ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు ఇదే: ధర మరియు పూర్తి వివరాలు ఇవే..

Volkswagen Golf GTI India Launch: చెప్పినట్లుగానే ఫోక్స్‌వ్యాగన్.. తన ‘గోల్ఫ్ జీటీఐ’ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫోక్స్‌వ్యాగన్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర మరియు బుకింగ్స్

కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు ధర రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశంలోకి వస్తుంది, ఈ కారణంగానే దీని ధర అధికంగా ఉంటుంది.

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కారు.. ప్రారంభంలో 150 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే ఈ కారును కేవలం 150 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులు. దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు మరో 100 యూనిట్లను విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్

లేటెస్ట్ డిజైన్ కలిగిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్‌ను పొందుతుంది. దీని ముఖ్యమైన ఎక్స్‌టీరియర్ ఫీచర్లు:

  • ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్
  • సన్నని డీఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్స్)
  • స్పోర్టీ డిజైన్ బంపర్
  • ఎక్స్-షేప్ ఎల్ఈడీ ఫాగ్ లైట్
  • గ్రిల్ మీద జీటీఐ బ్యాడ్జ్
  • ఫ్రంట్ డోర్స్ మరియు టెయిల్‌గేట్‌పై జీటీఐ బ్యాడ్జ్
  • 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్
  • రెడ్ బ్రేక్ కాలిపర్స్
  • ఎల్ఈడీ టెయిల్ లైట్స్
  • రూఫ్ స్పాయిలర్
  • రెండు ఎగ్జాస్ట్ టిప్స్

ప్రీమియం ఇంటీరియర్ మరియు ఫీచర్లు

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ లోపల ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి:

  • హెడ్‌రెస్ట్‌పై రెడ్ కలర్ జీటీఐ స్టిచ్చింగ్ కలిగిన స్పోర్ట్స్ సీట్లు (మధ్యలో సిగ్నేచర్ టార్టన్ ఇన్సర్ట్‌లతో)
  • లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్
  • 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
  • సన్‌రూఫ్
  • వైర్‌లెస్ ఛార్జర్
  • త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్
  • ప్యాడిల్ షిఫ్టర్లు
  • 30 కలర్ యాంబియంట్ లైటింగ్
  • హీటెడ్ ఫ్రంట్ సీట్లు

కలర్ అషన్స్ & సేఫ్టీ ఫీచర్స్

కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు నాలుగు ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్లలో లభిస్తుంది:

కలర్ ఆప్షన్స్:

  • గ్రెనడిల్లా బ్లాక్
  • కింగ్స్ రెడ్
  • మూన్‌స్టోన్ గ్రే
  • ఓరిక్స్ వైట్

భద్రత విషయంలో కూడా ఈ కారు అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది:

సేఫ్టీ ఫీచర్స్:

  • ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు
  • రియర్ వ్యూ కెమెరా
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం (TPMS)
  • ఐసోఫిక్స్ యాంకర్లు
  • ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్
  • లేన్ చేంజ్ అసిస్ట్
  • రియర్ ట్రాఫిక్ అలర్ట్
  • లెవెల్ 2 ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)

ఇంజిన్ మరియు పనితీరు

ఇక ప్రధానంగా చెప్పుకోదగ్గది ఇంజిన్. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 265 హార్స్ పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ (DSG) ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *