26.2 C
Hyderabad
Friday, January 17, 2025

నటుడు ‘దర్శన్’ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?.. ధరలు తెలిస్తే షాకవుతారు!

Famous Actor Darshan Car Collection: ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన శాండల్‌వుడ్ నటుడు ‘దర్శన్’ (Darshan) గురించి కేవలం కన్నడ ప్రజలకు మాత్రమే కాకుండా.. తెలుగు వారికి కూడా సుపరిచయమే. ఎందుకంటే తెలుగులో కూడా ఆప్తమిత్రులు, కురుక్షేత్రం మరియు ఏదైనా చేస్తా అనే సినిమాల్లో కూడా నటించారు.

ఇటీవల రేణుకాస్వామి హత్యకేసులో ‘దర్శన్’ అరెస్ట్ అయ్యారు. ఈయనతోపాటు పవిత్ర గౌడ, మరో 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే కన్నడ చిత్ర సీమలో ఎంతో ప్రజాదరణ పొందిన ‘దర్శన్’కు కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. ఈ కథనంలో నటుడు దర్శన్ గ్యారేజిలోని కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నటుడు దర్శన్ గ్యారేజిలోని కార్ల జాబితాలో.. ల్యాండ్ రోవర్ డిఫెండర్, లంబోర్ఘిని ఉరుస్, లంబోర్గిన్ అవెంటడార్ ఎస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, టయోటా వెల్‍ఫైర్, జాగ్వార్ XK, ఫోర్డ్ మస్టాంగ్, పోర్స్చే కయెన్, రేంజ్ రోవర్ వోగ్, మినీ కూపర్ కంట్రీమ్యాన్, టయోటా ఫార్చ్యూనర్, జీప్ రాంగ్లర్, బీఎండబ్ల్యూ 520డీ మరియు ఆడి క్యూ7 వంటివి ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్

భారతదేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్లలో ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ‘డిఫెండర్’ ఒకటి. ఈ కారు ధర రూ. 1.2 కోట్లు. ఈ కారు అద్భుతమైన డిజైన్, కలిగి అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ కారును కొనుగోలు చేస్తారు. ఈ కారు నటుడు దర్శన్ గ్యారేజిలో ఉంది.

లంబోర్ఘిని ఉరుస్

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని యొక్క ఉరుస్ కూడా దర్శన్ కలిగి ఉన్నట్లు సమాచారం. దీని ధర రూ. 3 కోట్లు. దర్శన్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీల కూడా ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేశారు. లంబోర్ఘిని ఉరుస్ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో జూనియర్ ఎన్ఠీఆర్, రజినీకాంత్, కార్తీక్ ఆర్యన్, రోహిత్ శెట్టి మాత్రమే కాకుండా.. ముఖేష్ అంబానీ కూడా కలిగి ఉన్నారు.

లంబోర్గిన్ అవెంటడార్ ఎస్

నటుడు దర్శన్ గ్యారేజిలోని మరో లంబోర్ఘిని కారు అవెంటడార్ ఎస్. దీని ధర రూ. 6.5 కోట్లు. ఈ సూపర్ కారులో 6498 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 8400 rpm వద్ద 730 Bhp పవర్ మరియు 5500 rpm వద్ద 690 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 349 కిమీ వరకు ఉంటుందని సమాచారం.

టయోటా ల్యాండ్ క్రూయిజర్

ఎక్కువ మంది రాజకీయ నాయకులు మరియు పారిశ్రామికవేత్తలు ఇష్టపడే టయోటా ల్యాండ్ క్రూయిజర్ కూడా దర్శన్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా కఠినమైన భూభాగంలో ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి మొదలైన వారు ఉన్నారు.

టయోటా వెల్‍ఫైర్

కోటి రూపాయలకంటే ఎక్కువ ఖరీదైన ఈ కారును ఎక్కువగా రాజకీయ ప్రముఖులు కొనుగోలు చేస్తారు. కానీ నటుడు దర్శన్ కూడా తన గ్యారేజిలో ఈ కారును కలిగి ఉన్నారు. టయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో అందిస్తున్న లగ్జరీ కార్లలో ల్యాండ్ క్రూయిజర్ తరువాత వెల్‍ఫైర్ ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఈ కారును కలిగి ఉన్న సెలబిటీల జాబితాలో అనిల్ కపూర్, అజయ్ దేవగన్ మొదలైన వారు ఉన్నారు.

జాగ్వార్ XK

దర్శన్ గ్యారేజిలో ఉన్న కార్లలో చెప్పుకోదగ్గ మరో మోడల్ జాగ్వార్ XK. సుమారు రూ. 88 లక్షల ఖరీదైన ఈ కారు చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువమంది సెలబ్రిటీలకు, ఇతర ప్రముఖులకు ఇష్టమైన కారు. ఈ కారును దర్శన్ పుట్టిన రోజు సందర్భంగా తల్లి నుంచి గిఫ్ట్‌గా పొందినట్లు తెలుస్తోంది. బహుశా ఈ కారు ఇప్పుడు ఉత్పత్తి దశలో లేదని తెలుస్తోంది.

Don’t Miss: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’ వాహన ప్రపంచం చూశారా!.. ఓ లుక్కేసుకోండి

పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా రూ. 75 లక్షల ఖరీదైన ఫోర్డ్ మస్టాంగ్, రూ. 1.5 కోట్ల విలువైన పోర్స్చే కయెన్, రూ. 2.75 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్, రూ. 38 లక్షల విలువైన మినీ కంట్రీమ్యాన్, రూ. 38 లక్షల టయోటా ఫార్చ్యూనర్, రూ. 53 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన జీప్ రాంగ్లర్, రూ. 31 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 520డీ మరియు రూ. 85.52 లక్షల ఆడి క్యూ7 వంటివి దర్శన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles