23.2 C
Hyderabad
Tuesday, January 21, 2025

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై మనసుపడ్డ సెలబ్రిటీలు వీరే – ఇక్కడ చూడండి

Celebrities Royal Enfield Bikes Gul Panag To Kartik Aryan: భారతదేశంలో ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) బైకులకున్న ఆదరణ మరియు డిమాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఈ బైకులను ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేశారు, చేస్తున్నారు. భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కలిగిన సెలబ్రిటీలు ఎవరు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గుల్ పనాగ్ (Gul Panag)

ప్రముఖ నటి గుల్ పనాగ్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కలిగి ఉన్న సెలబిటీలలో ఒకరు. గతంలో చాలా సందర్భాల్లో ఈమె కార్లు మరియు బైకులపై కనిపించింది. గుల్ పనాగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రా కాస్ట్ ఐరన్ మరియు క్లాసిక్ మోడళ్లను నడుపుతూ కనిపించిన వీడియోలు మరియు ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

వరుణ్ ధావన్ (Varun Dhawan)

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్, కరణ్ జోహార్ యొక్క “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్”లో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇటీవల, అతను ఆలివ్ గ్రీన్ కలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 బైక్ రైడ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించాడు. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

జాన్ అబ్రహం (John Abraham)

ఖరీదైన కార్లు మరియు బైకులను ఎక్కువగా ఇష్టపడే జాన్ అబ్రహం వద్ద ఒక మాడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ యొక్క 350 సీసీ AVL మాచిస్మో మోడల్ అని తెలుస్తోంది. ఇది ఆలీవ్ గ్రీన్ బాడీ, రీషేప్డ్ ఫ్యూయల్ ట్యాంక్, రీపోజిషన్డ్ హ్యాండిల్ బార్ మరియు పొడవైన వీల్‌బేస్ వంటి వాటిని కలిగి ఉంది. ఈ బైక్ బుల్‌సిటీ కస్టమ్స్‌చేత కస్టమైజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

నానా పటేకర్ (Nana Patekar)

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కలిగి ఉన్న ప్రముఖ నటులలో ఒకరు నానా పటేకర్. ఈయన గతంలో చాలా సార్లు ముంబై వీధుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రైడ్ చేస్తూ కనిపించాడు. నానా పటేకర్ హెల్మెట్ లేకుండా కనిపించి.. తలకు రక్షణ కరువైందని వివరిస్తూ ఓ సినిమాను ప్రమోట్ చేసినట్లు కూడా తెలుస్తోంది తెలుస్తోంది.

ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapoor)

నటుడు ‘ఆదిత్య రాయ్ కపూర్’ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైకులను ఎక్కువగా ఇష్టపడే సెలబ్రిటీల జాబితాలో ఒకరు. ఇతడు AVL ఇంజిన్ కలిగిన మాచిస్మో 500 కలిగిన 500 సీసీ బైక్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మాత్రమే కాకుండా ఇతర బ్రాండ్ మోటార్ సైకిల్స్ కూడా ఈయన గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ (Salman Khan)

కండల వీరుడు సల్లూ భాయ్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రేమికుడే. ఈయన సుజుకి మోటార్‌సైకిళ్లకు అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అయినప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైకుని కలిగి ఉన్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. ఇది మాత్రమే కాకుండా సల్మాన్ ఖాన్ వద్ద హయబుసా మరియు ఇంట్రూడర్‌ వంటి ఖరీదైన అన్యదేశ బైక్‌లు కూడా ఉన్నాయి.

కల్కి కోచ్లిన్ (Kalki Koechlin)

నటుడు కల్కి కోచ్లిన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో తన తండ్రితో కలిసి ఈశాన్య భారతదేశానికి సుమారు 40000 కిమీ పైగా రైడ్ చేశారు. ఈ ట్రిప్ సమయంలో వీరిద్దరూ ఏడు రాష్ట్రాలను అన్వేషించారు, ఇది ట్రావెల్ షో కూడా డాక్యుమెంట్ చేయబడింది. అంతే కాకుండా కల్కి ఇండియాలో ఉన్నప్పుడు ముంబై వీధుల్లో కూడా బైక్ రైడ్ చేసేవారని చెబుతారు.

Don’t Miss: BYD Seal EV: భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

కార్తీక్ ఆర్యన్ (Kartik Aryan)

లంబోర్ఘిని వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్న కార్తీక్ ఆర్యన్ గ్యారేజిలో రెడ్ కలర్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్’ బైక్ కూడా ఉంది. ఈ బైకుని అతడు 2021లో కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. ఇతని వద్ద క్లాసిక్ బైక్ మాత్రమే కాకుండా హంటర్ 350కూడా ఉంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles