విజేతకు మహీంద్రా థార్ గిఫ్ట్: ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

Mahindra Rise Challenge For MBA Students: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఎంబీఏ విద్యార్థులు కోసం ‘మహీంద్రా రైజ్ ఛాలెంజ్’ (Mahindra Rise Challenge) పేరుతో ఓ పోటీ నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి లెజండరీ మహీంద్రా థార్ (Mahindra Thar) గిఫ్ట్‌గా ఇస్తుంది. ఇంతకీ ఈ పోటీ ఏంటి? ఎలా పాల్గొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో మీ కోసం..

మహీంద్రా కంపెనీ నిరవహిస్తున్న ఈ మహీంద్రా రైజ్ చాలేజ్ అనేది నాలుగు దశల్లో జరుగుతుంది. అవి రిజిస్ట్రేషన్, సీవీ (Curriculum Vitae), క్యాంపస్ రౌండ్ మరియు నేషనల్ ఫైనల్స్.

రిజిస్ట్రేషన్

మహీంద్రా నిర్వహిస్తున్న ఈ ఛాలెంజ్‌లో పాల్గొనటానికి రిజిస్ట్రేషన్ అనేది మొదటి దశ. పోటీలలో పాల్గొనే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కాలేజ్ ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ పోటీలో ఒక విద్యార్ధి కేవలం ఒకసారి మాత్రమే పాల్గొనటానికి అర్హత కలిగి ఉంటారు. కాబట్టి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

సీవీ (Curriculum Vitae)

మహీంద్రా రైజ్ ఛాలెంజ్‌లో రెండో దశ సీవీ సంపించడం. అంటే ఇందులో పాల్గొనే విద్యార్ధి వారి బయోడేటా లేదా రెస్యూమ్ అందించాల్సి ఉంటుంది. ఈ రౌండులోనే ఒక పేజీలో ఓ సమస్యను.. దానికి పరిష్కారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

క్యాంపస్ రౌండ్

మహీంద్రా రైజ్ ఛాలెంజ్‌లో మూడోది క్యాంపస్ రౌండ్. ఇక్కడ పోటీలో పాల్గొనే విద్యార్థులు మహీంద్రా జ్యురీ కోసం ఐదు స్లయిడ్‌ల ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకటి రెండో రౌండులో సమర్పించే ఒక సమస్య.. దానికి పరిష్కారం పత్రం కూడా ఉండాలి.

నేషనల్ ఫైనల్స్

మూడు రౌండ్లలో విజయం పొందినవారు నేషనల్ ఫైనల్స్ అనే రౌండుకు వెళ్తారు. ఇక్కడ షార్ట్‌లిస్ట్ చేయబడిన తరువాత మహీంద్రా గ్రూప్ యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు విద్యార్థులు తమ కొత్త ఆలోచనలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా అన్నింట్లో విజయం సాధించినవారికి పాపులర్ ఆఫ్-రోడర్ ‘మహీంద్రా థార్’ గిఫ్ట్‌గా లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో గెలుపొందిన విజేత మహీంద్రా లీడర్స్ ప్రోగ్రామ్‌లో భాగం అవుతాడు.

ఇందులో ఎవరు పాల్గొనాలి

ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఎస్‌‌‌‌పీజేఐఎంఆర్ ముంబై, ఎఫ్ఎమ్ఎస్ ఢిల్లీ, జేబీఐఎమ్ఎస్ ముంబై, మరియు ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్‌పూర్‌లలోని మొదటి సంవత్సరం పూర్తి చేసిన ఎంబీఏ విద్యార్థుల కోసం మాత్రమే ఈ ఛాలెంజ్ నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి వీరు మాత్రమే ఈ ఛాలెంజ్‌లో పాల్గొనటానికి అర్హులని తెలుస్తోంది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్

పారిశ్రామిక దిగ్గజం ‘ఆనంద్ మహీంద్రా’ (Anand Mahindra) కూడా మహీంద్రా రైజ్ ఈవెంట్ గురించి ట్వీట్ చేశారు. ”ఇది ఒక వేట, విజేతలకు తక్షణం మహీంద్రా కొత్త కారు పొందవచ్చు. ఇందులో గెలిచే విజేతలు భవిష్యత్తుకు నాయకత్వం వహించేవారు”.. అని అన్నారు.

మహీంద్రా థార్ (Mahindra Thar)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ ఆఫ్-రోడర్లలో ‘మహీంద్రా థార్’ చెప్పుకోదగ్గ కారు. మహీంద్రా థార్ 3 డోర్స్ వెర్షన్లో లభిస్తోంది. కాగా కంపెనీ ఇప్పుడు 5 డోర్ వెర్షన్ రూపంలో ‘ మహీంద్రా రోక్స్’ పేరుతో లాంచ్ చేసింది. ఇది సాధారణ కారు కంటే కూడా కొంత విశాలంగా ఉంటుంది. దీని ధర రూ. 12.99 లక్షలు. కాగా మహీంద్రా థార్ 3 డోర్ వెర్షన్ ధర రూ. 11.35 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన మొదటి రోజు నుంచి.. ఇప్పటి వరకు కూడా విపరీతమైన అమ్మకాలు పొందుతూ.. ప్రత్యర్థులకు సైతం దడ పుట్టిస్తోంది. ఈ కారు అత్యద్భుతమైన డిజైన్ కలిగి ఉండటం వల్ల.. వాహన ప్రేమికులు చూడగానే ఆకర్షించబడతారు. అంతే కాకుండా ఇది వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

Don’t Miss: భారత్‌లో ఫస్ట్‌ డెలివరీ.. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారు ఇదే! ఇంకా స్పెషల్‌ ఏంటంటే?

మహీంద్రా థార్ కేవలం ఆన్ రోడ్ వినియోగదారులకు మాత్రమే కాకుండా.. ఆఫ్ రోడ్ వినియోగదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 1,86,055 యూనిట్ల మహీంద్రా థార్ కార్లు విక్రయించబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ కారుకు ఎంత క్రేజు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.