Tag: 10th Jobs

  • 10వ తరగతితో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం: పోస్టులు, పరీక్ష విధానం & జీతం వివరాలు

    10వ తరగతితో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం: పోస్టులు, పరీక్ష విధానం & జీతం వివరాలు

    Bank of Baroda Recruitment: డిగ్రీలు పూర్తిచేసినా.. ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం ఒక కలగా మారిపోతుంది. సరైన సమయానికి నోటిఫికేషన్ లేకుండా.. సంవత్సరాల తరబడి, చాలామంది అభ్యర్థులు లేదా విద్యార్థులు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అలంటి వారికి ఇప్పుడు ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ (Bank Of Baroda) ఓ శుభవార్త చెప్పింది. ఏకంగా 500 ఉద్యోగాలను నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం 10వ తరగతి పూర్తి చేసినవారు ఈ బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. ఈ కథనంలో అర్హతలతో పాటు.. పరీక్ష విధానం మరియు పోస్టుల వివరాలు వంటివన్నీ వివరంగా తెలుసుకుందాం..

    బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు: ముఖ్య వివరాలు మరియు అర్హతలు

    ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన 500 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 2025 మే 25. అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

    • విద్యార్హత: 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
    • వయోపరిమితి: 2025 మే 1వ తేదీ నాటికి 18 నుంచి 26 ఏళ్ల వయసున్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
    • వయోపరిమితి సడలింపు: ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళ వయసు సడలింపు ఉంటుంది.
    • భాషా పరిజ్ఞానం: ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు స్థానిక భాష చదవడం మరియు రాయడం తెలిసి ఉండాలి.

    రాష్ట్రాల వారీగా ఖాళీలు

    బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన మొత్తం 500 ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో ఉన్న ఖాళీల వివరాలు:

    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో: 22 ఖాళీలు
    • తెలంగాణాలో: 13 ఖాళీలు

    బ్యాంక్ నిర్వహించే పరీక్షలో ఎంపికైన తరువాత రాష్ట్రంలోని బ్రాంచిలలో పనిచేయాల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

    ఎంపిక ప్రక్రియ

    బ్యాంక్ నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఆరు నెలలు ప్రొబేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పర్మినెంట్ ఉద్యోగులుగా కొనసాగుతారు. పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమకు కావాలసిన భాషను ఎంచుకోవచ్చు.

    జీతం మరియు రాత పరీక్ష విధానం

    జీతం వివరాలు

    బ్యాంక్ ఆఫ్ బరోడా పరీక్ష ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నెలకు సుమారు రూ.19,500 వేతనంతో పాటు.. డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, స్పెషల్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ మరియు మెడికల్ బెనిఫిట్స్ పొందవచ్చు.

    రాత పరీక్ష విధానం

    మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సబ్జెక్టులు మరియు మార్కుల కేటాయింపు ఈ క్రింది విధంగా ఉంటుంది:

    • ఇంగ్లీష్: 25 మార్కులు
    • జనరల్ అవేర్‌నెస్: 25 మార్కులు
    • అర్థమెటిక్: 25 మార్కులు
    • రీజనింగ్: 25 మార్కులు

    పరీక్ష వ్యవధి: 80 నిముషాలు.

    ముఖ్య గమనిక: నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. కాబట్టి ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి. పరీక్ష రాసే అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఎప్పుడనే విషయం తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ చూస్తూ ఉండాలి. పరీక్షకు బహుశా తక్కువ వ్యవధి ఉంటుంది, కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం సిద్దమవ్వడం ఉత్తమం.