రూ. లక్షల ఆఫర్స్.. కొత్త కారు కొనుగోలుకు ఇదే మంచి సమయం

Car Discounts in 2024 August: పండుగ సీజన్ రాబోతోంది. కొత్త కారు కొనాలని చాలామందికి ఉంటుంది. అయితే డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ వంటివి ఉంటే బాగుంటుందని కూడా అనుకుంటారు. అనుకున్న విధంగానే పలు కంపెనీలు ఈ నెలలో (ఆగష్టు) అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించాయి. ఇందులో హోండా (Honda), మారుతి సుజుకి (Maruti Suzuki), హ్యుందాయ్ (Hyundai), ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్స్ ఇస్తుందో.. వివరంగా ఇక్కడ తెలుసుకోండి.

హోండా ఎలివేట్

కంపెనీ తన ఎలివేట్ కారు మీద రూ. 65000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫీట్స్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఉంటాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ బెనిఫీట్స్ ఉంటాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే హోండా ఎలివేట్ ధరలు రూ. 11.91 లక్షల నుంచి రూ. 16.51 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి పొందుతుంది.

హోండా సిటీ

దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హోండా సిటీ కారు మీద కూడా కంపెనీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపైన ఏకంగా రూ. 88000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అయితే అప్డేట్ చేయడానికి ముందు కారు కొనుగోలు చేసినవారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అప్డేట్ తరువాత మార్కెట్లో విక్రయానికి ఉన్న కారు కొనుగోలుపైన రూ. 68000 మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కారు 121 హార్స్ పవర్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.

హోండా సిటీ హైబ్రిడ్

సిటీ హైబ్రిడ్ కారు మీద రూ. 78000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 విలువైన కాంప్లిమెంటరీ 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది. రూ. 19 లక్షల ఖరీదైన ఈ కారుకు ప్రధాన ప్రత్యర్థులు ఎవరూ లేరు. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి రెండు ఎలక్ట్రిక్ మోటార్లను పొందుతుంది. ఇవన్నీ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి. ఇది 126 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా అమేజ్

2024 ఆగష్టు నెలలో హోండా అమేజ్ కారు మీద భారీ తగ్గింపులు లభిస్తాయి. వీఎక్స్ మరియు ఎలైట్ వేరియంట్ల మీద రూ. 96000, ఎస్ వేరియంట్ మీద రూ. 76000, ఎంట్రీ లెవెల్ ‘ఈ’ వేరియంట్ కొనుగోలుపై రూ. 66000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే హోండా అమేజ్ 90 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ మరియు సీవీటీ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.

ఫోక్స్‌వ్యాగన్

హోండా కంపెనీ మాత్రమే కాకుండా ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కూడా ఈ నెలలో ఆఫర్స్ అందిస్తోంది. ఇందులో టైగన్, వర్టస్ మరియు టిగువాన్ వంటివి ఉన్నాయి. టైగన్ కొనుగోలు మీద గరిష్టంగా రూ. 1.87 లక్షలు, వర్టస్ కొనుగోలుపైన రూ. 70000, టిగువాన్ కొనుగోలు మీద రూ. 1.5 లక్షల ప్రయోజనాలు లభిస్తాయి. ఈ బెనిఫీట్స్ ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

మారుతి సుజుకి

గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, బాలెనొ, ఇగ్నీస్, సియాజ్, ఎక్స్ఎల్6 మరియు జిమ్నీ కొనుగోలు మీద మారుతి సుజుకి ఈ నెలలో ప్రయోజనాలను అందిస్తుంది. గ్రాండ్ విటారా మీద రూ. 1.03 లక్షలు, ఫ్రాంక్స్ కొనుగోలు మీద రూ. 83000, బాలెనో కొనుగోలు మీద గరిష్టంగా రూ. 50000, ఇగ్నీస్ కారుపై రూ. 52100, సియాజ్ మీద రూ. 45000, ఎక్స్ఎల్6 కొనుగోలుపైన రూ. 35000 మరియు జిమ్మీ కారుపై రూ. 2.5 లక్షల ప్రయోజనాలు లభిస్తాయి.

Don’t Miss: సన్నీలియోన్‌ గ్యారేజీలో ఇన్ని కార్లున్నాయా? ఒక్కో కార్‌ రేటు చూస్తే మతిపోవడం ఖాయం!

టాటా మోటార్స్

ఇండియన్ బ్రాండ్ టాటా మోటార్స్ కూడా తన నెక్సాన్, సఫారీ, హారియార్, టియాగో, టిగోర్ మరియు పంచ్ కార్ల్ కొనుగోలుపైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ నెలలో నెక్సాన్ కొనుగోలుపైన ఎంచుకునే వేరియంట్‌ను బట్టి రూ. 16000 నుంచి రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు లభిస్తాయి. సఫారీ కొనుగోలుపై రూ. 70000 నుంచి రూ. 1.40 లక్షలు, హారియార్ మీద రూ. 1.20 లక్షలు, టియాగో మరియు టిగోర్ కొనుగోలు మీద వరుసగా రూ. 60000, రూ. 55000 డిస్కౌంట్ లభిస్తుంది. టాటా పంచ్ కారు కొనుగోలుపైన రూ. 18000 మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది.

గమనిక: వివిధ కంపెనీలు అందిస్తున్న డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి, ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారు ఖచ్చితమైన డిస్కౌంట్స్ లేదా బెనిఫీట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ యొక్క అధీకృత డీలర్షిప్ సందర్శించవచ్చు. అంతే కాకుండా ఈ ప్రయోజనాలు ఈ నెల చివరి వరకు, స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.