32.2 C
Hyderabad
Wednesday, March 19, 2025

శనివారం నుంచే ఒంటిపూట బడి: సమ్మర్ హాలిడేయ్స్ ఎప్పుడంటే?

Half Day School in 2025: ఎండాకాలం మొదలైపోయింది. ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడి ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

2025 మార్చి 15 (శనివారం) నుంచి.. పాఠశాలలకు ఒంటిపూట బడి (Half Day School) ప్రకటించింది. ఒంటిపూట బడి ప్రారంభమైన తరువాత పాఠశాల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఒంటిపూట బడి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత వేసవి సెలవులు ప్రకటిస్తారు.

ప్రైమరీ, హైస్కూల్, ఎయిడెడ్ మరియు ఇతర ప్రైవేట్ పాఠశాలలకు హాఫ్ డే స్కూల్ ఉంటుంది. అయితే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే పాఠశాలలు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తాయి. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ జేయడంతో.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారికంగా ప్రకటించింది.

ఒంటిపూట బడి ఎందుకు ప్రకటించారు

తీవ్రమైన వేడి నుంచి.. విద్యార్థులను రక్షించాడనికి ప్రభుత్వం ఒంటిపూట బడి ప్రకటించింది. ఇప్పుడే హైదరాబా నగరంలో ఉష్ణోగ్రత 32°C దాటేసింది. ఇది రానున్న రోజుల్లో 35°C దాటేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వేడి తాపాన్ని పిల్లలు భరించడం కొంత కష్టమే. దీనిని దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వేసవి సెలవులు ఎప్పుడంటే?

ఒంటిపూట బడి విషయం పక్కన పెడితే.. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు (Summer Holidays) ప్రకటించే అవకాశం ఉంది. ఈ సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి. అంటే మళ్ళీ స్కూల్ జూన్ 12న తెరుచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేసవి సెలవులు ఏప్రిల్ 23 నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Also Read: వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం: జగన్ భావోద్వేగ పోస్ట్ వైరల్

ప్రస్తుతం ఏపీ, తెలంగాణాలో కూడా ఇంటర్ పరీక్షలు కూడా ఈ నెల చివరి నాటికి ముంగియనున్నాయి. అయితే వీరికి వేసవి సెలవులు కొంత తక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో లేదా ఇతర కోర్సుల కోసం కాలేజీల్లో చేరటానికి ముందుగానే సిద్ధమవుతారు.

పరీక్షల ఫలితాలు

తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు (10th Results) ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా ఇంటర్ ఫలితాలు (Inter Results) అదే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు ఇంటర్ ఫలితాలు.. విడుదలవుతాయనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు