2025 Tata Altroz Facelift: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ చెప్పినట్లుగానే.. ఇండియన్ మార్కెట్లో 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ (2025 Altroz Facelift) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర, బుకింగ్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..
1) ధరలు & వేరియంట్స్
టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 6.89 లక్షల నుంచి రూ. 11.49 లక్షల (ధరలు ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ ధరలు స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 24000 ఎక్కువ. కాగా కంపెనీ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జూన్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. ఆ తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయి.
2) డిజైన్
కొత్త 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయమైన డిజైన్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, 3డీ ఫినిషింగ్‌తో రీడిజైన్ చేయబడిన బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ వంటి వాటితో పాటు.. రియర్ ప్రొఫైల్.. బ్లాక్డ్ అవుట్ టెయిల్‌గేట్ పొందుతుంది. కానీ కొన్ని టాప్ వేరియంట్లలో ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్ ఉంటుంది.
3) ఫీచర్స్
ఐదు వేరియంట్లలో లభించే ఫేస్‌లిఫ్టెడ్ టాటా ఆల్ట్రోజ్.. రీడిజైన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. ఇందులో ప్రధాన ఫీచర్లు:
- 2 స్పోక్ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్
- రీడిజైన్డ్ గేర్ లివర్
- రీడిజైన్డ్ ఏసీ వెంట్స్
- రీడిజైన్డ్ ఏసీ కంట్రోల్స్
- 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం
- 10.25 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- 360 డిగ్రీ కెమెరా
- వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్
- రియర్ ఏసీ వెంట్స్
- కీలెస్ ఎంట్రీ
- క్రూయిజ్ కంట్రోల్
- బ్లైండ్ స్పాట్ మానిటరింగ్
వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.
4) పవర్‌ట్రెయిన్
2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కింది ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది:
- 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్: 87 Bhp పవర్, 115 Nm టార్క్
- 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్: 88 Bhp పవర్, 200 Nm టార్క్
- CNG ఇంజిన్
ఈ ఇంజిన్స్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. ఇవి మీరు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.
5) సేఫ్టీ ఫీచర్స్ & ప్రత్యర్థులు
కొత్త 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో ఉండే ప్రధాన సేఫ్టీ ఫీచర్లు:
- 6 ఎయిర్‌బ్యాగులు
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
- ఏబీఎస్ విత్ ఈబీడీ (ABS with EBD)
- ఇంకా మరెన్నో ఆధునిక సేఫ్టీ ఫీచర్లు.
కంపెనీ యొక్క ఇతర మోడల్స్ మాదిరిగానే ఇది కూడా గొప్ప సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని స్పష్టమవుతోంది. కాగా ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ ఐ20, మారుతి సుజుకి బాలెనొ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము.