23.2 C
Hyderabad
Friday, January 17, 2025

‘పవన్ కళ్యాణ్’ వాహన ప్రపంచం చూశారా!.. ఓ లుక్కేసుకోండి

Pawan Kalyan Car Collection: ముందుగా.. అశేష జనవాహిని గుండెల్లో వెలిగే సూర్యుడు పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’కు జన్మదిన శుభాకాంక్షలు.  ‘పవన్ కళ్యాణ్’ (Pawan Kalyan).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సినీ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని లెక్కకు మించిన అభిమానులను కలిగి ఉండటమే కాకుండా.. జనసేన అనే పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం MLAగా గెలుపొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా.. పంచాయతీ రాజ్ శాఖా, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి.. రాజకీయంలో కూడా అఖండ మెజారిటీతో గెలుపొందిన జనసేనాని పవన్ కళ్యాణ్ గతంలో ఎలాంటి కార్లను ఉపయోగించారు, ఎలాంటి బైకులను వాడారు, వాటి వివరాలు ఏంటి అనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

పవన్ కళ్యాణ్ ఉపయోగించిన కార్లు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.. మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63, జాగ్వార్ ఎక్స్‌జే, బెంజ్ జీ55 ఏఎంజీ, ఫోర్డ్ ఎండీవర్, బీఎండబ్ల్యూ 520డీ, బెంజ్ ఆర్350 మరియు ఆడి క్యూ7 కలిగి ఉన్నారు. వీటితో పాటు ఖరీదైన హార్లే డేవిడ్‌సన్ బైకును కలిగి ఉన్నారు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ‘ఏఎంజీ జీ63’ కారు పవన్ కళ్యాణ్ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 2.2 కోట్లు అని తెలుస్తోంది. పవర్ స్టార్ట్ గతంలో ఎక్కువగా ఈ కారులో కనిపించే వారు. ఇది ఆయనకు ఎంతగానో ఇష్టమైన కారు కూడా. దీనిని ఇప్పటికి కూడా ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఈ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పర్ఫామెన్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి.

జాగ్వార్ ఎక్స్‌జే

పవన్ కళ్యాణ్ గ్యారేజిలో మరో ఖరీదైన కారు జాగ్వార్ కంపెనీకి చెందిన ‘ఎక్స్‌జే’ కూడా ఉన్నట్లు సమాచారం. దీని ధర రూ. 1.1 కోట్లు. విలాసవంతమైన ఈ కారును సినీ పరిశ్రమలోని వారు మాత్రమే కాకుండా చాలామంది ప్రముఖులు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కారు పవన్ కళ్యాణ్ వద్ద ఉందా? లేదా అనే విషయం స్పష్టంగా తెలియదు. ఈ అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ కారులో ఎప్పుడూ కనిపించలేదు.

ఫోర్డ్ ఎండీవర్

అమెరికన్ కార్ల తయారీ సంస్థ అయిన ఫోర్డ్ కంపెనీకి చెందిన ఎండీవర్ కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించిన కార్లలో ఒకటి అని తెలుస్తోంది. దీని ధర రూ. 33.7 లక్షలు. ప్రస్తుతం ఫోర్డ్ కంపెనీ మన దేశంలో తమ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసింది. అయినప్పటికీ ఫోర్డ్ కంపెనీ కార్లు ఇప్పుడు కూడా రోడ్ల మీద విరివిగా కనిపిస్తున్నాయి. కొందరు సెలబ్రిటీల గ్యారేజీలు ఫోర్డ్ ఎండీవర్ కూడా ఉంది.

బీఎండబ్ల్యూ 520డీ

జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ‘520డీ’ను కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించినట్లు సమాచారం. దీని ధర రూ. 60 లక్షలు. ఈ కారు అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అత్యుత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంది. ఈ కారును ఇప్పటికే పలువురు ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు కూడా తమ గ్యారేజిలో కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ కంపెనీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఆర్350

పవన్ కళ్యాణ్ గ్యారేజిలోని మరో బెంజ్ కారు ఆర్350. క్రోమైట్ బ్లాక్ రంగులో కనిపించే ఈ కారు ధర రూ. 67 లక్షలు. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తిలో లేదు, కానీ ఈ కారు అక్కడక్కడా రోడ్ల మీద కనిపిస్తుంటుంది. ఇది పాత మోడల్ అయినప్పటికీ.. ఇది మార్కెట్లో అడుగుపెట్టిన సమయంలో మంచి సంఖ్యంలో అమ్ముడైంది. ఈ కారు కూడా పవన్ కళ్యాణ్ గ్యారేజిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆడి క్యూ7

పవన్ కళ్యాణ్ గ్యారేజిలోని మరో జర్మన్ బ్రాండ్ కారు ఆడి క్యూ7. దీని ధర రూ. 67 లక్షలు. కేవలం పవన్ కళ్యాణ్ గ్యారేజిలో మాత్రమే కాకుండా ఈ కారును పలువురు సెలబ్రిటీలు కూడా తమ రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తున్నారు. ఇది చూడటానికి మంచి డిజైన్ కలిగి, వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును కొనుగోలు చేస్తుంటారు. ఆడి కార్లకు కూడా దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ. 18 లక్షల ఖరీదైన హార్లే డేవిడ్‌సన్ బైక్ కూడా కలిగి ఉన్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారం కోసం ‘వారాహి’ని కూడా ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు. అంతే కాకుండా ఈయనకు జూబ్లీహిల్స్‌లో రూ. 12 కోట్ల విలువైన ఓ బంగ్లా ఉన్నట్లు, తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఓ ఫామ్‌హౌస్.. మామిడి తోట, వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం.

ఒకప్పుడు సినిమాలు చేస్తూ.. విలాసవంతమైన జీవితం గడిపే పవన్ రాజకీయంలో అడుగుపెట్టిన తరువాత ఆస్తుల కంటే అప్పులే ఎక్కువయ్యాయి. ఉన్న డబ్బు కౌలు రైతులకు అండగా నిలబడటానికి దారాదత్తం చేశారు. పైన మనం చెప్పుకున్న కార్లు ఇప్పుడు ఆయన వద్ద ఉన్నాయో.. లేదో కూడా తెలియదు. పేదవాడి కష్టం చూస్తే.. తనకున్నదంతా ఇచ్చే గుణం ఉన్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అనటంలో ఎటువంటి సందేహం లేదు.

MLAగా పవన్ కళ్యాణ్ జీతం?

రాజకీయరంగేట్రం చేసినప్పుడు జీతం తీసుకోకుండా పనిచేస్తానన్న పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో గెలిచిన తరువాత MLAగా తాను పూర్తి జీతం తీసుకుంటానని ప్రకటించారు. ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటాను, కాబట్టి తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తనను అనునిత్యం వెంటాడటానికి ఈ జీతం తీసుకుంటానని, జవాబుదారీ రాజకీయాన్ని మనమే ప్రజలకు నేర్పించాలని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మారు. జీతం తీసుకునేవాడు తప్పకుండా జీతానికి తగిన పని చేయాలి.. ఈ భావనతోనే పవన్ కళ్యాణ్ మొత్తం జీతం తీసుకుంటానని పేర్కొన్నారు.

Don’t Miss: వింతగా ఉన్నా అందరి మనసు దోచేస్తోంది!.. ఆనంద్ మహీంద్రా చెంతకు ‘బుజ్జి’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంఎల్ఏకు జీతం రూ.1.25 లక్షల వరకు అందుతుంది. MLAలకు క్వార్టర్స్ లేకపోవడం వాళ్ళ హెచ్ఆర్ఏ కింద మరో రూ. 50000 అందుతుంది. వీటితో పాటు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ సదుపాయాలు అందిస్తారు. ఎంఎల్ఏల అవసరాలకు అనుగుణంగా 1+1 లేదా 2+2 గన్‌మెన్‌లతో భద్రత కల్పిస్తారు. MLAల జీతాలు రాష్ట్రాన్ని బట్టి, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థిని బట్టి మార్పుతూ ఉంటాయి.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles