Rashmika Mandanna Buys Mercedes Benz S450: ఛలో సినిమాతో.. తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన ‘రష్మిక మందన్న’ (Rashmika Mandanna) ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయింది. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. పుష్ప 2 సినిమా కోసం ఈమె ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా.. ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈమె కొనుగోలు చేసిన కారు ఏది?, దాని ధర ఎంత?, అనే ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఓ వైపు తెలుగు, మరోవైపు హిందీ భాషలలో నటిస్తూ.. బిజీ అయిపోయిన రష్మిక మందన్న మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్ 450 (Mercedes Benz S450) కొనుగోలు చేసింది. ఇది విలాసవంతమైన ఫీచర్స్ కలిగి.. విశాలంగా ఉండటం వల్ల ప్రయాణంలో కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. బహుశా దీనికోసమే రష్మిక ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త కారుతో రష్మిక ముంబై విమానాశ్రయంలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్ నుంచి రష్మిక మందన్న బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది. బయటకు వచ్చిన తరువాత అభిమానులు, ఫొటోగ్రాఫర్లకు హాయ్ చెబుతూ ముందుకు వెళ్ళింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పటికే ఖరీదైన కార్లను కలిగి ఉంది.
మెర్సిడెస్ బెంజ్ ఎస్450 (Mercedes Benz S450)
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ యొక్క ‘ఎస్450’ విషయానికి వస్తే.. ఇది ఇండియన్ మార్కెట్లో ఎంతోమంది సెలబ్రిటీలకు ఇష్టమైన మోడల్. ఈ మోడల్ కేవలం పెట్రోల్ ఇంజిన్ రూపంలో మాత్రమే లభిస్తుంది. డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వారికి ఎస్ 350డీ రూపంలో లభిస్తుంది. అయితే ఈ రెండు వేరియంట్లు.. 4మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతాయి.
మెర్సిడెస్ బెంజ్ ఎస్450 కారు ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ప్లస్ సిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, కీలెస్ గో, లైట్ వెయిట్ అల్లాయ్ వీల్స్ మరియు స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది.
ఈ కారు లెదర్ అపోల్స్ట్రే, పెద్ద ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, వెనుక సీటు ప్రయాణికుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్స్, మసాజ్ అండ్ వెంటిలేషన్ ఫంక్షన్‌తో అన్నీ సీట్లు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ పొందుతుంది. యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా ఈ కారులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ ఎస్450 కారులో 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 360 Bhp పవర్ మరియు 500 Nm టార్క్ అందిస్తాయి. ఇంజిన్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. పవర్ అనేది 4మ్యాటిక్ టెక్నాలజీని ఉపయోగించి.. నాలుగు చక్రాలకు అందుతుంది.
Also Read: అభిమాని కోసం బంగారం ఇచ్చేసిన హీరోయిన్ – వీడియో
కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్450 ధర రూ. 1.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఆన్ రోడ్ ధరలు రూ. 2.25 కోట్లు వరకు ఉంటుంది. ధర ఎక్కువ కాబట్టి దీనిని సాధారణ ప్రజలు కొనుగోలు చేసే అవకాశం లేదు. అయితే ఈ కారును రష్మిక మందన్న మాత్రమే కాకుండా.. సల్మాన్ ఖాన్ తండ్రి.. సలీం ఖాన్, నిమ్రత్ కౌర్, షాహిద్ కపూర్, విద్యా బాలన్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు కూడా కొనుగోలు చేశారు.