‘సారా అలీ ఖాన్’ మనసు దోచిన చిన్న కారు ఇదే! ధర తెలిస్తే మీరూ కొనేస్తారు..

Famous Actress Sara Ali Khan Car Collection: సాధారణ ప్రజల మాదిరిగానే.. సెలబ్రిటీలకు కూడా కార్లు మరియు బైకులంటే ఇష్టమని అందరికీ తెలుసు. ఇందులో మగవాళ్లు మాత్రమే కాకుండా మహిళలు ఉన్నారు. ఈ కోవకు చెందిన వారిలో సినీ నటి ‘సైఫ్ అలీ ఖాన్’ కుమార్తె ”సారా అలీ ఖాన్” (Sara Ali Khan) ఒకరు. హిందీ సినిమాల్లో నటించి లెక్కకు మించిన అభిమానులను కలిగి ఉన్న సారా.. తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ, పేరు మాత్రం సుపరిచయమే. 1995 ఆగష్టు 12న జన్మించిన సారా అలీ ఖాన్ గ్యారేజిలో మారుతి ఆల్టో, మెర్సిడెస్ బెంజ్, హోండా సీఆర్-వీ మరియు జీప్ కంపాస్ వంటి కార్లు ఉన్నాయి.

సారా అలీ ఖాన్ కార్లు
మారుతి ఆల్టో (Maruti Alto)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే మారుతి సుజుకి కంపెనీ యొక్క ‘ఆల్టో’ సారా అలీ ఖాన్ గ్యారేజిలో ఉంది. ఈ కారులో సారా చాలా సార్లు కనిపించింది. అయితే ప్రస్తుతం ఈ కారు ఆల్టో కే10 పేరుతో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 3.25 లక్షలు (ఎక్స్ షోరూమ్).

సారా అలీ ఖాన్ వద్ద ఉన్న కారు పాత తరం మారుతి ఆల్టో. దీనిని ఈమె డిసెంబర్ 2021లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్ కారు యొక్క ఉత్పత్తిని కంపెనీ పూర్తిగా నిలిపివేసి.. ఆల్టో కే10 పేరుతో విక్రయిస్తోంది. సారా రోజువారీ వినియోగానికి ఎక్కువగా ఈ కారునే వినియోగిస్తుందని సమాచారం. ఈ కారు సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇది రోజువారీ వినియోగానికి అత్యుత్తమ మోడల్. సారాకు ఇష్టమైన కారు కూడా.

మెర్సిడెస్ బెంజ్ జీ350 (Mercedes Benz G350)

సారా గ్యారేజిలో సరసమైన లేదా తక్కువ ధర కలిగిన మారుతి ఆల్టో మాత్రమే కాకుండా కోట్ల రూపాయల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ జీ350 కూడా ఉంది. దీనినే జీ వ్యాగన్ అని పిలుస్తారు. దేశీయ విఫణిలో ఈ కారు ప్రారంభ ధర రూ. 1.72 కోట్లు (ఎక్స్ షోరూమ్).

మెర్సిడెస్ బెంజ్ జీ350 కారులో సారా అరుదుగా కనిపిస్తుంది. కేవలం 8 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ కారు 4.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని 2925 సీసీ డీజిల్ ఇంజిన్ 3400 rpm వద్ద 282 Bhp పవర్ మరియు 1200 rpm వద్ద 600 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఈ కారు అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

హోండా సీఆర్-వీ (Honda CR-V)

మారుతి సుజకి ఆల్టో, బెంజ్ కారు మాత్రమే కాకుండా హోండా కంపెనీకి చెందిన సీఆర్-వీ కూడా సారా అలీ ఖాన్ ఉంది. ప్రస్తుతం కంపెనీ ఈ కారు యొక్క ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ఒకప్పుడు మార్కెట్లో ఈ కారు ధర రూ. 28 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

హోండా సీఆర్-వీ 1597 సీసీ పెట్రోల్ మరియు 1997 సీసీ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 118 బీహెచ్పీ పవర్ & 189 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 152 బీహెచ్పీ పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు ఉత్తమ పనితీరును అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ అమ్మకాల్లో ఈ కారు ఆశించినం విజయం పొందలేకపోయింది. కాబట్టి ఈ కారు యొక్క ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది.

Don’t Miss: భారత్‌లో అందుబాటులో ఉన్న రాయల్ బండ్లు ఇవే.. ఒక్కొక్కటి ఒక్కో స్టైల్

జీప్ కంపాస్ (Jeep Compass)

అమెరికన్ కార్ల తయారీ సంస్థ యొక్క జీప్ కంపెనీకి చెందిన కంపాస్ కారు కూడా సారా అలీ ఖాన్ గ్యారేజిలో ఉంది. ఈ కారును ఈమె తన తల్లిపేరు మీద రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఈ కారు ధర రూ. 18.99 లక్షల నుంచి రూ. 32.41 లక్షల మధ్యలో ఉంది. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్లలో జీప్ కంపాస్ కూడా ఒకటి. ఇది 1956 సీసీ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు అత్యాధునిక డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.