స్వీడన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు కొన్న ప్రముఖ నటి – ఎవరో తెలుసా?

Mandira Bedi Buys Volvo C40 Recharge EV: భారతదేశంలో ప్రముఖులు లేదా సెలబ్రిటీలు తమకు నచ్చిన బైకులను లేదా నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికి తెలియసిందే. ఇందులో భాగంగానే ప్రముఖ నటి ‘మందిరా బేడీ’ (Mandira Bedi) ఓ సరికొత్త స్వీడన్ బ్రాండ్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

మందిరా బేడీ గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ ఈమె ప్రభాస్ నటించిన సాహో సినిమాలో నటించిందన్న విషయం బహుశా కొంతమందికే తెలిసి ఉంటుంది. ఈమె ఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్ మరియు నటి. మందిరా బేసి 1999లో దూరదర్శన్‌లో ప్రసారమైన శాంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత హిందీ సినిమాల్లోకి అరంగేట్రం చేసింది.

వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge)

నటి మందిరా బేడీ కొనుగోలు చేసిన కారు వోల్వో కంపెనీకి చెందిన సీ40 రీఛార్జ్. ఫ్జోర్డ్ బ్లూ కలర్ ఆప్షన్ పొందిన ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్. దీని ధర రూ. 62.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడగానే లగ్జరీ అనుభూతిని అందించే ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వోల్వో సీ40 రీఛార్జ్ చూడటానికి దాని ఎక్స్‌సీ40 రీఛార్జ్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్ మరియు క్లోజ్డ్ ఆప్ గ్రిల్ వంటివి దీన్ని ఎక్స్‌సీ40 రీఛార్జ్ నుంచి భిన్నంగా కనిపించేలా చేస్తాయి. ఈ కారును పరిశీలనగా గమనిస్తే బీ పిల్లర్ నుంచి రూఫ్‌లైన్ తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వెనుక భాగంలో రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్ మరియు టైల్‌లైట్‌లు సన్నగా ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా కొత్త రివర్స్ లైట్‌లతో ర్యాపరౌండ్ ఎఫెక్ట్‌ను కలిగి ఉంటాయి.

వోల్వో సీ40 రీఛార్జ్ ఫీచర్స్

ఫీచర్స్ విషయానికి వస్తే.. వోల్వో సీ40 రీఛార్జ్ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ కారు హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వేగన్ ఇంటీరియర్స్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు 360 డిగ్రీ కెమెరా, అటానమస్ డ్రైవింగ్‌తో కూడిన ఏడిఏఎస్ టెక్నాలజీ, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు హర్మాన్ కర్తాన్ సౌండ్ సిస్టం కూడా పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు బూట్ స్పీన్స్ 413 లీటర్లు వరకు ఉంటుంది. బూట్ స్పేస్ ఎక్స్‌సీ40 రీఛార్జ్ కంటే కొంత తక్కువగానే ఉంటుంది.

బ్యాటరీ మరియు రేంజ్

వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు 402 Bhp పవర్ మరియు 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేయడానికి అనుకూలంగా ఉండే రెండు ఎలక్ట్రిక్ మోటార్లను పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కూపే 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 180 కిమీ కావడం గమనార్హం. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సరఫరా చేయబడుతుంది.

Don’t Miss: లగ్జరీ కారు కొన్న జబర్దస్త్‌ బ్యూటీ.. కారు రేటు ఎంతంటే?

ఈ ఎలక్ట్రిక్ కారు 78 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో ఏకంగా 530 కిమీ రేంజ్ అందిస్తుంది. బ్యాటరీ 11 kw ఏసీ ఛార్జర్ ద్వారా 8 గంటల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయంలో కేవలం 27 నిమిషాలు మాత్రమే. మొత్తం మీద ఇది వాహన వినియోగదారులకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది.

భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఐఎక్స్1, కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5 మరియు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. మార్కెట్లో వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు గట్టి పోటీని ఎదుర్కొంటూ మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది.