రూ. 94707లకే Bajaj Pulsar N125: కొత్త డిజైన్ & బోలెడన్ని కలర్ ఆప్షన్స్

Bajaj Pulsar N125 Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరికొత్త బజాజ్ యొక్క ‘పల్సర్ ఎన్125’ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పటికే ఈ విభాగంలో మూడు బైకులు అందుబాటులో ఉండగా.. కంపెనీ మరో బైకును లాంచ్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మరియు ఇంజిన్ వివరాలను అధికారికంగా ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి బేస్ ఎల్ఈడీ డిస్క్ వేరియంట్ మరియు ఎల్ఈడీ డిస్క్ బ్లూటూత్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 94,707 మరియు రూ. 98,707 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

ఇంజిన్ వివరాలు

బజాజ్ పల్సర్ ఎన్125 బైక్.. సరికొత్త ఎయిర్ కూల్డ్ 124.58 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8500 rpm వద్ద 12 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

పల్సర్ ఎన్125 బైకులో బజాజ్ కంపెనీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు మోనోషాక్ వంటి వాటితో పాటు సింగిల్ క్రెడిల్ ఫ్రేమ్ అండర్‌పిన్నింగ్‌లను అందిస్తుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఇవన్నీ బైక్ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందించేలా చేస్తాయి.

కలర్ ఆప్షన్స్

కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 బైకు షార్ప్ డిజైన్ కలిగి.. కొత్త పెయింటింగ్ స్కీమ్ పొందుతుంది. బేస్ వేరియంట్ అయిన పల్సర్ ఎన్125 బైక్ వైట్, బ్లాక్, రెడ్ మరియు బ్లూ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. బ్లూటూత్ వేరియంట్ బ్లాక్/రెడ్, బ్లాక్/ఎల్లో మరియి బ్లాక్/గ్రే వంటి డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్ స్ప్లిట్ సీట్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. కాబట్టి రైడర్ మరియు పిలియన్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

లేటెస్ట్ ఫీచర్స్

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ బైకులో కలర్ కోడెడ్ ప్లాటిక్ చుట్టూ ఉన్న ఎల్ఈడీ హెడ్‌లైట్ ఉండటం చూడవచ్చు. అయితే మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఎల్‌సీడీ డిస్‌ప్లేతో బ్లూటూత్ లభిస్తుంది. ఈ బ్లూటూత్ వేరియంట్‌లో పెద్ద డాష్, సైలెంట్ స్టార్ట్ వంటివి లభిస్తాయి. సుమారు 9.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉన్న ఈ బైక్ బరువు 125 కేజీలు మాత్రమే. సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంటుంది. అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్ ఉన్నప్పటికీ.. గ్రౌండ్ క్లియరెన్స్ 198 మిమీ వరకు ఉంటుంది.

Don’t Miss: హోండా ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లాంచ్: ధర & పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
ప్రత్యర్థులు

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 బైక్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టీవీఎస్ రైడర్, హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఉంటుందని సమాచారం. అయినప్పటికీ బజాజ్ యొక్క ఇతర వేరియంట్స్ మాదిరిగానే మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.