Telangana Government Jobs: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. నిరుద్యోగులు కోరుకునేది మాత్రం సకాలంలో నోటిఫికేషన్. తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగానే 2024 – 25 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ జారీ చేసింది. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా సన్నద్ధమవుతోంది. దీనికి తగిన విధంగానే జాబ్ క్యాలెండర్‌లో కొన్ని సవరణలు చేసే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే 20 వేలకంటే ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగాల జారీకి సన్నాహాలు మరియు ఎస్సీ వర్గీకరణ
ప్రభుత్వం అనుకున్న విధంగానే ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. అట్టడుగు వర్గాల వారికి కూడా న్యాయం జరిగేలా.. త్వరలో విడుదలకానున్న ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడానికి.. ప్రభుత్వ విభాగాల్లోనో ఖాళీలను గుర్తించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగానే.. ఈ క్రింది నియామకాలు చేపట్టనున్నారు:
- గ్రూప్స్
- టీచర్స్
- పోలీస్
- విద్యుత్తు
- గురుకుల
- వైద్య నియామకాలు
అంతే కాకుండా ఇందులో బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు కూడా ఉండనున్నట్లు సమాచారం.
వివిధ శాఖల్లో ఖాళీల అంచనా
ఆర్టీసీ మరియు వైద్య విభాగాల్లోని సుమారు 10వేల ఉద్యోగాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గురుకుల నియామకాల్లో సుమారు 2000 పోస్టులు బ్యాక్‌లాగ్‌గా ఉన్నట్లు, ఇతర ప్రభుత్వ విభాగాలు మరియు విద్యుత్ సంస్థలలోని ఇంజినీరింగ్ విభాగాల్లో దాదాపు 2000 నుంచి 3000 ఉద్యోగ ఖాళీలు ఉంటాయని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
నిరుద్యోగుల ఆశలు మరియు పోటీకి సన్నద్ధత
తెలంగాణ ప్రభుత్వం త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తే.. అంతకంటే శుభవార్త మరొకటి ఉండదని నిరుద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా.. మరింత గట్టిగా సన్నద్ధమవ్వాలి.
ప్రభుత్వం 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. కాబట్టి విడుదలయ్యే ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉంది. ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమవ్వాల్సి ఉంటుంది.
పట్టుదలతో ప్రయత్నించండి: విజయం మీదే!
ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మంది కల. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయినా ఉద్యోగానికి సిద్దమవుతున్నవారు చివరి నిమిషం వరకు ఏ మాత్రం నిరాశ చెందకుండా.. శ్రమించాలి. శ్రమలో లోపం లేకుండా ఉంటే.. ఆలస్యమైనా ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనటం అక్షర సాధ్యం. కాబట్టి ఇప్పుడు మీ ముందున్న అంశం ఉద్యోగం కోసం బాగా సిద్దమవ్వడమే.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే విషయంతో పాటు.. ఎగ్జామ్ డేట్, క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ ఫీజు వంటి ఇతర వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి.
Leave a Reply