర్ట్స్ సీట్లు (మధ్యలో సిగ్నేచర్ టార్టన్ ఇన్సర్ట్‌లతో)
    • లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్
    • 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    • 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
    • సన్‌రూఫ్
    • వైర్‌లెస్ ఛార్జర్
    • త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్
    • ప్యాడిల్ షిఫ్టర్లు
    • 30 కలర్ యాంబియంట్ లైటింగ్
    • హీటెడ్ ఫ్రంట్ సీట్లు

    కలర్ అషన్స్ & సేఫ్టీ ఫీచర్స్

    కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు నాలుగు ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్లలో లభిస్తుంది:

    కలర్ ఆప్షన్స్:

    • గ్రెనడిల్లా బ్లాక్
    • కింగ్స్ రెడ్
    • మూన్‌స్టోన్ గ్రే
    • ఓరిక్స్ వైట్

    భద్రత విషయంలో కూడా ఈ కారు అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది:

    సేఫ్టీ ఫీచర్స్:

    • ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు
    • రియర్ వ్యూ కెమెరా
    • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం (TPMS)
    • ఐసోఫిక్స్ యాంకర్లు
    • ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్
    • లేన్ చేంజ్ అసిస్ట్
    • రియర్ ట్రాఫిక్ అలర్ట్
    • లెవెల్ 2 ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)

    ఇంజిన్ మరియు పనితీరు

    ఇక ప్రధానంగా చెప్పుకోదగ్గది ఇంజిన్. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 265 హార్స్ పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ (DSG) ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.

  • 26 ఏళ్ల కొడుకు ఇచ్చిన గిఫ్ట్: కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి

    26 ఏళ్ల కొడుకు ఇచ్చిన గిఫ్ట్: కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి

    Son Gifts To Dad His Restored Royal Enfield Bullet: మన ప్రియమైనవారికి నచ్చిన గిఫ్ట్ ఇచ్చి సంతోషపెట్టడంలో ఉన్న ఆనందం మాటలకు అందనిది. ఆ అనుభూతి అనుభవించినవారికి మాత్రమే తెలుస్తుంది. ఇటీవల ఓ కొడుకు తన తండ్రికి ఇష్టమైన బైకుని ఇచ్చి సంతోషపెట్టాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    తండ్రి పుట్టినరోజుకు కొడుకు గిఫ్ట్

    కేరళకు చెందిన వ్యక్తి 60వ పుట్టిన రోజుకు, తన కొడుకు ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ గిఫ్ట్ ఇచ్చాడు. నిజానికి ఈ బుల్లెట్ బైక్ ఆ తండ్రి దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి ఉపయోగించిందే. ఆ బైకంటే తన తండ్రికి ఎంతో ఇష్టం కావడంతో, ఆ కొడుకు ఆ బండిని మళ్ళీ కొత్త బుల్లెట్ మాదిరిగానే తయారు చేయించాడు.

    పాత జ్ఞాపకాలకు కొత్త జీవం

    తన తండ్రి బుల్లెట్ బైకును మళ్ళీ కొత్తదానిలాగా చేయడానికి తన స్నేహితుల సహాయం కూడా తీసుకున్నాడు. సరిగ్గా తన తండ్రి పుట్టిన రోజు నాడే గిఫ్ట్ ఇవ్వాలని ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు. అదే రోజున బుల్లెట్ బైకు తీసుకుని ఇంటికి వచ్చాడు.

    ఆనందభాష్పాలు చిందించిన తండ్రి

    బైక్ చూసిన ఆనందంతో ఆ తండ్రి కొడుకుని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి కొడుకులు ఆనంద బాష్పాలు కారుస్తుంటే, తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటన చూపరులను కూడా మంత్రముగ్ధుల్ని చేసింది.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

    ఆ తండ్రి ఒకప్పుడు ఉపయోగించిన బైకు నెంబర్ కూడా యధావిధిగా ఉండటం చూడవచ్చు. తండ్రి కోసం కొడుకు ఆ బైకును మళ్ళీ ఎలా కొత్తదానిలా మార్చాడో తెలియజేసే వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని తిరూర్‌లో ఆ పాత బైకును మళ్ళీ కొత్తదానిలా మార్చినట్లు తెలుస్తోంది.

    నిజానికి తల్లిదండ్రులకు నచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెట్టిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ ఘటన చాలామంది హృదయాలను తాకింది.

    రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్

    భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అనేది కేవలం బ్రాండ్ కాదు, అది బైక్ ప్రేమికుల ఫీలింగ్. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కంపెనీ, మార్కెట్లో వివిధ ఇంజిన్ ఆప్షన్లలో బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. అయితే మార్కెట్లో ఎన్ని బైకులను కంపెనీ లాంచ్ చేసినా, బుల్లెట్ బైకుకు మాత్రం ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఈ కారణంగానే చాన్నాళ్లుగా ఎంతోమంది బైక్ ప్రేమికులు ఇష్టపడి కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఈ నాటికి కూడా ఈ బైకుని ఇష్టపడేవారు చాలామందే ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

    భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు

    ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ లాంచ్ చేసిన బైకుల జాబితాలో బుల్లెట్ 350 బైక్ మాత్రమే కాకుండా, హంటర్ 350, క్లాసిక్ 650, స్క్రామ్ 440, బేర్ 650, క్లాసిక్ 350, గెరిల్లా 450, షాట్‌గన్ 650, హిమాలయన్ 450, మీటియోర్ 350, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మీటియోర్ 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650 వంటివి ఉన్నాయి.

  • సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బైక్: రూ. లక్ష కంటే తక్కువలోనే!

    సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బైక్: రూ. లక్ష కంటే తక్కువలోనే!

    Oben Electric Upcoming Bike: 2025 నాటికి ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలంటే కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అయితే, బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ బైక్ విశేషాలు, ఫీచర్లు, మరియు అంచనాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రణాళిక: ‘0100’ ప్లాట్‌ఫామ్‌పై కొత్త ఆవిష్కరణ

    ఒబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లో ఓ ఎలక్ట్రిక్ బైకును విజయవంతంగా లాంచ్ చేసి, మంచి అమ్మకాలను నమోదు చేసుకుంది. ఈ ఉత్సాహంతో, త్వరలోనే ‘0100’ అనే వినూత్న ప్లాట్‌ఫామ్‌పై మరో కొత్త బైకును, అది కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రాబోయే బైక్, సుమారుగా 100 cc పెట్రోల్ బైక్‌కు సమానమైన పనితీరును అందిస్తుందని అంచనా. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

    0100 ప్లాట్‌ఫామ్ ప్రత్యేకతలు

    ‘0100’ ప్లాట్‌ఫామ్ మాడ్యూలర్ మరియు స్కేలబుల్ డిజైన్‌తో రూపొందించబడింది. దీని అర్థం, అవసరాన్ని బట్టి బ్యాటరీ ప్యాక్ సైజును మార్చుకునే వెసులుబాటు ఉండొచ్చు. కంపెనీ ఈ బైక్‌ను వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో (బహుశా 2.6 కిలోవాట్ మరియు 4.4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లతో) మల్టిపుల్ వేరియంట్లలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ధరలు మరియు ఇతర సాంకేతిక వివరాలు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడి కానున్నాయి.

    లక్ష రూపాయల లోపు నాణ్యమైన ఎలక్ట్రిక్ బైక్ సాధ్యమేనా?

    ప్రస్తుతం భారతీయ మార్కెట్లో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే టూవీలర్లు చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా, అవి డిజైన్ మరియు ఫీచర్ల విషయంలో కొనుగోలుదారులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే, ఒబెన్ ఎలక్ట్రిక్ లాంచ్ చేయనున్న ఈ కొత్త బైక్ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం. ఇది మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

    వాహన ప్రియులకు శుభవార్త

    ఎలక్ట్రిక్ బైక్ కొనాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, అధిక ధరల కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. అలాంటి వారి కోసమే ఒబెన్ ఎలక్ట్రిక్ ఈ చౌకైన బైకును తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఈ బైక్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే కచ్చితమైన తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

    ఎలక్ట్రిక్ బైక్‌ల వల్ల కలిగే ప్రయోజనాలు

    భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌ల వాడకం క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి:

    • పర్యావరణ పరిరక్షణ: పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఇవి వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
    • తక్కువ నిర్వహణ ఖర్చులు: ఎలక్ట్రిక్ బైక్‌లకు మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఇంజిన్ ఆయిల్ మార్చడం, స్పార్క్ ప్లగ్స్ వంటి సమస్యలు ఉండవు.
    • ఖర్చు ఆదా: ఉదాహరణకు, ఒక ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ ఛార్జ్‌తో 100 కిలోమీటర్ల రేంజ్ అందిస్తే, దీనికి అయ్యే కరెంట్ ఖర్చు సుమారు 20-30 రూపాయలు మాత్రమే (యూనిట్ ధరను బట్టి). అదే పెట్రోల్ బైక్ 100 కిలోమీటర్లు ప్రయాణించాలంటే కనీసం 150 రూపాయలు ఖర్చు అవుతుంది.
    • ట్రెండ్ మరియు ఆధునికత: కొత్త టెక్నాలజీని ఇష్టపడేవారు, పర్యావరణ స్పృహ కలిగినవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

    ఒబెన్ ఎలక్ట్రిక్ తీసుకురాబోయే ఈ కొత్త, తక్కువ ధర బైక్ మార్కెట్లో ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి. ఖచ్చితంగా ఇది ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

  • యాపిల్‌ను తాకిన ట్రంప్ టారిఫ్స్: ఆ ఐఫోన్లపై 25 శాతం సుంకం

    యాపిల్‌ను తాకిన ట్రంప్ టారిఫ్స్: ఆ ఐఫోన్లపై 25 శాతం సుంకం

    Trump 25 Percent Tariff On Apple: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలపై అధిక సుంకాలను విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సుంకాల కారణంగానే స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలిపోయాయి. చైనా మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లు అమెరికాపై విరుచుకుపడి సుంకాలను అమాంతం పెంచుకుంటూ పోయింది. అమెరికా కూడా చైనాకు బుద్ధిచెప్పాలనే క్రమంలో సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ రెండు దేశాలు సుంకాలను దాదాపు తగ్గించుకున్నాయి. కానీ ట్రంప్ సుంకాల ప్రభావం ఇప్పుడు యాపిల్ కంపెనీ మీద పడింది.

    అమెరికా బయట తయారీ చేస్తే 25% సుంకం

    యాపిల్ కంపెనీ అమెరికాలో తన ఉత్పత్తులను తయారు చేయనియెడల భారీ సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని శుక్రవారం డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారతదేశంలోనో లేదా ఇతర దేశాల్లోనూ యాపిల్ తమ ఉత్పత్తులను తయారు చేసి అమెరికాకు దిగుమతి చేసుకుంటే 25 శాతం సుంకాలను విధించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.

    ఐఫోన్ ధరలపై సుంకాల ప్రభావం

    ప్రస్తుతం అమెరికాలో యాపిల్ ఐఫోన్ విలువ 1200 డాలర్ల (రూ.1.02 లక్షలు) వరకు ఉంది. 25 శాతం సుంకాలను విధిస్తే వీటి ధరలు 1500 డాలర్ల నుంచి 2000 డాలర్లకు చేరే అవకాశం ఉంటుంది.

    భారత్‌లో యాపిల్ ప్రణాళికలకు అడ్డంకి?

    డొనాల్డ్ ట్రంప్ చైనాపై అధిక సుంకాలను విధించిన తరువాత యాపిల్ కంపెనీ భారతదేశంలో తమ ఉత్పత్తులను గణనీయంగా పెంచాలని సంకల్పించింది. అయితే దీనికి ఇప్పుడు ట్రంప్ సుంకాలు అడ్డుపడుతున్నాయి. కాబట్టి యాపిల్ కంపెనీ సుంకాల కారణంగా అమెరికాలోనే ఉత్పత్తులను పెంచుతుందా?, సుంకాలను పక్కన పెట్టి భారతదేశంలోనే ఉత్పత్తులను పెంచుతుందా?, అనే విషయం తెలియాల్సి ఉంది.

    “మేడ్ ఇన్ అమెరికా”కు ప్రాధాన్యత..

    యాపిల్ కంపెనీ ప్రస్తుతం అమెరికాలో ఐమ్యాక్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్, యాపిల్ వాచ్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తోంది. వీటన్నిటికీ కంపెనీ ప్రత్యేకంగా సుంకాలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ “మేడ్ ఇన్ అమెరికా” ఉత్పత్తులు. అదే అమెరికా వెలుపల యాపిల్ తన ఉత్పత్తులను ఉత్పత్తి చేసి దిగుమతి చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టంగా వెల్లడించారు. అమెరికాలోనే దాదాపు అన్ని కంపెనీలు తమదేశంలోనే ఉత్పత్తులను పెంచాలని, కావాలంటే కొత్త ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు యాపిల్ వేరే దేశాలకు తరలి వెళ్లకుండా ఉండటానికే 25 శాతం సుంకాలను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

    ప్రపంచ మార్కెట్‌లో యాపిల్ హవా

    ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడం లేదా ఉన్న ఉత్పత్తులనే గణనీయంగా పెంచడం వంటివి చేస్తోంది. దీంతో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.

    ఐఫోన్ ప్రత్యేకత: స్టేటస్ మరియు భద్రత

    ఐఫోన్ అంటే కేవలం స్టేటస్ మాత్రమే కాదు, సెక్యూర్ అని భావించే చాలామంది నేడు ఐఫోన్స్ ఉపయోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

  • కియా కారెన్స్ క్లావిస్ ధరలు తెలిసిపోయాయ్: ఇదిగో ఫుల్ డీటెయిల్స్

    కియా కారెన్స్ క్లావిస్ ధరలు తెలిసిపోయాయ్: ఇదిగో ఫుల్ డీటెయిల్స్

    Kia Carens Clavis Launched: ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘కియా కారెన్స్ క్లావిస్’ ధరలు అధికారికంగా వెల్లడైపోయాయి. కంపెనీ ఈ కారు కోసం ఇప్పటికే రూ.25,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభించేసింది. ఇది స్టాండర్డ్ కారెన్స్ కారుతో పాటు విక్రయానికి ఉంటుంది.

    వేరియంట్స్ & ధరలు

    కొత్త కియా కారెన్స్ క్లావిస్ మొత్తం ఏడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 11.50 లక్షల నుంచి రూ. 18.00 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇవన్నీ 7 సీటర్ మరియు 6 సీటర్ రూపంలో అమ్మకానికి ఉంటాయి. అయితే కంపెనీ వీటిని పెట్రోల్, టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందిస్తుంది.

    డిజైన్ మరియు ఎక్స్‌టీరియర్

    కియా కారెన్స్ క్లావిస్ పూర్తిగా కొత్త డిజైన్ పొందుతుంది. ముందు భాగంలో త్రిభుజాకారంలో ఫిక్స్ చేయబడిన మూడు ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉన్నాయి. వీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, బ్లాక్డ్ ఆఫ్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లతో కూడిన బ్లాక్ క్లాడింగ్ వంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వీల్ ఆర్చెస్ మరియు డోర్స్ వరకు బ్లాక్ క్లాడింగ్ ఉండటం చూడవచ్చు. సిల్హౌట్ అలాగే ఉంది. డ్యూయెల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ రూఫ్ రెయిల్ కోసం కొత్త డిజైన్.. వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయి. అయితే రియర్ ప్రొఫైల్ దాదాపు.. కారెన్స్ మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇంటీరియర్ ఫీచర్లు

    సరికొత్త కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అనేక ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి:

    • 22.62 ఇంచెస్ డ్యూయెల్ స్క్రీన్ సెటప్ (డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్). ఇది కియా సెల్టోస్ కారులో కూడా కనిపిస్తుంది.
    • వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్
    • రీ డిజైన్ చేయబడిన ఏసీ వెంట్స్
    • ఆటోమాటిక్ ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్స్
    • డ్యూయెల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్
    • ఫోర్ వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు
    • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే
    • 8 స్పీకర్ బోస్ (Bose) సౌండ్ సిస్టం

    సేఫ్టీ ఫీచర్స్

    కారు అనగానే మైలేజ్ మాత్రమే కాదు సేఫ్టీ ఫీచర్స్ కూడా ప్రధానమే. దీనిని దృష్టిలో ఉంచుకుని కియా మోటార్స్ తన కారెన్స్ క్లావిస్ కారులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ప్రవేశపెట్టింది. అవి:

    • లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS)
    • 360 డిగ్రీ కెమెరా
    • బ్లైండ్ స్పాట్ మానిటరింగ్
    • లేన్ కీప్ అసిస్ట్
    • రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్
    • ఆరు ఎయిర్‌బ్యాగులు
    • ఏబీఎస్ విత్ ఈబీడీ
    • హిల్ స్టార్ట్ అసిస్ట్
    • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం
    • నాలుగు డిస్క్ బ్రేకులు

    ఇవన్నీ ప్రయాణికులకు భద్రత కల్పించడంలో సహాయపడతాయి.

    ఇంజిన్ ఆప్షన్స్ మరియు పనితీరు

    కియా కారెన్స్ క్లావిస్ మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి:

    • 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్: 157 హార్స్ పవర్ & 253 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
    • 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్: 113 హార్స్ పవర్ & 143.8 Nm టార్క్ అందిస్తుంది.
    • 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్: 113 హార్స్ పవర్ & 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

    ఇవన్నీ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.

    మార్కెట్లో పోటీదారులు

    ఇండియన్ మార్కెట్లో ఎంపీవీలకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కియా యొక్క కొత్త కారెన్స్ క్లావిస్ మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే అమ్మకాల పరంగా ఇది మారుతి సుజుకి ఎక్స్ఎల్6, టయోటా ఇన్నోవా క్రిష్టా, ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి ఇన్విక్టో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

  • రూ.6.89 లక్షల టాటా కారు: తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు

    రూ.6.89 లక్షల టాటా కారు: తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు

    2025 Tata Altroz Facelift: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ చెప్పినట్లుగానే.. ఇండియన్ మార్కెట్లో 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ (2025 Altroz Facelift) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర, బుకింగ్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..

    1) ధరలు & వేరియంట్స్

    టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 6.89 లక్షల నుంచి రూ. 11.49 లక్షల (ధరలు ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ ధరలు స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 24000 ఎక్కువ. కాగా కంపెనీ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జూన్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. ఆ తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయి.

    2) డిజైన్

    కొత్త 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయమైన డిజైన్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, 3డీ ఫినిషింగ్‌తో రీడిజైన్ చేయబడిన బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ వంటి వాటితో పాటు.. రియర్ ప్రొఫైల్.. బ్లాక్డ్ అవుట్ టెయిల్‌గేట్ పొందుతుంది. కానీ కొన్ని టాప్ వేరియంట్లలో ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్ ఉంటుంది.

    3) ఫీచర్స్

    ఐదు వేరియంట్లలో లభించే ఫేస్‌లిఫ్టెడ్ టాటా ఆల్ట్రోజ్.. రీడిజైన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. ఇందులో ప్రధాన ఫీచర్లు:

    • 2 స్పోక్ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్
    • రీడిజైన్డ్ గేర్ లివర్
    • రీడిజైన్డ్ ఏసీ వెంట్స్
    • రీడిజైన్డ్ ఏసీ కంట్రోల్స్
    • 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం
    • 10.25 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
    • 360 డిగ్రీ కెమెరా
    • వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్
    • రియర్ ఏసీ వెంట్స్
    • కీలెస్ ఎంట్రీ
    • క్రూయిజ్ కంట్రోల్
    • బ్లైండ్ స్పాట్ మానిటరింగ్

    వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

    4) పవర్‌ట్రెయిన్

    2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కింది ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది:

    • 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్: 87 Bhp పవర్, 115 Nm టార్క్
    • 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్: 88 Bhp పవర్, 200 Nm టార్క్
    • CNG ఇంజిన్

    ఈ ఇంజిన్స్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. ఇవి మీరు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

    5) సేఫ్టీ ఫీచర్స్ & ప్రత్యర్థులు

    కొత్త 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో ఉండే ప్రధాన సేఫ్టీ ఫీచర్లు:

    • 6 ఎయిర్‌బ్యాగులు
    • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
    • ఏబీఎస్ విత్ ఈబీడీ (ABS with EBD)
    • ఇంకా మరెన్నో ఆధునిక సేఫ్టీ ఫీచర్లు.

    కంపెనీ యొక్క ఇతర మోడల్స్ మాదిరిగానే ఇది కూడా గొప్ప సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని స్పష్టమవుతోంది. కాగా ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ ఐ20, మారుతి సుజుకి బాలెనొ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము.

  • రూ.10 లక్షలుంటే చాలు!.. ఇందులో ఓ కారు కొనేయొచ్చు

    రూ.10 లక్షలుంటే చాలు!.. ఇందులో ఓ కారు కొనేయొచ్చు

    Cars under Rs. 10 Lakhs: ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. సొంతంగా ఓ కారు కొనుగోలు చేయాలనేది చాలా మంది కల. అయితే, మన బడ్జెట్‌కు సరిపోయే, మంచి ఫీచర్లున్న కారును ఎంచుకోవడం కొంచెం కష్టమైన పనే. ఈ కథనంలో, రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కొన్ని బెస్ట్ కార్ మోడల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

    రూ.10 లక్షలలోపు బెస్ట్ కార్లు..

    రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో.. కారు కొనాలనుకునే వారి కోసం ఇక్కడ బెస్ట్ మోడల్స్ ఉన్నాయి..

    1. టాటా నెక్సాన్ (Tata Nexon)

    దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ నుంచి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV నెక్సాన్. దీని ప్రారంభ ధర సుమారు రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇందులోని పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమాటిక్, డీజిల్ మాన్యువల్ మరియు సిఎన్‌జీ మాన్యువల్ ఆప్షన్స్ కలిగిన సుమారు 9 వేరియంట్స్ ధరలు రూ. 10 లక్షల కంటే తక్కువగానే ఉంటాయి. టాటా నెక్సాన్ యొక్క కొన్ని టాప్-ఎండ్ వేరియంట్ల ధరలు రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చు. నెక్సాన్ అన్ని వేరియంట్ల డిజైన్ దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఫీచర్లు మరియు ఇంజిన్ పర్ఫామెన్స్‌లో కొంత తేడా ఉంటుందని గమనించాలి. ఇది 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది.

    2. కియా సోనెట్ (Kia Sonet)

    స్టైలిష్ లుక్ మరియు ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకునే కియా సోనెట్ కూడా ఈ జాబితాలో ప్రముఖంగా నిలుస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ మోడల్ యొక్క 7 వేరియంట్లు రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. ఇవి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తాయి. ఇవి మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తాయి. దీని ఆధునిక డిజైన్ మరియు ఫీచర్లు యువ కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షిస్తాయి.

    3. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO (Mahindra XUV 3XO)

    రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కార్ల జాబితాలో మహీంద్రా నుంచి వచ్చిన అప్‌డేటెడ్ ఎక్స్‌యూవీ 3XO (గతంలో XUV300) ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌ను పొందుతుంది. ఇంజిన్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. సింపుల్ ఇంకా ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్లతో పాటు ఉత్తమమైన పనితీరును అందిస్తుంది.

    4. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

    రూ. 7.94 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హ్యుందాయ్ వెన్యూ కూడా రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో ఓ మంచి కారు. ఈ మోడల్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. నిజానికి ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న లేదా ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కాంపాక్ట్ SUVల జాబితాలో వెన్యూ కూడా ఒకటి. ఇది మంచి డిజైన్, ఆధునిక ఫీచర్లు కలిగి, అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

    5. టయోటా టైసర్ (Toyota Taisor)

    ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా నుంచి వచ్చిన అర్బన్ క్రూయిజర్ టైసర్ కూడా రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఉత్తమ కార్లలో ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌ను పొందుతుంది. ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్, AMT మరియు 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో వస్తాయి. టయోటా బ్రాండ్ నమ్మకం, మంచి మైలేజ్ దీని అదనపు ఆకర్షణలు.

    ఇతర బడ్జెట్-ఫ్రెండ్లీ కార్లు (Other Budget-Friendly Cars)

    పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా, రూ. 10 లక్షల బడ్జెట్‌లో మరికొన్ని మంచి కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని:

    • మారుతి సుజుకి ఫ్రాంక్స్ (ప్రారంభ ధర రూ. 7.55 లక్షలు)
    • టాటా పంచ్ (ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు)
    • రెనాల్ట్ కిగర్ (ప్రారంభ ధర రూ. 6.00 లక్షలు)
    • నిస్సాన్ మాగ్నైట్ (ప్రారంభ ధర రూ. 6.00 లక్షలు)
    • హ్యుందాయ్ ఎక్స్‌టర్ (ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు)

    గమనిక: ఇక్కడ పేర్కొన్న ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఆన్-రోడ్ ధరలు మీ నగరం మరియు రాష్ట్రం బట్టి మారవచ్చు. ఖచ్చితమైన ధరల వివరాల కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించడం మంచిది.

  • నీతా అంబానీకి టైమ్స్ మ్యాగజైన్ గుర్తింపు: దాతృత్వంలోనూ రికార్డ్!

    నీతా అంబానీకి టైమ్స్ మ్యాగజైన్ గుర్తింపు: దాతృత్వంలోనూ రికార్డ్!

    Nita Ambani in TIME100 Philanthropy List 2025: అంబానీ ఫ్యామిలీ అంటే కేవలం భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం మాత్రమే కాదు, ఎన్నో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కుటుంబం కూడా. ఇటీవల, ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రభావశీలుల జాబితాలో (Time Magazine’s 100 Most Influential People) ముకేశ్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్మన్ శ్రీమతి నీతా అంబానీ (Nita Ambani) కూడా స్థానం సంపాదించారు.

    టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన దాతృత్వ నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో నీతా అంబానీ ఏకంగా 48 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 407 కోట్లు) విరాళంగా అందించారు. ఈ ఘనతతో, భారతదేశంలో అత్యధికంగా దానం చేసిన పారిశ్రామికవేత్తల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. సుమారు 100 బిలియన్ డాలర్ల నికర సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ కేవలం వ్యాపార దిగ్గజమే కాకుండా గొప్ప పరోపకారి అని కూడా నిరూపించుకున్నారు.

    రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా అంబానీ కుటుంబం సేవా కార్యక్రమాలు

    అంబానీ కుటుంబం, రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలను చురుకుగా చేపడుతోంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో వారి కృషి లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చింది.

    ముఖ్య సేవా రంగాలు మరియు కార్యక్రమాలు:

    • విద్య మరియు నైపుణ్యాభివృద్ధి: స్కాలర్‌షిప్‌లకు నిధులను సమకూర్చడం, పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మరియు మహిళలు కెరీర్ నైపుణ్యాలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడటం.
    • గ్రామీణాభివృద్ధి: స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, అధునాతన నీటి సంరక్షణ ప్రాజెక్టులు చేపట్టడం, మరియు గ్రామీణ వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం.
    • ఆరోగ్య సంరక్షణ: ఆసుపత్రుల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను విస్తరించడం, మరియు దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం. వీరి దాతృత్వం కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది.

    ముకేశ్ అంబానీ మరియు నీతా అంబానీలు ఈ కార్యక్రమాల ద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు.

    క్రీడాభివృద్ధికి ప్రోత్సాహం

    సేవా కార్యక్రమాలతో పాటు, రిలయన్స్ ఫౌండేషన్ క్రీడా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాయకత్వం వహిస్తోంది. నీతా అంబానీ తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తూ, మహిళా అథ్లెట్లకు మద్దతు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించారు.

    గుర్తింపు పొందిన ఇతర భారతీయ దాతలు

    టైమ్స్ మ్యాగజైన్ జాబితాలో విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ (Azim Premji) మరియు జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) కూడా స్థానం పొందారు.

    అజీమ్ ప్రేమ్‌జీ సుమారు 25 సంవత్సరాల క్రితం తన ఫౌండేషన్‌ను స్థాపించి, 29 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను తన సంస్థ నుంచి ఫౌండేషన్‌కు బదిలీ చేశారు. పర్యావరణ పరిరక్షణ మరియు విద్య వంటి ప్రాజెక్టుల కోసం భారీ మొత్తంలో విరాళాలు అందించిన నిఖిల్ కామత్, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు.

  • బంగారం కొనడానికి మంచి తరుణం!.. తగ్గిన గోల్డ్ రేటు: నేటి ధరలు ఇలా..

    బంగారం కొనడానికి మంచి తరుణం!.. తగ్గిన గోల్డ్ రేటు: నేటి ధరలు ఇలా..

    Gold and Silver Price: బంగారం ధరలు పడిలేస్తున్న కెరటంలా.. తగ్గుతూ, పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు (మే 20) పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలలో మార్పు జరిగింది. తులం గోల్డ్ రేటు సుమారు రూ. 95,000 వద్ద నిలిచాయి. ఈ కథనంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఢిల్లీ, ముంబై మరియు చెన్నై వంటి నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.

    ఢిల్లీలో బంగారం ధరలు

    దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధరలు (Gold Price) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 450 తగ్గి.. రూ. 87,250 వద్ద నిలిచింది, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 490 తగ్గి.. రూ. 95,170 వద్ద నిలిచింది. నిన్న (సోమవారం) స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు తగ్గుముఖం పట్టడంతో.. బంగారం ధరల్లో మార్పులు జరిగాయి.

    తెలుగు రాష్ట్రాలు & ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

    ఇక తెలుగు రాష్ట్రాల (తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్) విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 450 తగ్గి.. రూ. 87,100 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 490 తగ్గి.. రూ. 95,020 వద్ద ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నై మరియు బెంగుళూరులలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

    వెండి ధరలు (Silver Price)

    గోల్డ్ రేటు మాత్రమే కాకుండా.. సిల్వర్ రేటు కూడా తగ్గింది. నేడు (మంగళవారం) వెండి ధరలు గరిష్టంగా రూ. 1,000 తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై మరియు బెంగుళూరులలో కేజీ వెండి రేటు రూ. 1,08,000 వద్ద నిలిచింది. అంటే ఒక గ్రామ్ వెండి ధర 108 రూపాయలన్నమాట. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ సిల్వర్ రేటు రూ. 97,000 వద్ద ఉంది. ఇక్కడ కూడా కేజీ ధర రూ. 1,000 తగ్గింది.

    బంగారం ధరల భవిష్యత్తు: నిపుణుల విశ్లేషణ

    అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే.. బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చైనా మరియు అమెరికా పరస్పర సుంకాలను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా.. చెన్నైలో విస్తృతమైన బంగారు నిల్వలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో బంగారం ఉన్నప్పుడు.. కావలసినంత సరఫరా ఉంటుంది. సరఫరా పెరిగినప్పుడు.. ధరలు తప్పకుండా తగ్గుతాయి. భారతదేశంలో లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తున్నాయి. ఇది పసిడి ప్రియులకు ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. బహుశా ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.

    ఇదిలా ఉండగా.. కొంతమంది పరిశోధకులు సంవత్సరాలుగా కష్టపడి పరిశోధనలు చేస్తూ.. సీసం నుంచి బంగారం తయారు చేసే విధానం కనిపెట్టారని చెబుతున్నారు. ఇది పూర్తిగా విజయవంతం అయితే.. బంగారం బఠానీల్లా దొరుకుతుందని పరిశోధకులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

  • హోండా నుంచి సరికొత్త CMX500 రెబెల్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?

    హోండా నుంచి సరికొత్త CMX500 రెబెల్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?

    Honda CMX500 Rebel: దాదాపు అన్ని టూ వీలర్ కంపెనీలు కొత్త వెహికల్స్ లాంచ్ చేస్తున్న తరుణంలో.. హోండా మోటార్‌సైకిల్ (Honda MotorCycle) కంపెనీ, దేశీయ విఫణిలో సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ పేరు ‘సీఎమ్ఎక్స్500 రెబెల్’ (CMX500 Rebel).

    ధర & బుకింగ్స్

    ఈ కొత్త బైక్ ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ కేవలం గురుగ్రామ్, ముంబై మరియు బెంగళూరులలోని బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే ప్రత్యేకంగా విక్రయించనుంది.

    హోండా మోటార్‌సైకిల్ కంపెనీ.. ఈ కొత్త రెబల్ 500 బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జూన్ నుంచి ప్రారంభమవుతాయి.

    కొత్త హోండా రెబెల్ బైక్ బ్లాక్ అవుట్ థీమ్ కలిగి.. ఒకే మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. సీఎమ్ఎక్స్500 రెబెల్ బైక్.. దాని ఎన్ఎక్స్500 బైకు కంటే రూ. 78000 తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అదే సమయంలో ప్రత్యర్థి కవాసకి ఎలిమినేటర్ 500 కంటే రూ. 64000 తక్కువ ధరకే లభిస్తుంది. మొత్తం మీద దీని ధర అధికంగా ఉండటానికి ప్రధాన కారణం.. ఈ బైకును కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకోవడమే అని తెలుస్తోంది.

    డిజైన్

    చూడటానికి అత్యద్భుతమైన డిజైన్ కలిగిన ఈ బైక్.. హై-మౌంటెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, కిందికి ఉన్న సీటు, కొంచెం ఇరుగ్గా ఉన్న పిలియన్ సీటు వంటి వాటిని పొందుతుంది.

    ఇంజిన్ వివరాలు

    సీఎమ్ఎక్స్500 రెబెల్ బైక్ 471 సీసీ ఇన్‌లైన్-2 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి.. 46 హార్స్ పవర్, 43.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి పనితీరు రైడర్లను అబ్బురపరుస్తుందని భావిస్తున్నాము.

    వీల్స్, బ్రేక్స్ & ఇతర ముఖ్య ఫీచర్లు

    ఈ బైక్ 16 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అయితే ముందు వీల్ 130 సెక్షన్ టైర్ ఉపయోగిస్తే.. వెనుక వీల్ 150 సెక్షన్ టైర్ ఉపయోగిస్తుంది. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. నెగటివ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగిన రెబల్ 500 బైక్.. ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ చాసిస్ పొందుతుంది. దీని సీటు ఎత్తు 690 మిమీ వరకు ఉంది. సుమారు 11.2 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ మొత్తం బరువు 195 కేజీలు కావడం గమనార్హం. దీని బరువు ఇప్పటికే మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైక్‌లకు సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

    హోండా రెబెల్ 500 సేల్స్ అంచనా..

    భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన హోండా మోటార్‌సైకిల్ కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. ఇప్పుడు తాజాగా రెబల్ 500 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్ బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. ఈ కారణంగానే ఇది ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే దీని ధర దాని ప్రత్యర్థుల కంటే కొంత ఎక్కువగా ఉండటం చేత.. ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలుసుకోవాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.