31.2 C
Hyderabad
Saturday, March 22, 2025

మెర్సిడెస్ బెంజ్.. ఓ అమ్మాయి పేరు నుంచి పుట్టిందని తెలుసా? కీలక విషయాలు

Do You Know Mercedes Benz Originated: ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు సుదీర్ఘ చరిత్ర కలిగిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి జర్మన్ బ్రాండ్ ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz). ఈ రోజు యువకుల నుంచి వృద్ధుల వరకు బెంజ్ అంటే ఓ ప్రత్యేకమైన ఆసక్తి. అయితే వీటి ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలు చేయడం అనేది కొంత కష్టతరమే. నేడు మెర్సిడెస్ బెంజ్ గ్లోబల్ మార్కెట్లో తన హవా కొనసాగిస్తోంది. ఇంతకీ ఈ కంపెనీకి ఆ పేరు ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న చరిత్ర తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు.

‘మెర్సిడెస్’ పేరు ఎలా వచ్చిందంటే?

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. అమెరికన్ లాయర్ మరియు వ్యాపారవేత్త డేవిడ్ రూబెన్‌స్టెయిన్‌తో, మెర్సిడెస్ బెంజ్ సీఈఓ ‘స్టెన్ ఓలా కల్లేనియస్’ (Sten Ola Kallenius) మాట్లాడుడుతూ.. మెర్సిడెస్ బెంజ్ పేరు ఎలా వచ్చిందో వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

1886వ సంవత్సరంలో ‘గ్లాటిబ్ డైమ్లర్’ స్థాపించిన సమయంలో కంపెనీకి మొదటి డైమ్లర్ అని పేరుపెట్టినట్లు కల్లేనియస్ పేర్కొన్నారు. అప్పట్లో డైమ్లర్ కంపెనీ చీప్ ఇంజినీర్ విల్హెల్మ్ మేబ్యాచ్‌. నిజానికి రేసింగ్ ప్రయోజనాల కోసం ఇంజిన్ రూపొందించడానికి ఆస్ట్రియన్ పారిశ్రామికవేత్త ఎమిల్ జెల్లినెక్.. డైమ్లర్ మరియు మేబ్యాచ్‌లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రేసులో విజేత కావాలనే ఉద్దేశ్యంతో ఎమిక్ వీరిని ఎంచుకున్నారు.

డైమ్లర్ మరియు మేబ్యాచ్ ఇద్దరూ రేసింగ్‌లో పాల్గొనే జెల్లినెక్ కోసం శక్తివంతమైన ఇంజిన్‌తో కూడిన కారును అందించారు. అనుకున్నట్లుగానే జెల్లినెక్ ఫ్రాన్స్‌లోని నైస్‌లో జరిగిన రేస్‌‌లో జెల్లినెక్ విజేతగా నిలిచారు. ఆ తరువాత ఆ కారుకు తన కుమార్తె ‘మెర్సిడెస్’ (Mercedes) పేరు పెట్టాలని షరతు పెట్టారు. ఆ తరువాత అదే కంపెనీ పేరుగా స్థిరపడింది.

బ్రాండ్ పేరుగా మెర్సిడెస్

మెర్సిడెస్ బెంజ్ వెబ్‌సైట్ ప్రకారం.. 1902 జూన్ 23న మెర్సిడెస్ అనేది బ్రాండ్ నమోదు చేశారు. సెప్టెంబర్ 26న అదే చట్టబద్ధమైంది. ఆ తరువాత జూన్ 1903లో ఎమిల్ జెల్లినెక్ తన పేరును సైతం ‘జెల్లినెక్ మెర్సిడెస్’గా పిలవడానికి అనుమతి పొందారు. బహుశా ఒక తండ్రి కుమార్తె పేరు పెట్టుకోవడం అదే మొదటిసారి. ఇదే వారి వ్యాపారాన్ని విజయవంతం చేసిందని అప్పట్ల చెప్పుకున్నారు.

1907లో జెల్లినెక్ ఆస్ట్రో-హంగేరియన్ కాన్సుల్ జనరల్‌గా నియమించబడ్డారు. కొంత కాలం తరువాత మెక్సికన్ కాన్సుల్ జనరల్‌ అయ్యారు. 1909లో జెల్లీనిక్ ఆటోమోటివ్ వ్యాపారం నుంచి బయటకు వచ్చేసారు. ఆ తరువాత మొనాకోలోని ఆస్ట్రో-హంగేరియన్ కాన్సులేట్ అధిపతిగా విధులు నిర్వహించడం ప్రారంభించారు. ఆ తరువాత 1918 జనవరి 21న ఆయన మరణించే వరకు జెల్లినెక్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్‌లో కీలక పాత్ర పోషించారు.

మెర్సిడెస్ బెంజ్ లోగో చరిత్ర

ప్రపంచంలో ఎన్ని బ్రాండ్స్ ఉన్నా.. మెర్సిడెస్ బెంజ్ అనేది ఐకానిక్ అనే చెప్పాలి. ఎందుకంటే వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బ్రాండ్ లోగో కూడా చాలా ప్రత్యేకం. బెంజ్ కారు ఎక్కడ కనిపించినా దాని లోగో మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 3 పాయింట్ స్టార్ లోగో ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన లోగోలలో ఒకటి. ఇందులో కనిపించే మూడు రేఖలు లేదా గీతలు భూమి, ఆకాశం మరియు నీటికి సంకేతమని తెలుస్తోంది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ మొదటి కారు

ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన మెర్సిడెస్ బెంజ్ 1994లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. దేశీయ విఫణిలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి లగ్జరీ ఆటోమోటివ్ బ్రాండ్ మెర్సిడెజ్ బెంజ్ కావడం గమనార్హం. అప్పట్లో ఈ కంపెనీ ‘డబ్ల్యు124 ఈ-క్లాస్’ (W124 E-Class) సెడాన్ ప్రవేశపెట్టింది. ఇదే బెంజ్ కంపెనీ మనదేశంలో లాంచ్ చేసిన మొదటి కారు. 2018లో కంపెనీ ఈ కారు యొక్క 100000వ కారును మహారాష్ట్రలోని చకాన్‌లోని తన ఉత్పత్తి కర్మాగారం నుంచి విడుదల చేసింది.

Don’t Miss: దశాబ్దాల చరిత్రకు పూర్వవైభవం!.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 వచ్చేస్తోంది – ధర ఎంతంటే?

ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ అనేక లగ్జరీ కార్లను (ఫ్యూయెల్ మరియు ఎలక్ట్రిక్) దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది.. చేస్తూనే ఉంది. కంపెనీ తన ఉనికిని నిరంతరం విస్తరించుకుంటూ ప్రజలకు చేరువవుతోంది. ఇటీవలే సంస్థ సీఎల్ఈ 300 క్యాబ్రియోలైట్ (రూ. 1.1 కోట్లు), ఏఎంజీ జీఎల్‌సీ 43 4మ్యాటిక్ కూపే (రూ. 1.11 కోట్లు) లాంచ్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్లను కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు