ఏప్రిలియా రూ.31.26 లక్షల బైక్ వచ్చేసింది – పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Aprilia RSV4 Factory Launched In India: ప్రముఖ బైక్ తయారీ సంస్థ ‘ఏప్రిలియా’ (Aprilia) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘ఆర్‌ఎస్‌వీ4 ఫ్యాక్టరీ’ (RSV4 Factory). ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధర (Price)

కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర రూ. 31.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ చూడటానికి చాలా అద్భుతమైన డిజైన్ కలిగి ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. ఈ బైక్ కొంత డుకాటీ పానిగెల్ వీ4 ఎస్ మాదిరిగా అనిపిస్తుంది. అయితే దీనికంటే ఏప్రిలియా బైక్ ధర రూ. 2.2 లక్షలు ఎక్కువ.

డిజైన్ (Design)

ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 ఫ్యాక్టరీ (Aprilia RSV4 Factory) డ్యూయల్ బీమ్ అల్యూమినియం ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంది. ఇది ముందువైపు సర్దుబాటు చేయగల 43 మిమీ USD ఓహ్లిన్స్ ఫోర్క్ మరియు వెనుక వైపు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓహ్లిన్స్ మోనోషాక్‌ పొందుతుంది. ఈ బైక్ డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 5 ఇంచెస్ కలర్ TFT డిస్‌ప్లే, క్లిన్ ఆన్ హ్యాండిల్ బార్‌లు, అద్భుతమైన టెయిల్ సెక్షన్ పొందుతుంది.

ఫీచర్స్ (Features)

కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ మరియు 6 రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. తద్వారా రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చని తెలుస్తోంది.

ఇంజిన్ (Engine)

ఆర్‌ఎస్‌వీ4 బైకులో ఏప్రిలియా 1099 సీసీ లాంగిట్యూడినల్ వీ4 ఇంజిన్ అందిస్తోంది. ఇది 13000 rpm వద్ద 214 bhp పవర్ మరియు 10550 rpm వద్ద 125 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బైక్ డ్యూయెల్ బీమ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో అండర్‌పిన్ చేయబడింది. అంతే కాకుండా అండర్‌బ్రేస్డ్ స్వింగార్మ్‌ను పొందుతుంది.

కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ 851 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17.9 లీటర్ల వరకు ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 202 కేజీల వరకు ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ఒకే కలర్ ఆప్షన్‌లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న డుకాటీ పానిగేల్ వీ4 (Ducati Panigele V4) మరియు బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఆర్ఆర్ (BMW M 1000 RR) వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాలి వస్తుందని తెలుస్తోంది.

కొత్త బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి..

భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఏప్రిలియా కూడా కస్టమర్లను ఆకర్శించడానికి మరియు దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి ఆధునిక ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఈ తరుణంలో ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 లాంచ్ చేసింది. అయితే ఈ బైక్ ధర చాలా ఎక్కువ కావడం వల్ల ఎలాంటి అమ్మకాలు పొందుతుందనేది తెలియాల్సి వస్తోంది.

ఇండియన్ మార్కెట్లో ఏప్రిలియా బైకులకు, స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే కంపెనీ దేశీయ విఫణిలో స్కూటర్లను, బైకులను లాంచ్ చేస్తోంది. ఖరీదైన సూపర్ బైకులకు కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ ఖరీదైన బైకులు కూడా లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.

Don’t Miss: ఫోర్డ్ మస్టాంగ్ కొత్త ఎడిషన్.. కేవలం 1965 మందికి మాత్రమే – ఎందుకో తెలుసా?

ప్రస్తుతం ఆధునిక కాలంలో రోజువారీ వినియోగానికి కూడా స్పోర్ట్స్ బైకులు ఉపయోగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు ఈ విభాగంలో బైకులను లాంచ్ చేసి కస్టమర్లను ఆకర్శించడంలో ముందడుగు వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు కొత్త బైకులను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిలియా కూడా తనవంతుగా మార్కెట్లో అత్యాధునిక బైకులను లాంచ్ చేస్తూ కొత్త కస్టమర్లను ఆకర్షిస్తోంది.

Exit mobile version