భారత్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!.. అనంత్ అంబానీకి అరుదైన కారు గిఫ్ట్

Anant Ambani Gets Expensive Dartz Car As Wedding Gift: ఐదు రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి.. అని సినిమాలో పాటలు విన్నాం. నిజానికి అలాంటి పెళ్లి ఇటీవల అంబానీ ఇంట జరిగింది. అయితే ఇక్కడ ఐదు రోజులు కాదుగానీ.. మూడు రోజుల పెళ్లి. అంతకంటే ముందు రెండు సార్లు అంగరంగ వైభవంగా.. ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా నిర్వహించారు. కాగా జులై 12న వేదమంత్రాలతో అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఇద్దరూ ఒక్కటయ్యారు. అనంత్ పెళ్ళికి ముకేశ్ అంబానీ సుమారు 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.

అనంత్, రాధికల పెళ్ళికి ప్రపంచ కుబేరులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. అంబానీ అతిధులకు కూడా ఖరీదైన బహుమతులను అందించారు. సెలబ్రిటీలు ఆటపాటలతో చిందులేశారు. కొందరు ప్రముఖులు కొత్త జంటకు ఖరీదైన కానుకలను అందించారు. ఇందులో చెప్పుకోదగ్గది.. డార్జ్ (Dartz) కారు.

డార్జ్ కారు..

ప్రపంచ మార్కెట్లో డార్జ్ కారు అనేది ఒకటుందని చాలామందికి తెలియకపోవచ్చు. అయితే గ్లోబల్ మార్కెట్లో అతి తక్కువ సంఖ్యలో డార్జ్ కార్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. దీని ధర రూ. 15 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. దీనిని అనంత్, రాధికలకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

డార్జ్ అనేది లాట్వియా బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ అధిక పనితీరును అందించే సాయుధ వాహనాలను డిజైన్ చేసి రూపొందించడానికి ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ కస్టమర్ల ఇష్టానుసారంగా కస్టమైజ్ చేసి అందిస్తుంది. డార్జ్ కారు ‘ది డిక్టేటర్’ అనే హాలీవుడ్ సినిమాలో కూడా చూసి ఉంటారు. అలాంటి కారునే అనంత్ అంబానీ, రాధికలకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు మెర్సిడీ మేబ్యాచ్ జీఎల్ఎస్600 ఆధారంగా రూపొందించబడినట్లు తెలుస్తోంది.

అనంత్ అంబానీకి ఈ డార్జ్ కారును గిఫ్ట్‌గా చైనా వీడియో లేదా ఫొటోస్ వంటివి అందుబాటులో లేదు. అంతే కాకుండా దీనిని గిఫ్ట్‌గా ఎవరిచ్చారనేది కూడా స్పష్టంగా వెలుగులోకి రాలేదు. అయితే దీనిని భారతదేశానికి దిగుమతి చేసుకుని అనంత్ అంబానీకి ఇచ్చారా అనే విషయం మీద స్పష్టత లేదు. కాబట్టి దీనిని బహుశా విదేశాల్లో అనంత్ అంబానీకి గిఫ్ట్‌గా ఇచ్చి ఉంటారని భావిస్తున్నాము.

ఇప్పటికి వెలుగులోకి వచ్చిన ఫోటోల ప్రకారం డార్జ్ కారు గోల్డ్ కలర్ పొంది ఉన్నట్లు తెలుస్తోంది. చూడటానికి ఈ కారు కఠినమైన రూపాన్ని పొంది ఉండటం చూడవచ్చు. కాబట్టి ఇది రోడ్డు ప్రయాణానికి మాత్రమే కాకుండా.. ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది ఇసుక మొదలైన ప్రాంతాల్లో కూడా సజావుగా ముందుకు సాగే విధంగా పటిష్టంగా రూపొందించినట్లు తెలుస్తోంది.

చాలావరకు కస్టమైజ్ చేయబడిన ఈ కారు చూడటానికి చాలా హుందాగా ఉంది. డిజైన్ మాత్రమే కాకుండా, సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్ కూడా కస్టమైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంజిన్ కూడా రీచున్ చేసి ఉండొచ్చని సమాచారం. ఈ కారు త్వరలోనే ముంబై రోడ్ల మీద కనిపించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కనిపిస్తుందో చూడాలని చాలామంది వాహన ప్రియులు ఎదురు చూస్తున్నారు.

అంబానీ జియో గ్యారేజ్

భారతదేశంలో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లను కలిగి ఉన్న ఫ్యామిలీలలో అంబానీ కుటుంబం చెప్పుకోదగ్గది. వీరి వద్ద ఇప్పటికే 9 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇవి మాత్రమే కాకుండా 6 ఫెరారీ కార్లు, మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ బులెట్ ప్రూఫ్ కార్లు, లంబోర్ఘిని ఉరుస్, టెస్లా, బీన్స్ జీ63 ఏఎంజీ, రేంజ్ రోవర్, ఎంజీ గ్లోస్టర్, మెర్సిడెస్ బెంజ్ వీ క్లాస్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నట్లు సమాచారం.

Don’t Miss: అనంత్, రాధిక పెళ్లి: మనుషులే కాదు.. కార్లు కూడా అందంగా తయారయ్యాయ్!

పైన చెప్పుకున్న కార్లు మాత్రమే కాకుండా ఇటీవల అనంత్, రాధికల పెళ్లి కానుకలుగా ఖరీదైన బంగ్లాలు, కార్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇందులో బెంట్లీ కంపెనీకి చెందిన రూ. 5.4 కోట్ల విలువైన కాంటినెంటల్ జీటీసీ స్పీడ్, రూ. 11.50 కోట్ల బుగాటీ, సుమారు రూ. 300 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, రూ. 9 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు మొదలైనవి ఉన్నట్లు సమాచారం.