Bigg Boss Fame Chahat Pandey Car Gifts To Mom: ప్రతి ఒక్కరూ.. తమ తల్లిదండ్రులకు కార్లను గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ జాబితాలోకి తాజాగా బిగ్‌బాస్ 18 ఫేమ్.. టెలివిజన్ నటి ‘చాహత్ పాండే’ చేరింది. చాహత్ తన తల్లికి ఖరీదైన కియా కారును గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. చాహత్ పాండేకు డీలర్షిప్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత కేక్ కట్ చేయడం, తన తల్లికి కారును గిఫ్ట్ ఇవ్వడం వంటివి కూడా చూడవచ్చు. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పాండేను పొగడ్తలతో ముంచేస్తున్నారు.
కియా కారెన్స్ (Kia Carens)
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కియా కార్లలో ‘కారెన్స్’ ఒకటి. ఇది 7 సీటర్ ఎంపీవీ. ఈ కారు ధరలు రూ. 12.24 లక్షల నుంచి రూ. 23.75 లక్షల మధ్య ఉన్నాయి. ఇది మొత్తం 33 వేరియంట్లలో లభిస్తుంది. కాగా చాహత్ పాండే.. తన తల్లి కోసం ఏ వేరియంట్ ఎంచుకుంది? ఇంజిన్ ఆప్షన్ ఏంటి? అనే వివరాలు వెల్లడించలేదు.
కియా కారెన్స్ కారులో 115 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే.. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 160 హార్స్ పవర్ అందించే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 116 హార్స్ పవర్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి. ఇంజిన్స్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ఎంపికలలో లభిస్తాయి.
కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్
ఇప్పటికే గొప్ప అమ్మకాలు పొందిన.. కియా కారెన్స్, రాబోయే రోజుల్లో ఫేస్‌లిఫ్ట్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అప్డేటెడ్ కార్లు.. సరికొత్త డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండనున్నాయి. ఇందులో లెవెల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు మొదలైనవి కొత్త ఫీచర్స్.
Also Read: అల్ట్రావయొలెట్ కొత్త టూ వీలర్స్ ఇవే: పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
ఎలక్ట్రిక్ కారెన్స్ విషయానికి వస్తే.. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఇది 42 కిలోవాట్ మరియు 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. ఇది కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ప్రీమియం ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ మాత్రం కొంత మారుతుంది.
2025లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కియా కారెన్స్.. ఇప్పటి వరకు దాదాపు 2,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. దీన్నిబట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ కారు ఫేస్‌లిఫ్ట్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో అడుగుపెడితే.. తప్పకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. మంచి అమ్మకాలను కూడా పొందుతుందని భావిస్తున్నాము. అయితే కారెన్స్ ఫేస్‌లిఫ్ట్, కారెన్స్ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతాయి? వాటి ధరలు ఎలా ఉండబోతున్నాయి? బుకింగ్స్ వంటి చాలా విషయాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి.
View this post on Instagram