2025 Honda Activa Launched in India: ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన ‘హోండా మోటార్‌సైకిల్’ (Honda Motorcycle) బ్రాండ్ యాక్టివా (Activa) ఇప్పుడు సరికొత్త హంగులతో 2025 ఎడిషన్‌గా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ అప్డేటెడ్ మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు వేరియంట్స్, ధరలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
వేరియంట్స్ & ధరలు
2025 హోండా యాక్టివా స్కూటర్ ‘ఎస్టీడీ, డీఎల్ఎక్స్ మరియు హెచ్-స్మార్ట్’ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే కంపెనీ బేస్ వేరియంట్ ధరలను మాత్రమే ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించింది. మిగిలిన వేరియంట్ల ధరలను వెల్లడించాల్సి ఉంది. కాబట్టి యాక్టివా బేస్ వేరియంట్ ధర రూ. 80,950 (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 2,266 ఎక్కువని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. మిగిలిన వేరియంట్స్ ధరలు కూడా కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
బుకింగ్స్ & కలర్ ఆప్షన్స్
హోండా కొత్త యాక్టివా కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి దీనిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
2025 యాక్టివా స్కూటర్ ఆరు రంగుల్లో లభిస్తుంది. అవి పెర్ల్ ప్రెసియస్ వైట్, డీసెంట్ బ్లూ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సెస్ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్ మరియు పెర్ల్ సైరన్ బ్లూ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
డిజైన్ & ఫీచర్
కొత్త హోండా యాక్టివా స్కూటర్ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి అదే హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు ఇండికేటర్స్ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ చూడవచ్చు. ఇందులో 4.2 ఇంచెస్ TFT కలర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మైలేజ్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఎకో ఇండికేటర్ వంటి సమాచారం అందిస్తుంది. అంతే కాకుండా మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి ఇందులో USB టైప్ సీ ఛార్జింగ్ ఫోర్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంజిన్ డీటెయిల్స్
కొత్త 2025 హోండా యాక్టివా స్కూటర్ 109.51 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 7.8 Bhp పవర్ మరియు 5500 rpm వద్ద 9.05 Nm టార్క్ అందిస్తుంది. ఇంధనాన్ని పొదుపు చేయడానికి కంపెనీ.. ఇందులో ఐడ్లింగ్ స్టార్ట్ – స్టాప్ సిస్టం అందించింది. కాబట్టి ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.
టీవీఎస్ జుపీటర్, హీరో ప్లెజర్ ప్లస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే ఈ కొత్త యాక్టివా స్కూటర్.. ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఇప్పటికే కంపెనీ తన సాధారణ యాక్టివా లేదా మునుపటి యాక్టివాను లక్షల యూనిట్ల విక్రయాలను విజయవంతంగా పూర్తి చేసింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అయిన 2025 యాక్టివా కూడా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది.
Also Read: ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన లగ్జరీ కార్లు ఇవే.. చూశారా?
కంపెనీ తన కొత్త హోండా యాక్టివా స్కూటర్ లాంచ్ చేసిన సందర్భంగా.. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, ఎండీ సుత్సుము ఒటాని మాట్లాడుతూ.. భారతీయ కస్టమర్లకు అప్డేటెడ్ లేదా కొత్త వాహనాలను అందించడానికి సంస్థ ఎప్పుడూ కట్టుబడి ఉంది. 2025 యాక్టివా మోడల్ కావాలనుకునే వారికి.. ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కూటర్ తప్పకుండా మంచి ఎంపిక అవుతుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ వంటి వాటితో పాటు TFT డిస్‌ప్లే కూడా పొందుతుంది. కాబట్టి ఇది తప్పకుండా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని.. మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.
మార్కెట్లో హోండా యాక్టివా సేల్స్
2001లో లాంచ్ అయిన.. హోండా యాక్టివా కాలక్రమంలో అనేక అప్డేట్స్ పొందింది. 2023 జూన్ నాటికి కంపెనీ యాక్టివాను ఏకంగా మూడు కోట్ల కంటే ఎక్కువ మందికి విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే.. యాక్టివాకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 2025 మోడల్ యాక్టివా కూడా కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.