తక్కువ ధరలో కొత్త ‘ఆస్టర్’ (Astor) లాంచ్ – హడలిపోతున్న ప్రత్యర్థులు

2024 MG Astor Launched In India: ఆధునిక ఫీచర్లతో లాంచ్ అయిన ‘ఎంజీ మోటార్’ (MG Motor) యొక్క ‘ఆస్టర్’ (Astor) ఇప్పుడు కొత్త హంగులతో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ కారు ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ధర & వేరియంట్స్ (MG Astor Price & Variants)
  • స్ప్రింట్ (Sprint) – రూ. 9.98 లక్షలు
  • షైన్ (Shine) – రూ. 11.68 లక్షలు
  • సెలెక్ట్ (Select) – రూ. 12.98 లక్షలు
  • షార్ప్ ప్రో (Sharp Pro) – రూ. 14.41 లక్షలు
  • సావీ ప్రో (Savvy Pro) – రూ. 17.90 లక్షలు

దేశీయ విఫణిలో లాంచ్ అయిన 2024 ఎంజీ ఆస్టర్ ప్రారంభ ధర రూ. 9.98 (ఎక్స్ షోరూమ్). టాప్ మోడల్ ధర రూ. 17.98 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.

ఐదు ట్రిమ్‌లలో లభించే కొత్త 2024 ఎంజీ ఆస్టర్ యొక్క స్ప్రింట్ వేరియంట్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే సెలెక్ట్, షార్ప్ ప్రో మరియు సావీ ప్రో అనే మూడు వేరియంట్స్ పెట్రోల్ CVT మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంటాయి.

డిజైన్ మరియు ఫీచర్స్ (MG Astor Design & Features)

కొత్త ఎంజీ ఆస్టర్ కారు చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని సూక్షమైన మార్పులు గమనించవచ్చు. ఎంట్రీ-లెవల్ ఆస్టర్ స్ప్రింట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటితో పాటు ఆటో డిమ్మింగ్ IRVM వంటివి ఉన్నాయి. ఎంట్రీ లెవల్ మోడల్ స్ప్రింట్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్, సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, లెదర్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఆస్టర్ కొత్త కారు ఇప్పుడు కనెక్టెడ్ కార్ ఫీచర్లతో ఐ-స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ అప్డేట్ కూడా పొందుతుంది.

ఇంజిన్ (MG Astor Engine)

డిజైన్ మరోయు ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులకు లోను కాదు. కాబట్టి ఇందులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 110 హార్స్ పవర్ మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

అదే సమయంలో ఇందులోని 1.3 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 140 హార్స్ పవర్ మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ మాత్రమే పొందుతుంది.

ప్రత్యర్థులు (MG Astor Rivals)

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఎంజీ ఆస్టర్ కారు కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. దీంతో అమ్మకాల పరంగా ఆస్టర్ కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Don’t Miss: Mercedes Benz: రూ.50.50 లక్షల కారు లాంచ్ చేసిన బెంజ్ కంపెనీ – పూర్తి వివరాలు

భారతదేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న ఎంజీ మోటార్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా తనదైన రీతిలో ప్రజాదరణ పొందిన ఈ కారు సరసమైన ఎంజీ కామెట్ ఈవీ లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఆస్టర్ కొత్త మోడల్ విడుదలతో మరింత మంది కొనుగోలుదారులను ఆకర్శించడానికి సన్నద్ధమయింది. ఈ కొత్త మోడల్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.