Tag: Luxury Cars

  • కారు పెయింట్ కోసం రూ. కోటి!.. ఇది కదా అంబానీ అంటే

    కారు పెయింట్ కోసం రూ. కోటి!.. ఇది కదా అంబానీ అంటే

    Ambani Rolls Royce Cullinan Gets Paint Job Worth Rs One Crore: భారతీయ కుబేరుడు, ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచిన ముకేశ్ అంబానీ గురించి, వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పారిశ్రామిక వేత్తల్లో అగ్రగామిగా ఉన్న వీరి జీవన విధానం కూడా చాలా విలాసవంతంగా ఉంటుంది. ఇందులో భాగంగానే వీరు రోజువారీ ప్రయాణానికి కూడా ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరు తమ కారు పెయింటింగ్ కోసమే కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    అంబానీ రోల్స్ రాయిస్ కల్లినన్: పెయింట్‌కే కోటి రూపాయలు!

    జీవితంలో ఒక్కరోజైనా రోల్స్ రాయిస్ కారులో తిరగాలని చాలామంది కలలు కంటారు. అయితే అంబానీ ఫ్యామీలీ మాత్రం ఏకంగా 10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉంది. ఇందులో ఒక రోల్స్ రాయిస్ కల్లినన్ పెయింట్ కోసం మాత్రమే రూ.1 కోటి ఖర్చు చేశారు.

    జియో గ్యారేజిలోని అనేక ఖరీదైన అన్యదేశ్య కార్లలో.. రోల్స్ రాయిస్ కల్లినన్ చాలా ప్రత్యేకం. ఈ కారుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కారు ధర రూ. 13.14 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం. ఇది బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ కాదు, సాధారణ వెర్షన్ మాత్రమే. దీని ప్రారంభ ధర రూ. 6.95 కోట్లు (ఎక్స్ షోరూమ్) మాత్రమే అయినప్పటికీ, దీని పెయింట్ కోసం రూ.1 కోటి.. ఇతరత్రా కస్టమైజేషన్ కోసం కూడా భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

    కస్టమైజేషన్ తో పెరిగిన కల్లినన్ ధర

    రోల్స్ రాయిస్ ధరలు ఎక్కువే అయినప్పటికీ.. కస్టమైజేషన్ కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కస్టమైజేషన్ కోసం పెట్టే ఖర్చు వల్లనే.. ఈ బ్రాండ్ ధరలు భారీగా ఉంటాయి. అంబానీ ఫ్యామిలీ.. కల్లినన్ కారును తమ అభిరుచికి తగిన విధంగా మార్చుకోవడానికి రూ. 13 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేశారు. ఇది ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందింది. ఇవి కాకుండా.. ఈ కారులో ఏ పరికరాలను కస్టమైజ్ చేసారో వెల్లడికాలేదు.

    నెంబర్ ప్లేట్ కోసమే రూ. 12 లక్షలు

    అంబానీ రోల్స్ రాయిస్ కల్లినన్ కారుకు ప్రత్యేక పెయింట్ స్కీమ్ మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్ నెంబర్ 0001 కోసం రూ. 12 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారును వారు ఎంత ప్రత్యేకంగా రూపొందించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

    అంబానీ గ్యారేజీలోని ఇతర ఖరీదైన కార్లు

    రిలయన్స్ అధినేత అంబానీ గ్యారేజిలో కేవలం రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా.. కాంతిని బట్టి రంగులు మార్చే ‘బెంట్లీ బెంటాయెగా’ (రూ.4 కోట్లు) కూడా ఉంది. ఇది కాకుండా.. మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని, బిఎండబ్ల్యూ మరియు ఆస్టన్ మార్టిన్ వంటి సుమారు 170 కార్లు ఉన్నట్లు సమాచారం. ఈ కార్ల మొత్తం ధర రూ. వంద కోట్లు కంటే ఎక్కువ కావడం గమనార్హం.

  • మరో బెంజ్ కారు కొన్న నటి ‘సోనియా సింగ్’ – రెండు నెలల్లో రెండో లగ్జరీ కారు!

    మరో బెంజ్ కారు కొన్న నటి ‘సోనియా సింగ్’ – రెండు నెలల్లో రెండో లగ్జరీ కారు!

    Sonia Singh Mercedes Benz: ఇటీవల కాలంలో కార్లను కొనుగోలు చేస్తున్న సినీ తారలు సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా ఈ జాబితాలోకి నటి ‘సోనియా సింగ్’ చేరారు. గత నెలలో మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ కారును కొనుగోలు చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సరికొత్త బెంజ్ జీఎల్ఎస్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    సోనియా సింగ్ కొన్న కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్

    సోనియా సింగ్ కొనుగోలు చేసిన లేటెస్ట్ కారు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ అని తెలుస్తోంది. దేశీయ విఫణిలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఒకటైన ఈ కారును ఇప్పటికే పలువురు ప్రముఖ సెలబ్రిటీలు కూడా సొంతం చేసుకున్నారు.

    ధర

    దీని ధర ఇండియన్ మార్కెట్లో సుమారు రూ. 1.60 కోట్లు (ఎక్స్ షోరూమ్) అని సమాచారం. సోనియా ఈ కొత్త కారుకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించడానికి దేవాలయానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

    ఇంజిన్ & పర్ఫామెన్స్

    అత్యధునికి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ తో లభిస్తుంది:

    • పెట్రోల్ ఇంజిన్: 2989 సీసీ ఇంజిన్, 362 Bhp పవర్, 500 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
    • డీజిల్ ఇంజిన్: 2999 సీసీ ఇంజిన్, 375 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది.

    ఈ రెండు ఇంజిన్ వేరియంట్లు కూడా ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం కలిగి ఉండి, ఉత్తమ పనితీరును అందిస్తాయి.

    ఇంతకు ముందే బెంజ్ సి-క్లాస్

    విశేషమేమిటంటే, సోనియా సింగ్ తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్దుతో కలిసి.. మార్చి 2025లో కూడా ఒక బెంజ్ సీ-క్లాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

    ఆ కారు ధరలు సుమారు రూ. 60 లక్షల నుంచి రూ. 80 లక్షల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోని 1999 సీసీ హైబ్రిడ్ ఇంజిన్ 255 Bhp పవర్, 400 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ.

    రెండు నెలల్లో రెండో బెంజ్ కారు

    బెంజ్ కారు కొనుగోలు చేయడం చాలా మందికి ఒక కల. అలాంటిది రెండు నెలల వ్యవధిలోనే రెండు బెంజ్ కార్లను సొంతం చేసుకోవడం విశేషం. సెలబ్రిటీలలో కూడా ఇలాంటి ఘటన అరుదుగా కనిపిస్తుంది. ఈ ఘనత బహుశా సోనియాకే దక్కింది. కొత్త కారు కొన్న సోనియాకు ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    ఎవరీ సోనియా సింగ్?

    సోనియా సింగ్ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. యూట్యూబ్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత చిన్న చిన్న టీవీ షోలలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ‘విరూపాక్ష’ సినిమాలో కీలక పాత్రలో నటించి తన అందం, అభినయంతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత నితిన్, శ్రీలీల నటించిన ‘ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్’ సినిమాలో కూడా ఓ కామెడీ రోల్ ప్లే చేసింది.