మహీంద్రా థార్‌తో దుమ్ములేపిన హీరోయిన్.. ఆఫ్-రోడింగ్ అయినా తగ్గేదేలే

Bollywood Actress Nushrat Bharucha Mahindra Thar Off Roading: ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయి సంవత్సరాలు గడుస్తున్నా.. మహీంద్రా యొక్క థార్ ఎస్‌యూవీకి ఆదరనగానీ, డిమాండ్ గానీ ఏ మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం థార్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఆఫ్-రోడింగ్ కెపాసిటీ కూడా. ఈ కారును సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ నటి ‘నుష్రత్ భారుచా’ (Nushrat Bharucha) ఒకరు. ఇటీవల ఈమె తన థార్ ఎస్‌యూవీతో ఆఫ్-రోడింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

నటి నుష్రత్ భారుచా.. గతంలో కూడా అనేక సందర్భాల్లో థార్ డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు ఏకంగా ఆఫ్-రోడింగ్ చేస్తూ చూపరులను ఫిదా చేస్తున్నారు. నటి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోలో గమనిస్తే.. ఆఫ్-రోడింగ్ ఎలా చేయాలో ఓ అనుభవజ్ఞుడైన డ్రైవర్ ఇచ్చిన సూచనలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

థార్ డ్రైవ్..

వీడియో ప్రారంభంలో పచ్చని గడ్డి మైదానంలో థార్ కారు డ్రైవ్ చేస్తూ రౌండే వేయడం చూడవచ్చు. ఇలా చేయడం ఆమెకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆ సమయంలో వర్షపు చినుకులు కురుస్తుండం కూడా చూడవచ్చు. ఆ తరువాత మెల్లగా ఏటవాలుగా వున్న ప్రదేశంలోకి కారును పోనిస్తుంది. ఆ తరువాత బురద గుంటల్లో కూడా కారును డ్రైవ్ చేస్తుంది. మొత్తం మీద అనుకున్న విధంగా ఆఫ్-రోడింగ్ పూర్తి చేసింది. ఇది మొత్తం అనుభవజ్ఞులైన వారి సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది.

నుష్రత్ భారుచా గతంలో మహీంద్రా థార్ సాధారణ డ్రైవ్ చేసినప్పటికీ.. ఆఫ్-రోడింగ్ ఎప్పుడూ చేయలేదని తెలుస్తోంది. బహుశా నుష్రత్ ఆఫ్-రోడింగ్ చేయడం ఇదే మొదటిసారి అయి ఉంటుందని తెలుస్తోంది. అయితే గతంలో చాలామంది ఆఫ్-రోడింగ్ ప్రియులు థార్ ఎస్‌యూవీతో పలుమార్లు ఆఫ్-రోడింగ్ చేస్తూ కనిపించారు. ఈ ఎస్‌యూవీ ఆఫ్-రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చాలామంది వెల్లడించారు.

మహీంద్రా థార్

భారతదేశంలో ఒకప్పటి నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క థార్.. ఎస్‌యూవీ ఆఫ్-రోడింగ్ విభాగంలో సరసరమైన కారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 పీఎస్ పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇక 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 130 Bhp పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మహీంద్రా థార్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు రెండూ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. ఇక థార్ డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. పర్ఫామెన్స్ పరంగా దీనికిదే సాటి.

థార్ ఎస్‌యూవీతో పాటు.. నుష్రత్ భారుచా ఖరీదైన బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ కారును కూడా కలిగి ఉన్నారు. ఈమె మాత్రమే కాకుండా నటి కియారా అద్వానీ కూడా మహీంద్రా థార్ కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ మరియు కునాల్ ఖేము వంటి సెలబ్రిటీలు కూడా ఈ మహీంద్రా థార్ కారును కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా థార్ ఎస్‌యూవీ అంటే సెలబ్రిటీలకు ఎంత ఇష్టమో అర్థమవుతోంది.

Don’t Miss: ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

ఇక చివరగా మహీంద్రా థార్ యొక్క ధరల విషయానికి వస్తే.. దేశీయ విఫణిలో థార్ ధరలు రూ. 11.35 లక్షల నుంచి రూ. 17.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ మల్టిపుల్ వేరియంట్లలో.. వివిధ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అంతే కాకుండా కంపెనీ మార్కెట్లో థార్ 5 డోర్ వెర్షన్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ 5 డోర్ వెర్షన్ త్వరలో మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.