అమలా పాల్‌కు ఖరీదైన కారు గిఫ్ట్!.. ఆనందంలో మునిగిపోయిన నటి (వీడియో)

Amala Paul Gets a BMW car As a Gift from Husband: ఇద్దరమ్మాయిలతో, రఘువరన్ బీటెక్ వంటి సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి ‘అమలా పాల్‘ (Amala Paul) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఖరీదైన కార్లను కూడా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇప్పుడు తాజాగా.. ఈమె భర్త ఓ ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారును గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ అమలా పాల్ భర్త గిఫ్ట్ ఇచ్చిన కారు ఏది?, దాని ధర ఎంత అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

అమలా పాల్ భర్త నుంచి గిఫ్టుగా పొందిన కారు బీఎండబ్ల్యూ (BMW) కంపెనీకి చెందిన 7 సిరీస్ (7 Series) అని తెలుస్తోంది. దీని ధర రూ. 2 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఈ కారు ఏ మోడల్, ఏ ఇంజిన్ కలిగి ఉంది అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. అమలా పాల్ రావడం, తన భర్తను ముద్దు పెట్టుకోవడం, కారుపై కప్పిన గుడ్డను తొలగించడం వంటివి చూడవచ్చు. ఇక్కడ కనిపించే బీఎండబ్ల్యూ కారు తెలుపు రంగులో చూడచక్కగా ఉంది. ఈ కారు మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. అయితే అమలా పాల్ కొత్త బీఎండబ్ల్యూ ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉందో స్పష్టంగా తెలియదు.

కేరళకు చెందిన అమలా పాల్.. సినిమా రంగంలో ఓ మెరుపు మెరిసిన హీరోయిన్. ప్రస్తుతం ఏ సినిమాల్లోనూ నటించకుండా.. పూర్తిగా ఫ్యామిలీకే అంకితమైపోయింది. 2023లో ‘జగత్ దేశాయ్’ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కాగా ఈ జంటకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.

బీఎండబ్ల్యూ (BMW)

నిజానికి సినీ తారలు ఎక్కువగా ఇష్టపడే కార్ల జాబితాలో ఈ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కూడా ఒకటి. ఇప్పటికే ఈ మోడల్ కారును సోనూ సూద్, పృథ్వీరాజ్ వంటి నటులు కూడా కలిగి ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ జాబితాలోకి అమలా పాల్ కూడా చేరింది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఈ కారును ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

Also Read: వరుస బ్లాక్‌బస్టర్స్‌.. కొత్త కారు కొనేసిన రష్మిక: ధర ఎంతో తెలుసా?

అమలా పాల్ కార్ల ప్రపంచం (Amala Paul Car Collection)

నటి అమలా పాల్ గ్యారేజిలో బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు మాత్రమే కాకుండా.. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (రూ. 1.35 కోట్లు), ఆడి ఏ6 (రూ. 60.59 లక్షలు), జాగ్వార్ ఎక్స్ఎఫ్ (రూ. 70 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ ఈ 220డీ (రూ. 77.11 లక్షలు), ఆడి క్యూ7 (రూ. 88.70 లక్షలు), బీఎండబ్ల్యూ 5 సిరీస్ (రూ. 72.90 లక్షలు), రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 67.90 లక్షలు), మినీ కూపర్ (రూ. 55.75 లక్షలు), పోర్స్చే కయెన్న (రూ. 1.42 కోట్లు) మరియు జాగ్వార్ ఎఫ్ టైప్ (రూ. 97.93 లక్షలు) వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Jagat Desai (@j_desaii)

Leave a Comment