కేరళలో ఇదే ఫస్ట్ బీవైడీ సీల్.. కొన్నది 21 ఏళ్ల చిన్నది: ధర తెలిస్తే అవాక్కవుతారు!

21 Years Kerala Woman To Own BYD Seal EV: మన దేశంలో బీవైడీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా ఆట్టో3, సీల్ మరియు ఈమ్యాక్స్ అనే మూడు కార్లను లాంచ్ చేసింది. ఇటీవల ‘బీవైడీ సీల్’ (BYD Seal) కారును కేరళకు చెందిన వ్యాపారవేత్త ‘లక్ష్మీ కమల్’ (Lakshmi Kamal) కొనుగోలు చేశారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.51 లక్షలు (ఆన్ రోడ్, కేరళ – కొచ్చి). కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ కారును ఎవరూ కొనుగోలు చేయలేదు, కాబట్టి బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన మొదటి వ్యక్తిగా & మొదటి మహిళగా లక్ష్మీ కమల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

కేవలం 21ఏళ్ల వయసులోనే 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన అతి తక్కువ మందిలో లక్ష్మీ కమల్ కూడా ఒకరుగా నిలిచారు. ఈమె బ్లాక్ కలర్ ప్రీమియం బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. నిజానికి ఇది డైనమిక్, ప్రీమియం మరియు పెర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. బీవైడీ సీల్ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్ అందిస్తుంది.

చిన్న వయసులోనే ఖరీదైన కారును కొనుగోలు చేసిన లక్ష్మీని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ కారు 312 హార్స్ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే మోటారును పొందుతుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

బ్యాటరీ & రేంజ్

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు.. 2024 మార్చిలో ప్రారంభమైంది. కంపెనీ ఈ కారును ప్రారంభించిన తరువాత మొదటి 15 రోజుల్లో 500 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఎలక్ట్రిక్ కారు ధర ఎక్కువైనా.. డిమాండ్ కూడా అదే రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది. బీవైడీ సీల్ డైనమిక్ వేరియంట్ 61.44 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. మిగిలిన రెండు వేరియంట్లు 82.56 కిలోవాట్ బ్యాటరీ పొందుతాయి.

సీల్ ఎలక్ట్రిక్ కారు పరిమాణంలో కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4800 మిమీ, వెడల్పు 1875 మిమీ మరియు ఎత్తు 1460 మిమీ వరకు ఉన్నాయి. ఇది చూడటానికి కూపే స్టైల్ డిజైన్ పొందుతుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ లైట్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన బీవైడీ సీల్ ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే మరియు కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.

ఫీచర్స్

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు ప్రీమియం క్యాబిన్ అనుభూతిని అందిస్తుంది. 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ కోసం హెడ్స్ అప్ డిస్‌ప్లే, క్రిస్టల్ టోగుల్ డ్రైవ్ సెలెక్టర్, 8 వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, మెమొరీ ఫంక్షన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి మరెన్నో ఫీచర్స్ సీల్ కారులో ఉన్నాయి.

Don’t Miss: అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ప్రజలకోసం ఓ అడుగు ముందుకేసి: ఇది కదా ‘రతన్ టాటా’

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా బీవైడీ సీల్.. ప్రయాణికులకు భద్రత కల్పించడానికి 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటోమాటిక్ వైపర్స్, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ టెక్నాలజీ వంటి మరెన్నో ఉన్నాయి. ఇది యూరో ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే.. ఎంతోమంది సెలబ్రిటీలను ఆకర్షిస్తోంది. మొత్తం మీద అతి తక్కువ కాలంలోనే చాలామంది వాహన ప్రియులను ఆకర్షిస్తోంది.