Dad Mahindra Thar ROXX Gift To Son: తల్లిదండ్రులు తమ పిల్లలకు, పిల్లలు తమ తల్లితండ్రులకు ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యపరచడం కొత్తేమీ కాదు. ఇలాంటి కథనాలు గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ సంఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2025 కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఓ తండ్రి, తన కొడుక్కి ఓ అద్భుతమైన కారును గిఫ్ట్ ఇచ్చారు. ఇంతకీ ఆ తండ్రి ఇచ్చిన కారు ఏది? దాని ధర, వివరాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఆశయ్ ఖిరే అనే వ్యక్తికి, తన తండ్రి మహీంద్రా కంపెనీకి చెందిన థార్ రోక్స్ (Mahindra Thar Roxx) గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఖిరే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ”కల నెరవేరడంతో సంవత్సరం ముగుస్తుంది. నాన్న సరికొత్త ‘థార్ రాక్స్’తో మమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచారు. మా హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది. కొత్త ప్రయాణాలు, గొప్ప జ్ఞాపకాలతో.. 2025 ప్రారంభమైంది” అని పేర్కొన్నాడు.
ఆశయ్ ఖిరేకు ఇచ్చిన మహీంద్రా థార్ రోక్స్ కారు నీలం రంగులో ఉంది. ఈ కారుతో ఆ తండ్రి, కొడుకులు ఉండటం కూడా చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు.. ఆ తండ్రిని ప్రశంసించేస్తున్నారు. అయితే ఇలా తండ్రి.. కొడుక్కి గిఫ్ట్ ఇచ్చిన ఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి.
మహీంద్రా థార్ రోక్స్
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ 3 డోర్ వెర్షన్ అప్డటెడ్ మోడల్.. ఈ 5 డోర్ వెర్షన్ థార్ లేదా రోక్స్. ఇది కూడా చాలా తక్కువ రోజుల్లోనే వాహన ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధించింది. ఇప్పటికి కూడా ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ సుమారు 1.5 సంవత్సరాలు ఉంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో.. ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
సరికొత్త థార్ రోక్స్ కారును.. కంపెనీ చాలా అద్భుతంగా డిజైన్ చేసింది. కాబట్టి ఇది దాని మునుపటి 3 డోర్ వెర్షన్ కంటే కూడా విశాలంగా సుమారు 18 వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీఓ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బ్యాటిల్‌షిప్ గ్రే, బర్న్ట్ సియెన్నా వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కాబట్టి థార్ రోక్స్ ప్రియులు తమకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
Also Read: అంబానీ గ్యారేజిలో కూడా లేదు!.. ఈ ఒక్క నటి దగ్గర మాత్రమే ఆ కారు ఉంది
10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కలిగిన మహీంద్రా రోక్స్.. అదే పరిమాణంలో ఉండే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పొందుతుంది. అంతే కాకుండా వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, హర్మాన్ కార్డాన్ 9 స్పీకర్ ఆడియో సిస్టం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఫ్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. రోక్స్ టాప్ వేరియంట్లలో లెవెల్ 2 ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.
మహీంద్రా థార్ రోక్స్ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ ఎంస్టాలిన్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 380 న్యూటన్ మీటర్ టార్క్, 174 బీహెచ్‌పీ పవర్ అందిస్తుంది. అదే సమయంలో 2.2 లీటర్ ఎంహాక్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 330 ఎన్ఎమ్ టార్క్, 150 బిహెచ్‌పీ పవర్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.
థార్ రోక్స్ ధరలు (Thar Roxx Price)
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ రోక్స్ ధరలు రూ. 12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ఎందోమంది వాహన ప్రేమికులను ఆకర్షిస్తున్న ఈ 5 డోర్ థార్ వెర్షన్.. అత్యద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. గొప్ప డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే మార్కెట్లో ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.