లాంచ్‌కు ముందే దుమ్ములేపిన బుకింగ్స్!.. కియా కార్నివాల్‌పై పెరుగుతున్న మోజు

New Kia Carnival Launched In India: ఒకప్పుడు అద్భుతమైన అమ్మకాలు పొంది 2023లో నిలిచిపోయిన కియా కార్నివాల్ ఆధునిక హంగులతో దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ అయింది. ఎంతగానో ఎదురు చూస్తున్న 2024 కియా కార్నివాల్ ఇప్పుడు దాని ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చేలా తయారై భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. ఈ కారు ధర ఎంత? ఇప్పటికి ఎన్ని బుకింగ్స్ వచ్చాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..

2024 కియా కారెన్స్ ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినా 2024 కియా కార్నివాల్ (2024 Kia Carnival) ధర రూ. 63.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ దీనిని రెండు వేరియంట్లలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ.. ప్రస్తుతం లిమోసిన్ ప్లస్ అనే ఒకే ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరో ట్రిమ్ లాంచ్ చేయనుంది.

బుకింగ్స్

కియా మోటార్స్ తన కార్నివాల్ కారును లాంచ్ చేయానికి ముందే సెప్టెంబర్ 16న బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటలోపే 1800 మంది ఈ కారును బుక్ చేసుకున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ కారు కోసం 2796 బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం.

2024 కియా కార్నివాల్ ప్రస్తుతం రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అవి ఫ్యూజన్ బ్లాక్, గ్లేసియర్ వైట్ పెర్ల్ కలర్స్. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు టైగర్ నోస్ గ్రిల్, ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, 18 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ కారు 2+2+3 సీటింగ్ లేఅవుట్ పొందుతుంది. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇక్కడే వెంటిలేషన్‌తో పాటు అడ్జస్టబుల్ లెగ్ సపోర్ట్ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, డ్యూయెల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 11 ఇంచెస్ హెడ్ ఆప్ డిస్‌ప్లే, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, హీటింగ్ అండ్ వెంటిలేషన్ లెగ్ సపోర్ట్‌తో రెండవ వరుసలో కెప్టెన్ సీట్స్ పొందుతుంది. పవర్డ్ టెయిల్‌గేట్ మరియు స్లైడింగ్ రియర్ డోర్ వంటివి ఇందులో లభిస్తాయి.

కొత్త డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇది ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఫ్రంట్ అండ్ సైడ్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ ఫీచర్స్ (లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపాశ్చర్ వార్ణింగ్, ఫ్రంట్ కొలిషన్ వార్ణింగ్, హై భీమ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్) వంటివన్నీ పొందుతుంది.

ఇంజిన్ విషయానికి వస్తే.. కియా కార్నివాల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 బ్రేక్ హార్స్ పవర్ మరియు 441 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. అయితే ఇది ఎలాంటి పనితీరును అందిస్తుందని విషయం త్వరలోనే తెలుస్తోంది.

కియా మోటార్స్ ఇప్పుడు తన కియా కార్నివాల్ కారు మీద మూడు సంవత్సరాల ఫ్రీ మెయింటెనెన్స్, వారంటీ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివన్నీ అందిస్తుంది. కాబట్టి కొనుగోలుదారులు ఈ కారును కొనుగోలు చేస్తే.. ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

Don’t Miss: అర్థంకాని మేధావి RGV.. ఎలాంటి కార్లు ఉపయోగించారో తెలుసా..

సేల్స్ ఎలా ఉండబోతున్నాయి

కియా కార్నివాల్ భారతీయ మార్కెట్లో సెవెన్ సీటర్ విభాగంలో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాయి. ఇప్పటికే దేశీయ విఫణిలో 7 సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కియా కార్నివాల్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఇప్పటికే రెండు వేలు కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన ఈ కారు ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం తెలియాల్సి ఉంటుంది.