2024 క్లాసిక్ 350 వచ్చేసింది.. ప్రత్యర్థుల పని అయిపోయినట్టే!

New Royal Enfield Classic 350 Unveiled: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చైన్నై బేస్డ్ టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) ఎట్టకేలకు తన 2024 క్లాసిక్ 350 (2024 Classic 350) బైక్ ఆవిష్కరించింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంది.

లాంచ్ డేట్ & డెలివరీలు (Launch Date and Delivery)

2009లో కంపెనీ ప్రారంభించిన క్లాసిక్ 350 బైక్ 2021లో చివరి అప్డేట్ పొందింది. కాగా ఇప్పుడు ఆధునిక హంగులను పొందింది. దీంతో ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న ఇతర బైకుల కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ ధరలను కంపెనీ సెప్టెంబర్ 1న అధికారికంగా వెల్లడించనుంది. డెలివరీలు కూడా ఆ సమయంలోనే ప్రారంభమవుతాయని సమాచారం.

డిజైన్ (Design)

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులో చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేవని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇది కొత్త బైక్ కాబట్టి సూక్షమైన కాస్మొటిక్ అప్డేట్స్ పొందిందని గమనించవచ్చు. బ్రాండ్ లోగో ఫ్యూయెల్ ట్యాంక్ మీద చూడవచ్చు. ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ వంటివి పొందుతుంది. మొత్తం మీద ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉందని స్పష్టమవుతోంది.

ఫీచర్స్ (Features)

2024 క్లాసిక్ 350 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఎమ్ఐడీ స్క్రీన్, అనలాగ్ క్లస్టర్ వంటి వాటితో పాటు గేర్ పొజిషన్ ఇండికేటర్, యూఎస్బీ ఛార్జర్ వంటివి కూడా ఉన్నాయి. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్ అనేది టాప్ వేరియంట్లలో మాత్రమే ఉంటాయి. బేస్ వేరియంట్లలో ఇది ఆప్షనల్‌గా ఉంటుంది.

కలర్ ఆప్షన్స్ (Colour Options)

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మొత్తం 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఆరు కొత్త కలర్స్ (ఎమరాల్డ్, జోధ్‌పూర్ బ్లూ,మద్రాస్ రెడ్, మెడలియన్ బ్రౌన్, కమాండో సాండ్ మరియు స్టెల్త్) కాగా.. మిగిలిన ఐదు ఇప్పటికే అందుబాటులో ఉన్న కలర్స్. ఈ కొత్త కలర్ అన్నీ కూడా మునుపటి కలర్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ గ్యాస్ ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇందులో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. కాగా డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ప్రామాణికంగా లభిస్తుంది. మొత్తం మీద ఈ బైక్ యొక్క సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

ఇంజిన్ (Engine Details)

2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ జే-ప్లాట్‌ఫామ్ ఆధారంగానే రూపొందించబడి ఉంది. కాబట్టి ఇప్పటికే సాధారణ క్లాసిక్ 350 బైకులోని అదే ఇంజిన్ పొందుతుంది. ఇందులోని 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 6100 rpm వద్ద 20.2 Bhp పవర్ మరియు 4000 rpm వద్ద 27 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

అంచనా ధర (Expected Price)

మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఈ బైక్ ధర దాని స్టాండర్డ్ బైక్ కంటే కొంత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మార్కెట్లో స్టాండర్డ్ క్లాసిక్ 350 ధర రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.24 లక్షలు. కాబట్టి 2024 క్లాసిక్ 350 ధర దీనికంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ధరలు అధికారికంగా సెప్టెంబర్ 1న వెల్లడవుతాయి.

Don’t Miss: భారత్‌లో అందుబాటులో ఉన్న రాయల్ బండ్లు ఇవే.. ఒక్కొక్కటి ఒక్కో స్టైల్
ప్రత్యర్థులు (Rivals)

ఆధునిక కాలంలో మార్కెట్లో లాంచ్ అయ్యే బైకుల సంఖ్య ఎక్కువవుతోంది. కొత్తగా లాంచ్ అయ్యే ఏ బైక్ అయినా తప్పకుండా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 2024 క్లాసిక్ 350 బైక్ ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న హోండా హైనెస్ 350, హోండా సీబీ 350 మరియు జావా 350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ బైక్ దేశీయ విఫణిలో అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.