Cars Sales in Festive Season 2024: భారతదేశంలో వాహన అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్న సమయంలో.. పండుగ సీజన్ కొత్త ఉత్సాహాన్ని అందించింది. వాహన్ డేటా ప్రకారం, పండుగ సీజన్‌లో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2024 అక్టోబర్ 29 నాటికి ప్యాసింజర్ వెహికల్స్ రిజిస్రేషన్ల సంఖ్య 4,25,000 యూనిట్లకు చేరినట్లు సమాచారం. కాగా జనవరి 2024లో ప్యాసింజర్ కార్ల రిజిస్రేషన్స్ 3,99,112 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. పండుగ సీజన్ వాహనాల అమ్మకాలను అమాంతం పెంచిందని స్పష్టమవుతోంది.
వాహన అమ్మకాలు పెరగడానికి కారణం
దేశంలో వాహనాల అమ్మకాలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం నవరాత్రి (దసరా), ధన త్రయోదశి మరియు దీపావళి అని తెలుస్తోంది. అయితే ఇటురా నెలలతో పోలిస్తే అక్టోబర్‌లో వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అక్టోబర్ నెలలో వాహన్ పోర్టల్‌లో జాబితా చేయబడిన ప్రైవేట్ కార్లు, క్యాబ్‌ల సంఖ్య మొత్తం 4.25 లక్షలు. 2024లో నెలవారీ రిజిస్ట్రేషన్స్ సుమారు 3,33,000 యూనిట్లు. ఇది గత ఏడాది నెలవారీ అమ్మకాలతో పోలిస్తే.. 5 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అమ్మకాల్లో అగ్రగామి మారుతి సుజుకి
మారుతి సుజుకి అక్టోబర్ 2024లో ఏకంగా 2,06,434 యూనిట్ల కార్లను విజయవంతంగా విక్రయించగలిగింది. ఈ అమ్మకాలు 2024 అక్టోబర్ కంటే 4 శాతం ఎక్కువని తెలుస్తోంది. అంటే 2024 అక్టోబర్ నెలలో మారుతి సుజుకి సేల్స్ 1,99,217 యూనిట్లు అని తెలుస్తోంది. గత నెలలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1,68,047 యూనిట్లు. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాదికంటే 1,59,591 యూనిట్లు. అమ్మకాలు అక్టోబర్ 2023 కంటే కూడా అక్టోబర్ 2024లో 5 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.
ఆల్టో, ఎస్ ప్రెస్సో వంటి మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు అక్టోబర్ 2023లో 14568 యూనిట్లు, కాగా అక్టోబర్ 2024లో ఈ అమ్మకాలు 10,687 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో బాలెనొ, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ మరియు వ్యాగన్ ఆర్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 48 యూనిట్లు తగ్గాయి. అక్టోబర్ 2023లో ఈ సేల్స్ 80,662 యూనిట్లు అని తెలుస్తోంది.
టాటా మోటార్స్ సేల్స్
2024 అక్టోబర్ నెలలో టాటా మోటార్ సేల్స్ 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ధన త్రయోదశి కారణంగా సంస్థ అధిక మొత్తంలో వాహనాలను విక్రయించింది. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో 82,682 వాహనాలను విక్రయించింది. 2023 అక్టోబర్ నెలలో ఈ సేల్స్ 82954 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే మొత్తంగా అమ్మకాల్లో కొంత తగ్గుదల నమోదైంది.
Don’t Miss: ఇల్లు కొంటే.. రూ.4.22 కోట్ల లంబోర్ఘిని కారు ఫ్రీ: ఎక్కడో తెలుసా?
కమర్షియల్ వాహనాల అమ్మకాలు 34259 యూనిట్లు కాగా.. ప్యాసింజర్ వాహనాల సేల్స్ 48,423 యూనిట్లు. ట్రక్కులు, బస్సులు వంటివి గత నెలలో మొత్తం 15,574 యూనిట్ల సేల్స్ నమోదయ్యాయి. ఈ విభాగంలో అక్టోబర్ 2023లో 15574 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023లోనూ మరియు 2024లోనూ కంపెనీ ఒకే విధంగా అమ్మకాలు సాగించింది.