23.2 C
Hyderabad
Tuesday, January 21, 2025

ఆదిపురుష్ సీత (కృతి సనన్) వద్ద ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా! ఫోటోలు చూశారా?

Famous Actress Kriti Sanon Luxury Car Collection: అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చిత్ర సీమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి ‘కృతి సనన్’ (Kriti Sanan). నేనొక్కడినే సినిమాతో మహేష్ బాబు సరసన నటించి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈమె 1990 జులై 27న జన్మించారు. ఆదిపురుష్ సినిమాలో సీతగా ప్రేక్షకులను మెప్పించిన కృతి సనన్ పుట్టిన రోజు నేడే. ఈ సందర్భంగా కృతి సనన్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందో? ఇక్కడ చూసేద్దాం..

సినిమాల్లో నటించడం అభిరుచిగా కలిగిన కృతి సనన్.. విలాసవంతమైన అన్యదేశ్య కార్లను ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగానే ఈమె గ్యారేజిలో ఆడి కంపెనీకి చెందిన క్యూ7, బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 3 సిరీస్ 320డీ మరియు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకిన్ చెందిన మేబ్యాచ్ జీఎల్ఎస్600 కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం.

ఆడి క్యూ7 (Audi Q7)

సినీ పరిశ్రమలో ఎక్కువమంది తారలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న ఆడి కార్లలో క్యూ7 కూడా ఒకటి. జర్మన్ బ్రాండ్ అయిన ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించే ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ ఆడి క్యూ7 కారు నటి కృతి సనన్ గ్యారేజిలో కూడా ఉంది.

విలాసవంతమైన ఫీచర్స్ కలిగిఆన్ ఈ కారులో.. ముంబై వీధుల్లో కృతి సనన్ పలు మార్లు కనిపించినట్లు చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రూ. 88.66 లక్షల నుంచి రూ. 97.84 లక్షల (ఎక్స్ షోరూమ్) ఖరీదైన ఈ కారు 2996 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5200 – 6400 rpm వద్ద 335.25 Bhp పవర్ మరియు 1370 – 4500 rpm వద్ద 500 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ.

బీఎండబ్ల్యూ 3 సిరీస్ 320డీ (BMW 3 Series 320D)

కృతి సనన్ ఉపయోగించే కార్లలో మరొకటి బిఎండబాలయు కంపెనీకి చెందిన 3 సిరీస్ 320డీ. రూ. 48 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు సూపర్ డిజైన్, డైనమిక్ పర్ఫామెన్స్ అందిస్తుంది. అద్భుతమైన కంఫర్ట్ అందించే ఈ కారు లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు సిరీ మరియు హైవే డ్రైవింగ్ వంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ 3 సిరీస్ 320డీ కారు 1995 సీసీ 4 సిలిండర్ ఇన్‌లైన్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 rpm వద్ద 188 Bhp పవర్ మరియు 1750 rpm వద్ద 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 235 కిమీ/గం. ఈ కారు కృతి సనన్ ఫేవరేట్ కారు అని తెలుస్తోంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 (Mercedes Maybach GLS600)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ యొక్క మేబ్యాచ్ జీఎల్ఎస్600 కూడా కృతి సనన్ గ్యారేజిలో ఉంది. ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). కృతి సనన్ గ్యారేజిలో ఇదే అత్యంత ఖరీదైన కారు అని తెలుస్తోంది. విలాసవంతమైన డిజైన్, విలాసవంతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారులో కూడా కృతి సనన్ పలుమార్లు కనిపించింది.

Don’t Miss: భారత్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!.. అనంత్ అంబానీకి అరుదైన కారు గిఫ్ట్

మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 కారు 3982 సీసీ 8 సిలిండర్ 4 వాల్వ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6000 rpm వద్ద 550 Bhp పవర్, 2500 rpm వద్ద 770 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. విలాసవంతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

కృతి సనన్ సినీ ప్రపంచం

నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై.. అక్కినేని నాగచైతన్య సరసన దోచేయ్ సినిమాలో కూడా నటించింది. ఆ తరువాత ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ఈమె 2021 రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ చలన చిత్ర అవార్డు దక్కించుకుంది. అంతే కాకుండా అనేక ఇతర ప్రతిష్టాత్మక అవార్డులను సైతం ఈమె దక్కించుకుంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles