Tag: Hatchback

  • రూ.6.89 లక్షల టాటా కారు: తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు

    రూ.6.89 లక్షల టాటా కారు: తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు

    2025 Tata Altroz Facelift: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ చెప్పినట్లుగానే.. ఇండియన్ మార్కెట్లో 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ (2025 Altroz Facelift) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర, బుకింగ్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..

    1) ధరలు & వేరియంట్స్

    టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 6.89 లక్షల నుంచి రూ. 11.49 లక్షల (ధరలు ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ ధరలు స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 24000 ఎక్కువ. కాగా కంపెనీ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జూన్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. ఆ తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయి.

    2) డిజైన్

    కొత్త 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయమైన డిజైన్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, 3డీ ఫినిషింగ్‌తో రీడిజైన్ చేయబడిన బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ వంటి వాటితో పాటు.. రియర్ ప్రొఫైల్.. బ్లాక్డ్ అవుట్ టెయిల్‌గేట్ పొందుతుంది. కానీ కొన్ని టాప్ వేరియంట్లలో ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్ ఉంటుంది.

    3) ఫీచర్స్

    ఐదు వేరియంట్లలో లభించే ఫేస్‌లిఫ్టెడ్ టాటా ఆల్ట్రోజ్.. రీడిజైన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. ఇందులో ప్రధాన ఫీచర్లు:

    • 2 స్పోక్ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్
    • రీడిజైన్డ్ గేర్ లివర్
    • రీడిజైన్డ్ ఏసీ వెంట్స్
    • రీడిజైన్డ్ ఏసీ కంట్రోల్స్
    • 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం
    • 10.25 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
    • 360 డిగ్రీ కెమెరా
    • వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్
    • రియర్ ఏసీ వెంట్స్
    • కీలెస్ ఎంట్రీ
    • క్రూయిజ్ కంట్రోల్
    • బ్లైండ్ స్పాట్ మానిటరింగ్

    వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

    4) పవర్‌ట్రెయిన్

    2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కింది ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది:

    • 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్: 87 Bhp పవర్, 115 Nm టార్క్
    • 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్: 88 Bhp పవర్, 200 Nm టార్క్
    • CNG ఇంజిన్

    ఈ ఇంజిన్స్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. ఇవి మీరు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

    5) సేఫ్టీ ఫీచర్స్ & ప్రత్యర్థులు

    కొత్త 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో ఉండే ప్రధాన సేఫ్టీ ఫీచర్లు:

    • 6 ఎయిర్‌బ్యాగులు
    • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
    • ఏబీఎస్ విత్ ఈబీడీ (ABS with EBD)
    • ఇంకా మరెన్నో ఆధునిక సేఫ్టీ ఫీచర్లు.

    కంపెనీ యొక్క ఇతర మోడల్స్ మాదిరిగానే ఇది కూడా గొప్ప సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని స్పష్టమవుతోంది. కాగా ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ ఐ20, మారుతి సుజుకి బాలెనొ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము.

  • లాంచ్‌కు సిద్దమైన 2025 ఆల్ట్రోజ్ పేస్‌లిఫ్ట్ ఇదే.. పూర్తి వివరాలు

    లాంచ్‌కు సిద్దమైన 2025 ఆల్ట్రోజ్ పేస్‌లిఫ్ట్ ఇదే.. పూర్తి వివరాలు

    2025 Tata Altroz Facelift: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్, ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో తన సరసమైన కారు ‘ఆల్ట్రోజ్’ను విజయవంతంగా విక్రయిస్తోంది. ఇప్పుడు, ఈ ఆల్ట్రోజ్ శ్రేణిలో అప్‌డేటెడ్ మోడల్ లేదా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ (2025 ఆల్ట్రోజ్) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22న అధికారికంగా భారతీయ విఫణిలో అడుగెట్టనున్న ఈ సరికొత్త ఆల్ట్రోజ్ వివరాలు, లాంచ్‌కు ముందే కొన్ని ఆసక్తికరమైన అంశాలతో వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    2025 టాటా ఆల్ట్రోజ్

    2020లో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన టాటా ఆల్ట్రోజ్ కారు, మొదటి నుంచే అద్భుతమైన అమ్మకాలు సాధిస్తూ వినియోగదారుల ఆదరణ పొందింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్‌లోని పోటీని తట్టుకుని, కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ ఈ కారును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే, టర్బో పెట్రోల్ మరియు CNG మోడల్స్ కూడా లాంచ్ చేసి తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఇప్పుడు 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదలతో మరో ముందడుగు వేయనుంది.

    డిజైన్ అప్డేట్స్

    సరికొత్త 2025 ఆల్ట్రోజ్ చూడటానికి దాదాపు ప్రస్తుతం ఉన్న మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ, కొన్ని కీలకమైన మార్పులతో రానుంది.

    ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్

    • ఈ కారులోని హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ల స్థానంలో, ఎంబెడెడ్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన కొత్త ఎల్ఈడీ ప్రొజెక్టర్ యూనిట్స్ అమర్చారు.
    • క్లోజ్డ్ గ్రిల్ షేప్ సరికొత్త ఫినిషింగ్ పొందుతుంది.
    • బంపర్ డిజైన్ కూడా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
    • వెనుక వైపు ఇన్ఫినిటీ ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్‌లతో జతచేయబడిన బ్లాక్ అవుట్ టెయిల్‌గేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

    ఇంటీరియర్

    హ్యుందాయ్ ఐ20 మరియు మారుతి సుజుకి బాలెనొ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా, టాటా ఆల్ట్రోజ్ అప్డేటెడ్ డ్యాష్‌బోర్డ్ మరియు అనేక నూతన ఫీచర్లను పొందుతుంది. ఏసీ కంట్రోల్స్ మరియు టాప్ మోడళ్లలో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా అనేక అప్డేట్స్ ఉన్నాయి.

    ఇంజన్ ఆప్షన్స్

    సరికొత్త ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ మరియు CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌తో వస్తుందని సమాచారం. అంతే కాకుండా, టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

    వేరియంట్లు

    2025 టాటా ఆల్ట్రోజ్ ఐదు ప్రధాన వేరియంట్లలో లాంచ్ అవుతుందని సమాచారం. అవి:

    • స్మార్ట్ (Smart)
    • ప్యూర్ (Pure)
    • క్రియేటివ్ (Creative)
    • అకంప్లిష్డ్ ఎస్ (Accomplished S)
    • అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ (Accomplished Plus S)

    కంపెనీ వీటి ధరలను లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయనేది కూడా త్వరలోనే తెలియజేస్తారు.

    వేరియంట్స్ వారీగా ఫీచర్స్

    ➤ స్మార్ట్ ట్రిమ్:

    • ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
    • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
    • ఎల్ఈడీ టెయిల్ లాంప్‌లు
    • ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు
    • ఫ్లష్ సెట్టింగ్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్

    ➤ ప్యూర్ ట్రిమ్:

    • 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    • ఆటో ఫోల్డ్ వింగ్ మిర్రర్స్
    • ఆటో క్లైమేట్ కంట్రోల్
    • ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్
    • రివర్స్ కెమెరా
    • క్రూయిజ్ కంట్రోల్
    • సన్‌రూఫ్ (ఆప్షనల్)

    ➤ క్రియేటివ్ ట్రిమ్:

    • 360 డిగ్రీ కెమెరా
    • 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    • కీలెస్ గో
    • రియర్ ఏసీ వెంట్స్
    • యాంబియంట్ లైటింగ్
    • సన్‌రూఫ్ (ఆప్షనల్)

    ➤ అకంప్లిష్డ్ ట్రిమ్:

    • 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్
    • 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
    • ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్
    • వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్
    • ఇన్ఫినిటీ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్
    • సన్‌రూఫ్
    • కాంట్రాస్ట్ ఫినిష్డ్ రూఫ్

    ➤ అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ ట్రిమ్:

    • 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
    • కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
    • బ్లైండ్ స్పాట్ మానిటరింగ్
    • ఎయిర్ ప్యూరిఫైయర్
    • మరిన్ని టాప్-ఎండ్ ఫీచర్లు