26.2 C
Hyderabad
Friday, January 17, 2025

ఒక్కొక్కటి కాదు.. ఒక్కొక్కరికి రెండు: సెలబ్రిటీలంటే అట్లుంటది

Celebrities Who Own Two Mercedes Benz Maybach Cars: సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారని అందరికీ తెలుసు. ఇష్టపడితే ఒక బ్రాండుకు సంబంధించిన కారును ఒకటి కొనుగోలు చేస్తారు. మరీ మక్కువ పడుతున్నారంటే.. అదే బ్రాండుకు చెందిన రెండు కార్లను కొనుగోలు చేస్తారు. కానీ ఒకే మోడల్ కారును.. ఎవరైనా రెండు కొనుగోలు చేస్తారా?.. ఈ కథనంలో ఒకే మోడల్ కార్లను రెండు కలిగిన సెలబ్రెటీలు (సినీతారలు) ఎవరు? వారు కొనుగోలు చేసిన కార్లు ఏవి? వాటి వివరాలు ఏమిటనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకుందాం.

ఒక బ్రాండుకు చెందిన.. ఒకే మోడల్ కార్లను రెండు కొనుగోలు చేసిన సినీతారల జాబితాలో విద్యా బాలన్, దీపికా పదుకొనే మరియు కంగనా రనౌత్ ఉన్నారు.

విద్యా బాలన్ (Vidya Balan)

ప్రముఖ నటి విద్యా బాలన్ ఇష్టపడి కొనుగోలు చేసిన కార్లలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన మేబ్యాచ్ ఎస్580 మరియు జీఎల్ఎస్600 చెప్పుకోదగ్గవి. ఇవి రెండూ కూడా ఒకే మోడల్ అయినప్పటికీ.. వేరు వేరు వేరియంట్స్ అన్నమాట.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 కారు ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 4.0 లీటర్ వీ8 ఇంజిన్.. 557 పీఎస్ పవర్, 730 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హైబ్రిడ్ సిస్టం కలిగి ఉండటం వల్ల పవర్ మరియు టార్క్ అనేది కొంత పెరుగుతుంది. తద్వారా పర్ఫామెన్స్ ఉత్తమంగా ఉంటుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది.

ఇక మేబ్యాచ్ ఎస్580 విషయానికి వస్తే.. దీని ధర రూ. 2.72 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 4.0 లీటర్ ఇంజిన్ 496 బీహెచ్‌పీ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. పవర్ అనేది నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.

దీపికా పదుకొనే (Deepika Padukone)

నటి దీపికా పదుకొనె ఉపయోగించే కార్లలో కూడా రెండు మేబ్యాచ్ కార్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ‘ఎస్500’. ఇది పాతతరం మోడల్. ఈ కారులో 4.7 లీటర్ వీ8 బై-టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 455 బీహెచ్‌పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ కారు మోడల్స్ విక్రయానికి లేదు. కానీ ఇది అమ్మకానికి ఉన్న సమయంలో దీని ధర రూ. 1.85 కోట్లు.

దీపికా పదుకొనె గ్యారేజిలోని మరో కారు జీఎస్ఎస్600. నిజానికి ఈ కారును ఈమె భర్త రణబీర్ సింగ్ గిఫ్ట్ అని సమాచారం. బాలీవుడ్‌లో మొట్ట మొదటి జీఎల్ఎస్ కొనుగోలు చేసిన వ్యక్తులలో వీరు ఒకరు. చూడచక్కని డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). మేబ్యాచ్ కార్లు మాత్రమే కాకుండా.. వీరి గ్యారేజిలో ఆడి క్యూ7, ఆడి ఏ8ఎల్, మినీ కూపర్ కన్వర్టిబుల్, ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ ఎస్, లంబోర్ఘిని మరియు రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం.

కంగనా రనౌత్ (Kangana Ranaut)

ప్రముఖ నటి, రాజకీయం నాయకురాలు కంగనా రనౌత్ విషయానికి వస్తే.. ఈమె కూడా రెండు మేబ్యాచ్ కార్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి ఎస్680. ఇది ఎస్580 మోడల్ కంటే కూడా పెద్దది. ఈ కారులో 6.0 లీటర్ వీ12 ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 604 Bhp పవర్ మరియు 900 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది.

Also Read: మీకు తెలుసా?.. ఈ ఏడాది (2024) కనుమరుగైన కార్లు ఇవే!

కంగనా గ్యారేజిలోని మరో మెర్సిడెస్ మేబ్యాచ్ జారు జీఎల్ఎస్600. ఎక్కువ సార్లు కంగనా ఈ కారులో కనిపించింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఈ బెంజ్ మేబ్యాచ్ కార్లు కాకుండా.. నటి గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350డీ, బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‌డీ మరియు ఆడి క్యూ3 వంటి కార్లు ఉన్నాయి.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles