Famous Actor Prakash Raj Buys New Caravan: ఏ పాత్రలో అయినా.. ఏ భాషలో అయినా.. ఇట్టే ఇమిడిపోయే నటుడు ప్రకాష్ రాజ్. ఈ విషయం దాదాపు అందరికి తెలిసిందే. తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొదలైన భాషా చిత్రాల్లో నటింటి అనేక ఉత్తమ అవార్డులు పొందిన ఈయన ఆటో మొబైల్ ఔత్సాహికులలో ఒకరు. ఈ కారణంగానే.. ఎప్పటికప్పుడు తనకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాగా తాజాగా క్యాంపర్ వ్యాన్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నటుడు ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన క్యాంపర్ వ్యాన్.. ఫోర్స్ అర్బెనియా అని తెలుస్తోంది. కుటుంబంతో కలిసి క్యాంపింగ్‌కు వెళ్ళడానికి దీనిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాన్‌ను ప్రకాష్ రాజ్ తన కోసం ప్రత్యేకంగా రూపొందించామని తయారీదారు వెల్లడించారు. అంతే కాకుండా.. దీనిని ఢిల్లీలో రూపొందించి, సుమారు 2200 కిమీ దూరంలో.. మైసూర్‌లో ఉన్న ప్రకాష్ రాజ్‌కు డెలివరీ చేశారు.
ప్రకాష్ రాజ్ క్యాంపర్ వ్యాన్
నటుడు ప్రకాష్ రాజ్‌కు క్యాంపర్ వ్యాన్ అప్పగించడానికి ముందే.. ఈ వెహికల్ సర్వీస్ గురించి కూడా డెలివరీ చేసిన వ్యక్తులు వెల్లడించారు. అంతే కాకుండా దీని డిజైన్ వంటి వాటి గురించి కూడా పేర్కొన్నారు. లైటింగ్ సెటప్, లోపల సోఫాలు, ఏసీ సెటప్, వెనుక భాగంలో చిన్న కిచెన్, లోపల వైపున చిన్న టాయిలెట్ వంటివన్నీ చాలా అనుకూలంగా.. అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
కారవ్యాన్‌ను డెలివరీ చేసుకున్న తరువాత.. నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, తాను ఊహించిన విధంగానే వ్యాన్‌ను అభివృద్ధి చేశారని తయారీదారులు మెచ్చుకున్నారు. అంతే కాకుండా తన చాలా ఆనందగా ఉందని పేర్కొన్నారు.
ప్రకాష్ రాజ్ కార్ కలెక్షన్
నటుడు ప్రకాష్ రాజ్ కారవ్యాన్ డెలివరీ చేసుకోవడానికి ముందే.. మహీంద్రా థార్ మరియు ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి వాటిని కలిగి ఉన్నట్లు సమాచారం.
మహీంద్రా థార్
సినీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ప్రకాష్ రాజ్ గ్యారేజిలో మహీంద్రా థార్ ఉంది. దీనిని ఈయన 2021లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కారు న్యాపోలీ బ్లాక్ కలర్‌లో చూడచక్కగా ఉంది. ఇది ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందిన టాప్ ఎండ్ మోడల్ ఎల్ఎక్స్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 16.28 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది వాహన ప్రియులను ఆకర్శించిన ఆఫ్-రోడర్లలో ఒకటి.. మహీంద్రా థార్. ఇది ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, ఐసోఫిక్స్ సీట్లు మొదలైనవి పొందుతుంది. ఇది 2.0 లీటర్ ఎంస్టాలిన్ 150 టీజీజీఐ మరియు 2.2 లీటర్ ఎంహాక్ 130 ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.
ల్యాండ్ రోవర్ డిఫెండర్
ప్రకాష్ రాజ్ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో ఈయన డిఫెండర్ కారులో ప్రయాణిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన చాలా వివరాలు అందుబాటులో లేదు. ఎందుకంటే.. ఈ కారులో ప్రకాష్ రాజ్ కనిపించిన సన్నివేశాలు చాలా తక్కువే అనే చెప్పాలి.
ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలు
భారతదేశంలో చాలామంది సెలబ్రిటీలు ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, మలైకా అరోరా, రణబీర్ కపూర్, అలియా భట్, ఆయుష్ శర్మ, అనుష్క శర్మ, పృద్విరాజ్, కరీనా కపూర్, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, సన్నీ డియోల్, సునీల్ శెట్టి మరియు విరాట్ కోహ్లీ మొదలైనవారు ఉన్నారు. వీరందరూ.. కూడా ఈ కార్లను రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
Also Read: హిందూపూర్ ఎంఎల్ఏ ‘బాలయ్య’ వాడే రూ.4 కోట్ల కారు గురించి తెలుసా!
ల్యాండ్ రోవర్ కార్లను ఇష్టపడి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. వాటి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాదు. వీటి బెస్ట్ పర్ఫామెన్స్ కూడా. ఈ కార్లు రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ డ్రైవ్ వంటి వాటికి కూడా ఈ మోడల్ కార్లు అద్భుతంగా ఉంటాయి.