23.2 C
Hyderabad
Tuesday, January 21, 2025

కేజీఎఫ్ సినిమాలో ఎన్ని కార్లు వాడారో తెలుసా? వాటి స్పెషాలిటీ ఇదే..

Do You Know About The Cars Seen in KGF Movie: 2018లో విడుదలైన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. రాకింగ్ స్టార్ యష్ (Yash) నటించిన ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కింది. కాగా కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. అతి తక్కువ కాలంలోనే వందల కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. బాహుబలి తరువాత అంతటి రికార్డును క్రియేట్ చేసింది.

నిజానికి కేజీఎఫ్ సినిమా చూసిన చాలామంది.. ఆ మూవీలో కనిపించే కార్లకు తప్పకుండా ఫిదా అయిపోయి ఉంటారు. సినిమా 2018లో విడుదలైనప్పటికీ.. అందులో ఉపయోగించనవన్నీ వింటేజ్ కార్లే. ఈ కారు చూడగానే కొత్తగా అనిపించడం మాత్రమే కాదు.. వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా ఏర్పడి ఉంటుంది. ఈ కథనంలో కేజీఎఫ్ సినిమాలో కనిపించిన కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.. రండి.

కేజీఎఫ్ సినిమాలో కనిపించిన కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి 1976 మస్టాంగ్ మ్యాక్ 1, 1969 ఎంజీ రోడ్‌స్టర్, 1969 ఫోక్స్‌వ్యాగన్ టీ2 క్యాంపర్, 1977 మెర్సిడెస్ డబ్ల్యు-123 మరియు రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో కార్లు.

1976 మస్టాంగ్ మ్యాక్

నిజానికి ఫోర్డ్ కంపెనీ మస్టాంగ్ కార్లను ఉత్పత్తి చేస్తుందని తెలుసు. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశంలో తన ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. అయితే ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో ఎంతోమంది వాహన మనసుదోచిన ఘనత ఈ మస్టాంగ్ కార్ల సొంతం అనే చెప్పాలి. అయితే కేజీఎఫ్ సినిమాలో కనిపించిన ఫోర్డ్ మస్టాంగ్ కారు 1976 నాటి మ్యాక్ అని తెలుస్తోంది.

ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. ఇక్కడ కనిపిస్తున్న కారు మస్టాంగ్ మ్యాక్ మాదిరిగా అనిపించినప్పటికీ.. మస్టాంగ్ మ్యాక్ కాదు. ఎందుకంటే ఇది హిందూస్తాన్ మోటార్స్ కంపెనీకి చెందిన కాంటెస్సా అని తెలుస్తోంది. దీనిని సినిమా కోసం కస్టమైజ్ చేసుకున్నట్లు సమాచారం. ఇది ఛేజింగ్ వంటి సన్నీ వేషాల్లో కనిపిస్తుంది. ఇది చూడగానే ప్రేక్షకుల మనసులో ఇట్టే నిలిచిపోయింది.

1969 ఎంజీ రోడ్‌స్టర్

కేజీఎఫ్ సినిమాలో కనిపించిన మరో కారు ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన రోడ్‌స్టర్ అని తెలుస్తోంది. ఎరుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ కారును ఉపయోగించారు. ఇది కూడా హార్డ్ టాప్ వెర్షన్ అని తెలుస్తోంది. ప్యాలెస్ నుంచి వెళ్లే సమయంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ కారును ఉపయోగించడం చూడవచ్చు.

భారతదేశంలో ప్రస్తుతం ఎంజీ మోటార్ కంపెనీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే పాత కాలం నాటి మోడల్స్ ఇప్పుడు లేదు. వాటి స్థానంలో ఎంజీ హెక్టర్, ఎంజీ గ్లోస్టర్ మరియు ఎంజీ కామెట్ ఈవీ వంటి మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎంజీ మోటార్ కంపెనీ ఒకప్పటి నుంచి అధిక ప్రజాదరణ పొందుతున్నట్లు స్పష్టమవుతోంది.

1969 ఫోక్స్‌వ్యాగన్ టీ2 క్యాంపర్

కేజీఎఫ్ సినిమాలో కనిపించిన మరో కారు 1969 ఫోక్స్‌వ్యాగన్ టీ2 క్యాంపర్. ఇది చూడటానికి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఓమ్ని కారు మాదిరిగా ఉంది. అయితే ఫోక్స్‌వ్యాగన్ టీ2 క్యాంపర్.. ఓమ్ని కంటే చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ వ్యాన్ సినిమా సెకండాఫ్‌లో కనిపిస్తుంది. డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ పొందిన ఈ కారు బ్లూ అండ్ వైట్ కలర్ పొందింది. ఈ కారు ఒకప్పటి పాత సినిమాల్లో కూడా విరివిగా ఉపయోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మళ్ళీ కేజీఎఫ్ సినిమాలో దర్శనమిచ్చింది.

1977 మెర్సిడెస్ డబ్ల్యు-123

కేజీఎఫ్ సినిమాలో కనిపించిన మరో కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన డబ్ల్యు-123. సినిమాలో ఈ కారును హీరో యష్ ఉపయోగించడం చూడవచ్చు. ఒకప్పుడు భారతీయ మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ కారు.. ఇప్పటికి కూడా ఎంతోమందికి అభిమాన వాహనం కూడా. ఈ కారులో ఎక్కువ భాగం క్రోమ్ ఉండటం చూడవచ్చు.

Don’t Miss: కోట్లు కొల్లగొట్టిన సినిమాలో స్టార్‌ హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించాడు.. ఎవరో తెలుసా?

రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో

ఒకప్పటి నుంచి రోల్స్ రాయిస్ కార్లకు మంచి డిమాండ్ ఉందని సినిమా చూడగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఆధునిక కాలమో కూడా అత్యంత ఖరీదైన కార్లను తయారీలు చేస్తున్న కార్ల కంపెనీలలో రోల్స్ రాయిస్ కంపెనీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో అనేది అప్పట్లోనే అత్యంత ఖరీదైన కారు. ఇది 1965 నుంచి 1980 వరకు గొప్ప ఆదరణ పొందింది. కేజీఎఫ్ సినిమాలో ఈ కారును కూడా చూడవచ్చు. పైన పేర్కొన్న దాదాపు అన్ని కార్లు కేజీఎఫ్ 2 సినిమాలో కూడా కనిపించే అవకాశం ఉందని సమాచారం.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles