Tag: Honda CMX500 Rebel

  • హోండా నుంచి సరికొత్త CMX500 రెబెల్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?

    హోండా నుంచి సరికొత్త CMX500 రెబెల్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?

    Honda CMX500 Rebel: దాదాపు అన్ని టూ వీలర్ కంపెనీలు కొత్త వెహికల్స్ లాంచ్ చేస్తున్న తరుణంలో.. హోండా మోటార్‌సైకిల్ (Honda MotorCycle) కంపెనీ, దేశీయ విఫణిలో సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ పేరు ‘సీఎమ్ఎక్స్500 రెబెల్’ (CMX500 Rebel).

    ధర & బుకింగ్స్

    ఈ కొత్త బైక్ ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ కేవలం గురుగ్రామ్, ముంబై మరియు బెంగళూరులలోని బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే ప్రత్యేకంగా విక్రయించనుంది.

    హోండా మోటార్‌సైకిల్ కంపెనీ.. ఈ కొత్త రెబల్ 500 బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జూన్ నుంచి ప్రారంభమవుతాయి.

    కొత్త హోండా రెబెల్ బైక్ బ్లాక్ అవుట్ థీమ్ కలిగి.. ఒకే మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. సీఎమ్ఎక్స్500 రెబెల్ బైక్.. దాని ఎన్ఎక్స్500 బైకు కంటే రూ. 78000 తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అదే సమయంలో ప్రత్యర్థి కవాసకి ఎలిమినేటర్ 500 కంటే రూ. 64000 తక్కువ ధరకే లభిస్తుంది. మొత్తం మీద దీని ధర అధికంగా ఉండటానికి ప్రధాన కారణం.. ఈ బైకును కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకోవడమే అని తెలుస్తోంది.

    డిజైన్

    చూడటానికి అత్యద్భుతమైన డిజైన్ కలిగిన ఈ బైక్.. హై-మౌంటెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, కిందికి ఉన్న సీటు, కొంచెం ఇరుగ్గా ఉన్న పిలియన్ సీటు వంటి వాటిని పొందుతుంది.

    ఇంజిన్ వివరాలు

    సీఎమ్ఎక్స్500 రెబెల్ బైక్ 471 సీసీ ఇన్‌లైన్-2 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి.. 46 హార్స్ పవర్, 43.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి పనితీరు రైడర్లను అబ్బురపరుస్తుందని భావిస్తున్నాము.

    వీల్స్, బ్రేక్స్ & ఇతర ముఖ్య ఫీచర్లు

    ఈ బైక్ 16 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అయితే ముందు వీల్ 130 సెక్షన్ టైర్ ఉపయోగిస్తే.. వెనుక వీల్ 150 సెక్షన్ టైర్ ఉపయోగిస్తుంది. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. నెగటివ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగిన రెబల్ 500 బైక్.. ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ చాసిస్ పొందుతుంది. దీని సీటు ఎత్తు 690 మిమీ వరకు ఉంది. సుమారు 11.2 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ మొత్తం బరువు 195 కేజీలు కావడం గమనార్హం. దీని బరువు ఇప్పటికే మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైక్‌లకు సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

    హోండా రెబెల్ 500 సేల్స్ అంచనా..

    భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన హోండా మోటార్‌సైకిల్ కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. ఇప్పుడు తాజాగా రెబల్ 500 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్ బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. ఈ కారణంగానే ఇది ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే దీని ధర దాని ప్రత్యర్థుల కంటే కొంత ఎక్కువగా ఉండటం చేత.. ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలుసుకోవాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.