Best Selling Electric Car in India 2024 October: ఓ వైపు పండుగ సీజన్.. మరోవైపు కొత్త వాహనాల సందడితో అక్టోబర్ నెల సుఖాంతంగా ముగిసింది. గత నెలలో భారతదేశంలో సుమారు 4 లక్షల కంటే ఎక్కువ కార్లను అమ్ముడైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఒక లక్ష కంటే ఎక్కువని తెలుస్తోంది. అయితే ఇందులో కూడా ఎంజీ మోటార్ బ్రాండ్ కార్లు మంచి సంఖ్యలో అమ్ముడైనట్లు సమాచారం.
విండ్సర్ ఈవీ
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ గత కొన్ని రోజులకు ముందే ‘విండ్సర్ ఈవీ’ (Windsor EV) లాంచ్ చేసింది. లాంచ్ అయిన తరువాత అక్టోబర్ నెలలో 3,116 విండ్సర్ ఈవీలు విక్రయించబడినట్లు తెలుస్తోంది. అమ్మకాల పరంగా గత నెలలో విక్రయించబడిన అన్ని ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లలో విండ్సర్ ఈవీ అత్యధికం అని తెలుస్తోంది.
ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.50 లక్షలు, రూ. 14.50 లక్షలు మరియు రూ. 15.50 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎంజీ మోటార్ కార్ల కంటే కొంత భిన్నంగా ఉంటుంది.
బ్యాటరీ & రేంజ్
విండ్సర్ ఈవీ అనేది క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్స్. ఇది 38 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్పెట్ (LFP) బ్యాటరీ ఉంది. ఇందులోని పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 136 పీఎస్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు ఒక ఫుల్ చార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ చేత ధృవీకరించబడింది.
ఎకో ప్లస్, ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగిన ఎంజీ విండ్సర్ ఈవీ.. ప్రకాశవంతమైన ఫ్రంట్ లోగో, ఎల్ఈడీ లైట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఏరో లాంజ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేషన్ సీట్లు, వైర్‌లెస్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివన్నీ పొందుతుంది.
Don’t Miss: పండుగ సీజన్‌లో 4.25 లక్షల కార్లు కొనేశారు: ఎక్కువగా ఏ కార్లు కొన్నారంటే..
పైన చెప్పిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. పీఎం 2.5 ఫిల్టర్, పవర్ టెయిల్‌గేట్, పనోరమిక్ పనోరమిక్, వెనుక సీటు 135 డిగ్రీ రిక్లైన్ యాంగిల్‌తో 60:40 స్ప్లిట్ వంటివి ఉన్నాయి. కంపెనీ ఈ కారులో 80 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ అందించింది. ఇందులో ఐస్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ కూడా ఉంది. డిజిటల్ బ్లూటూత్ కీ మరియు 36 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.