ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

Fantasy Cricket Expert Anurag Dwivedi Vehicles: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. చిన్నా.. పెద్ద తేడా లేకుండా అందరు ఇష్టపడే ఆటల్లో ఒకటైన క్రికెట్ ఆట గురించి.. క్రికెట్ ఆటగాళ్ల గురించి కూడా ప్రత్యేకంగా పరిచయమే అవసరమే లేదు. కానీ వీరు ఎలాంటి కారును ఉపయోగిస్తారు, వాటి వివరాలు ఏంటి అనేది మాత్రం చాలామంది తెలుసుకోవాలని తెగ కుతూహల పడిపోతుంటారు.

ఈ కథనంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఫాంటసీ క్రికెట్ ఎక్స్‌పర్ట్ ‘అనురాగ్ ద్వివేది’ (Anurag Dwivedi) ఎలాంటి కార్లను కలిగి ఉన్నాడు, సైకిల్ ఉపయోగించే స్థాయి నుంచి ఎలాంటి ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నారనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

సైకిల్ (Cycle)

నిజానికి అనురాగ్ ద్వివేది ఇన్‌స్టాగ్రామ్ చూస్తే.. అట్లాస్ సైకిల్ మీద ఉన్న ఒక ఫోటో కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అతని ప్రయాణం ఎక్కడ నుంచి మొదలైందో ఇట్టే తెలిసిపోతుంది. మొదట్లో క్రికెట్ ప్లేయర్‌గా అవ్వాలని కలలు కన్నాడు, కానీ ఆ కల.. కలగానే మిగిలిపోయింది. అయితే ఆ అభిరుచిని అలాగే కొనసాగిస్తూ ఆన్‌లైన్‌లో ఫాంటసీ క్రికెట్ ఎక్స్‌పర్ట్ అయ్యాడు. ప్రారంభంలో అతడు ఒక అట్లాస్ సైకిల్ వినియోగించేవాడని తెలుస్తోంది.

మారుతి డిజైర్ (Maruti Dzire)

అనురాగ్ ద్వివేది మొదటి కారు మారుతి కంపెనీకి చెందిన ఈ ‘డిజైర్’ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపు రంగులో చూడచక్కగా ఉన్న మారుతి డిజైర్ ముందు ద్వివేది ఉన్న ఫోటోలు కూడా చూడవచ్చు. మంచి డిజైన్ కలిగిన ఈ కారు ఉత్తమ పనితీరుని అందిస్తూ.. అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది.

బీఎండబ్ల్యూ  7 సిరీస్ (BMW 7 Series)

జర్మన్ బ్రాండ్ అయిన BMW యొక్క 7 సిరీస్ కూడా అనురాగ్ ద్వివేది గ్యారేజిలో ఉంది. ఇది ఐదవ తరం లగ్జరీ సెడాన్ కారుగా కనిపిస్తోంది. భారతీయ సెలబ్రిటీలు ఎక్కువ ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ఒకటి కావడం గమనార్హం. అనురాగ్ బీఎండబ్ల్యూ డీజిల్ వెర్షన్ అని తెలుస్తోంది.

ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour)

అమెరికన్ కార్ల తయారీ సంస్థ అయిన ఫోర్డ్ యొక్క ఎండీవర్ కూడా ద్వివేది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ ప్రస్తుతం దేశీయ విఫణిలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయినప్పటికీ కొందరు బ్రాండ్ కార్లను వినియోగిస్తూనే ఉన్నారు.

ఇక్కడ కనిపించే ఫోర్డ్ ఎండీవర్ 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్‌తో కూడిన BS6 వెర్షన్‌ అని తెలుస్తోంది. దీనిని ద్వివేది 2021లో కొనుగోలు చేసినట్లు సమాచారం. నలుపు రంగులో కనిపిస్తున్న ఈ కారు మంచి డిజైన్ మరియు అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ (Mercedes-Benz E-Class)

అనురాగ్ ద్వివేది గ్యారేజిలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంజ్ కంపెనీకి చెందిన ఈ-క్లాస్ కూడా ఉంది. నలుపు రంగులో ఉన్న ఈ కారుని యితడు తన ఫ్యామిలి కలిసి డెలివరీ తీసుకున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ కారు 3.0 లీటర్ ఇన్‌లైన్ 6 ఇంజిన్ కలిగి 286 పీఎస్ పవర్ పవర్ 600 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా థార్ (Mahindra Thar)

దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క థార్ SUV ని కూడా ద్వివేది కలిగి ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఆఫ్ రోడర్ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ద్వివేది కొనుగోలు చేసిన థార్ నలుపు రంగులోనే ఉంది.

బీఎండబ్ల్యూ జెడ్4 (BMW Z4)

మరో జర్మన్ లగ్జరీ కారు అయిన ‘బీఎండబ్ల్యూ జెడ్4’ స్పోర్ట్స్ కారును కూడా అనురాగ్ ద్వివేది కలిగి ఉన్నాడు. ఎరుపు రంగులో ఉన్న కారుని కొనుగోలు చేయడానికి ఢిల్లీలో ఈ కారుని డెలివరీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్పోర్ట్ కారు 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్‌ కలిగి 335 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Don’t Miss: బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు రావో తెలుసా? ఆసక్తికర విషయాలు!

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 (Land Rover Defender 130)

తెలుపు రంగులో చూడచక్కగా ఉన్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కూడా అనురాగ్ గ్యారేజిలో ఉంది. ఈ కారుని ఈ ఏడాది జూన్ నెలలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 1.41 కోట్ల ఎక్స్ షోరూమ్ ధర కలిగిం ఈ కారు 5 డోర్స్ 8 సీటర్ వెర్షన్. ఇది ఉత్తరప్రదేశ్‌లో డెలివరీ మొదటి కారు కావడం గమనార్హం.