19ఏళ్ల కుమారునికి రూ.11.53 లక్షల బైక్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి – వీడియో

Father Gifts Kawasaki Bike to 19 Year Old Son: తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు బైకులను లేదా కార్లను గిఫ్ట్స్ ఇచ్చే ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో ఇలాంటి సంఘటనలను సంబంధించిన కథనాలు చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ఒక తండ్రి.. తన 19ఏళ్ల కొడుక్కి ఖరీదైన స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది కవాసకి కంపెనీకి చెందిన జెడ్ఎక్స్6ఆర్ (Kawasaki ZX6R). దీని ధర రూ. 11.53 లక్షలు (ఎక్స్ షోరూమ్). తండ్రి.. కుమారునికి బైక్ గిఫ్ట్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

కొడుక్కి బైక్ గిఫ్ట్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. తల్లిదండ్రులు కవాసకి డీలర్‌షిప్‌లో తమ కొడుక్కి బైక్ ఇవ్వడం చూడవవచ్చు. ఆ తరువాత కొడుకుతో కలిసి కేక్ కట్ చేయడం కనిపిస్తుంది. ఆ సమయంలో తల్లి ఆనందంగా ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు.

నెట్టింట్లో ఈ వీడియో వైరల్ కావడంతో.. కొందరు కామెంట్ చేశారు. ఇంత చిన్న వయసులో అంత ఖరీదైన స్పోర్ట్స్ బైక్ ఎందుకు గిఫ్ట్ ఇవ్వడం అని కొందరు అన్నారు. యువకుడు కాబట్టి చాలా వేగంతో వెళ్ళవచ్చు, వేగం పెరిగితే ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని మరికొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

నిజానికి వీడియోలో కనిపిస్తున్న 19 ఏళ్ల యువకుడు అనుభవజ్ఞుడైన రైడర్ అని తెలుస్తోంది. ఇతడు ఇప్పటికే.. హై పర్ఫామెన్స్ బైకులను నడిపిన అనుభవం కూడా ఉంది. గతంలో కవాసకి నింజా 300, ఏప్రిలియా 457 వంటి బైకులను రైడ్ చేసాడు. కాగా ఇకపై క్వాసాకి జెడ్ఆర్6ఆర్ రైడ్ చేయనున్నాడు.

కవాసకి జెడ్ఎక్స్6ఆర్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో కవాసకి బ్రాండ్ చెప్పుకోదగ్గది. ఈ కంపెనీ లెక్కకు మించిన బైకులను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఒకటి జెడ్ఎక్స్6ఆర్. దీని ధర రూ. 11.53 లక్షలు కావడం గమనార్హం. దీని ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువమంది మాత్రమే కొనుగోలు చేస్తుంటారు.

చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన కవాసకి జెడ్ఎక్స్6ఆర్ బైక్ గ్రీన్ మరియు బ్లాక్ అండ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 13000 rpm వద్ద 129 హార్స్ పవర్, 11000 rpm వద్ద 69 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాని బీఎస్ 4 మోడల్ కంటే ఉత్తమ పనితీరును అందిస్తుంది. అంతే కాకుండా దీని బరువు దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రెండు కేజీలు తక్కువ కావడం గమనార్హం.

Also Read: మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!

స్పోర్ట్స్, రోడ్, రెయిన్ మరియు రైడర్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉన్న కవాసకి జెడ్ఎక్స్6ఆర్ బైక్.. ట్రాక్షన్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ బైక్ బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉండటం చేత.. దాని పాత మోడల్ కంటే గొప్ప పనితీరును అందిస్తుంది. డిజైన్ మాత్రమే కాకుండా.. ఇందులోని ఫీచర్స్ రైడర్లకు అనుకూలంగా ఉండేలా ఉంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Vanshul Nagpal (@speedy_rizzler)

Leave a Comment