Tag: MPV India

  • కియా కారెన్స్ క్లావిస్ ధరలు తెలిసిపోయాయ్: ఇదిగో ఫుల్ డీటెయిల్స్

    కియా కారెన్స్ క్లావిస్ ధరలు తెలిసిపోయాయ్: ఇదిగో ఫుల్ డీటెయిల్స్

    Kia Carens Clavis Launched: ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘కియా కారెన్స్ క్లావిస్’ ధరలు అధికారికంగా వెల్లడైపోయాయి. కంపెనీ ఈ కారు కోసం ఇప్పటికే రూ.25,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభించేసింది. ఇది స్టాండర్డ్ కారెన్స్ కారుతో పాటు విక్రయానికి ఉంటుంది.

    వేరియంట్స్ & ధరలు

    కొత్త కియా కారెన్స్ క్లావిస్ మొత్తం ఏడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 11.50 లక్షల నుంచి రూ. 18.00 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇవన్నీ 7 సీటర్ మరియు 6 సీటర్ రూపంలో అమ్మకానికి ఉంటాయి. అయితే కంపెనీ వీటిని పెట్రోల్, టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందిస్తుంది.

    డిజైన్ మరియు ఎక్స్‌టీరియర్

    కియా కారెన్స్ క్లావిస్ పూర్తిగా కొత్త డిజైన్ పొందుతుంది. ముందు భాగంలో త్రిభుజాకారంలో ఫిక్స్ చేయబడిన మూడు ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉన్నాయి. వీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, బ్లాక్డ్ ఆఫ్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లతో కూడిన బ్లాక్ క్లాడింగ్ వంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వీల్ ఆర్చెస్ మరియు డోర్స్ వరకు బ్లాక్ క్లాడింగ్ ఉండటం చూడవచ్చు. సిల్హౌట్ అలాగే ఉంది. డ్యూయెల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ రూఫ్ రెయిల్ కోసం కొత్త డిజైన్.. వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయి. అయితే రియర్ ప్రొఫైల్ దాదాపు.. కారెన్స్ మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇంటీరియర్ ఫీచర్లు

    సరికొత్త కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అనేక ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి:

    • 22.62 ఇంచెస్ డ్యూయెల్ స్క్రీన్ సెటప్ (డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్). ఇది కియా సెల్టోస్ కారులో కూడా కనిపిస్తుంది.
    • వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్
    • రీ డిజైన్ చేయబడిన ఏసీ వెంట్స్
    • ఆటోమాటిక్ ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్స్
    • డ్యూయెల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్
    • ఫోర్ వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు
    • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే
    • 8 స్పీకర్ బోస్ (Bose) సౌండ్ సిస్టం

    సేఫ్టీ ఫీచర్స్

    కారు అనగానే మైలేజ్ మాత్రమే కాదు సేఫ్టీ ఫీచర్స్ కూడా ప్రధానమే. దీనిని దృష్టిలో ఉంచుకుని కియా మోటార్స్ తన కారెన్స్ క్లావిస్ కారులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ప్రవేశపెట్టింది. అవి:

    • లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS)
    • 360 డిగ్రీ కెమెరా
    • బ్లైండ్ స్పాట్ మానిటరింగ్
    • లేన్ కీప్ అసిస్ట్
    • రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్
    • ఆరు ఎయిర్‌బ్యాగులు
    • ఏబీఎస్ విత్ ఈబీడీ
    • హిల్ స్టార్ట్ అసిస్ట్
    • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం
    • నాలుగు డిస్క్ బ్రేకులు

    ఇవన్నీ ప్రయాణికులకు భద్రత కల్పించడంలో సహాయపడతాయి.

    ఇంజిన్ ఆప్షన్స్ మరియు పనితీరు

    కియా కారెన్స్ క్లావిస్ మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి:

    • 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్: 157 హార్స్ పవర్ & 253 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
    • 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్: 113 హార్స్ పవర్ & 143.8 Nm టార్క్ అందిస్తుంది.
    • 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్: 113 హార్స్ పవర్ & 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

    ఇవన్నీ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.

    మార్కెట్లో పోటీదారులు

    ఇండియన్ మార్కెట్లో ఎంపీవీలకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కియా యొక్క కొత్త కారెన్స్ క్లావిస్ మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే అమ్మకాల పరంగా ఇది మారుతి సుజుకి ఎక్స్ఎల్6, టయోటా ఇన్నోవా క్రిష్టా, ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి ఇన్విక్టో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.