23.2 C
Hyderabad
Tuesday, January 21, 2025

కొత్త పెళ్లి కొడుకు ‘కిరణ్ అబ్బవరం’ ఖరీదైన కారు – దీని రేటెంతో తెలిస్తే..

Actor Kiran Abbavaram Expensive Range Rover: టాలీవుడ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’ (Kiran Abbavarm) ఓ ఇంటివాడయ్యాడు. తన మొదటి చిత్రం ‘రాజా వారు రాణి గారు’ సినిమాలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించిన ‘రహస్య గోరఖ్’ను (Rahasya Gorak) ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కర్నాటకలోని కూర్గ్‌లో ఓ రిసార్ట్‌లో అతి తక్కువ మంది మధ్య జరిగింది. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను కూడా కిరణ్ అబ్బవరం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

మూడు ముళ్ళు, ఏడడుగులు, బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన కిరణ్ అబ్బవరం.. ఓ ఖరీదైన కారును కూడా కలిగి ఉన్నారు. బహుశా ఈ కారు గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో కిరణ్ అబ్బవరం యొక్క ఖరీదైన కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నటుడు కిరణ్ అబ్బవరం ఉపయోగించే కారు రేంజ్ రోవర్ బ్రాండ్ కారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను గతంలో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారును యితడు 2020లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నలుపురంగులో అద్భుతంగా కనిపించే ఈ కారు పక్కన కిరణ్ అబ్బవరం నిలబడి ఉన్న ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

రేంజ్ రోవర్ (Range Rover)

కిరణ్ అబ్బవరం కారు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ అని తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 1 కోటి కంటే ఎక్కువే. ఇప్పటికే ఈ కారును చాలామంది ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు తమ గ్యారేజిలో చేర్చారు, రోజువారీ వినియోగానికి కూడా ఉపయోగిస్తున్నారు.

ఎక్కువమంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. దాని డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాదు. అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందించడం కూడా అని తెలుస్తోంది. విశాలమైన ఫ్రంట్, ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్, ముందు భాగంలో బ్రాండ్ లోగో, ఆకర్షణీయమైన సైడ్ ప్రొఫైల్, టెయిల్ లైట్స్ వంటివన్నీ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

విశాలమైన క్యాబిన్.. సెంటర్ కన్సోల్‌లో 13 ఇంచెస్ స్క్రిన్, సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ప్రీమియం 23 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ఏఐ వాయిస్ కమాండ్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. ల్యాండ్ రోవర్ స్పోర్ట్ కారు డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. కానీ కిరణ్ అబ్బవరం వద్ద ఉన్న కారు ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉందనేది స్పష్టంగా తెలియదు. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు యొక్క టాప్ స్పీడ్ 225 కిమీ నుంచి 290 కిమీ వరకు ఉంటుంది. ఈ కారు రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

రేంజ్ రోవర్ కార్లు పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతాయి. కాబట్టి రేంజ్ రోవర్ స్పోర్ట్ కారులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, అండర్ కార్ వ్యూ, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ కండిషన్ మానిటర్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి మరెన్నో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారు ఎంత సురక్షితమైనదో అర్థం చేసుకోవచ్చు.

Don’t Miss: జాన్ అబ్రహంకు షారుక్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చిన బైక్ ఇదే!.. ధర రూ.17 లక్షలు

రేంజ్ రోవర్ కార్లు కలిగి ఉన్న ఇతర సెలబ్రిటీలు

భారతదేశంలో రేంజ్ రోవర్ బ్రాండ్ కార్లు చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. ఈ జాబితాలో సోనమ్ కపూర్, రణబీర్ కపూర్ & అలియా భట్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, మహేష్ బాబు, అల్లు అర్జున్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మపూజ హెగ్డే, అమితాబ్ బచ్చన్, అంబానీ ఫ్యామిలీ మొదలైన వారు ఉన్నారు.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles