Suzuki E Access Electric Scooter: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ-యాక్సెస్’ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ స్కూటర్ ఉత్పత్తిని కంపెనీ గుర్గావ్‌లోని తన తయారీ ప్లాంట్‌లో శుక్రవారం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ స్కూటర్ అమ్మకాలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ధరలు కూడా రానున్న రోజుల్లో వెల్లడవుతాయి.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో సుజుకి ఈ-యాక్సెస్
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కనిపించిన సుజుకి ఈ-యాక్సెస్ స్కూటర్.. బ్రాండ్ యొక్క మొదటి స్కూటర్. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ స్కూటర్ లాంచ్ చేస్తోంది. ఈ స్కూటర్ లేటెస్ట్ ఈ టెక్నాలజీని కలిగి.. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ పొందుతుంది.
సుజుకి ఈ-యాక్సెస్: బ్యాటరీ ఫీచర్లు మరియు భద్రత
లిథియం ఐరన్ బ్యాటరీ.. ఎక్కువ మన్నికగా ఉంటుంది. మెరుగైన ఉష్ణ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్ మోడ్‌తో పాటు.. ఎకో, రైడ్ ఏ, రైడ్ బీ మోడ్స్ వంటివి ఉంటాయి. బ్యాటరీ చాలా పటిష్టంగా ఉంటుంది. బ్యాటరీ భాగాలను కంపెనీ సబ్‌మెర్షన్, ఉష్ణోగ్రత తీవ్రతలు, డ్రాప్స్, వైబ్రేషన్స్, మోటార్ బెంచ్, పంక్చర్ మరియు క్రాష్ టెస్ట్ వంటి కఠినమైన పరీక్షలకు గురిచేస్తుంది.
కొత్త సుజుకి ఈ-యాక్సెస్: స్పెసిఫికేషన్స్ మరియు పనితీరు
కొత్త సుజుకి ఈ-యాక్సెస్ స్కూటర్ ఫిక్స్‌డ్ టైప్ 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 95 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఫోర్డబుల్ ఛార్జర్ ఉపయోగించి.. 6 గంటల 12 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ చేయడానికి పట్టే సమయం 2 గంటల 12 నిముషాలు మాత్రమే. ఇందులో మోటార్ 5.5 హార్స్ పవర్, 15 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
సుజుకి ఈ-యాక్సెస్: డిజైన్, ఫీచర్లు మరియు అంచనా ధర
కనెక్టెడ్ కలర్ డిస్‌ప్లే కలిగిన సుజుకి ఈ-యాక్సెస్ స్కూటర్.. రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. డీలర్‌షిప్‌లు కూడా ఈ స్కూటర్ వినియోగానికి సంబంధించిన వివరాలను కూడా కస్టమర్లకు వెల్లడిస్తారు. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ స్కూటర్ ధరలను వెల్లడించలేదు. దీని ధర రూ. 1.0 లక్ష నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ధరలకు సంబంధించిన అధికారిక ప్రకటన కంపెనీ చేయాల్సి ఉంది.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా గురించి
జపాన్‌కు చెందిన సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ.. ఫిబ్రవరి 2006లో హర్యానాలోకి గురుగ్రామ్‌లోని ఖేర్కి దౌలాలోని దాని తయారీ ప్లాంట్ నుంచి కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ప్లాన్ వార్షిక వృద్ధి 13 లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఈ ప్లాంట్‌లో 125 సీసీ స్కూటర్లు, 150 సీసీ మోటార్‌సైకిల్స్ లేదా అంతకంటే ఎక్కువ సీసీ బైకులను తయారు చేస్తుంది.