మీ దగ్గర రూ.21000 ఉంటే Thar Roxx బుక్ చేసుకోవచ్చు: డెలివరీలు ఎప్పుడంటే..

How To Booking Mahindra Thar Roxx And Price Delivery Details: 2024 ఆగష్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ యొక్క థార్ 5 డోర్ లేదా థార్ రోక్స్ (Mahindra Thar Roxx) బుకింగ్స్ ఎట్టకేలకు మొదలయ్యాయి. కంపెనీ ఈ బుకింగ్స్ గురించి అధికారిక ప్రకటన వెల్లడించింది. బుకింగ్స్ ధర ఎంత? ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ఎక్కడ బుక్ చేసుకోవాలి? డెలివరీలు ఎప్పుడనే మరిన్ని విషయాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం.. రండి.

బుకింగ్ ధర

మహీంద్రా థార్ రోక్స్ కోసం రూ. 21000 చెల్లించి అక్టోబర్ 3 ఉదయం 11 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్-రోడర్ బుక్ చేసుకోవాలనుకునే వారు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లేదా కంపెనీ అధీకృత డీలర్‌షిప్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు దసరా తరువాత లేదా దీపావళి ముందు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే కంపెనీ డీలర్లు థార్ రోక్స్ యొక్క అన్ని వేరియంట్స్ మరియు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించారు. ముందుగా బుక్ చేసుకున్నవారికి డెలివరీలు కూడా ముందుగానే ప్రారంభమవుతాయి.

వేరియంట్స్

మహీంద్రా థార్ రోక్స్ కారు ఎంఎక్స్1, ఎంఎక్స్3, ఎంఎక్స్5, ఏఎక్స్3ఎల్, ఏఎక్స్5ఎల్ మరియు ఏఎక్స్7ఎల్ అనే వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల మధ్య ఉన్నాయి. కాగా థార్ రోక్స్ 4×4 వెర్షన్స్ ధరలు రూ. 18.79 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ధరలు ఎందుకుని వేరియంట్ మరియు ఇంజిన్ ఆప్షన్లను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి కస్టమర్లు దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

డిజైన్ మరియు ఫీచర్స్

కొత్త మహీంద్రా థార్ రోక్స్ చూడగానే సాధారణ మోడల్ గుర్తుకు తెస్తుంది. కానీ ఇది పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సీ షేప్ డీఆర్ఎల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ ఫాగ్ లాంప్ వంటివి ఇందులో చూడవచ్చు. రియర్ ప్రీఫైల్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, రియర్ వైపర్ మరియు బ్రాండ్ లోగో వంటివి కూడా ఇక్కడ చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. వేరియంట్‌ను బట్టి కొన్ని ఫీచర్స్ మారుతాయి. కానీ డోర్ ప్యాడ్ మీద మరియు డ్యాష్‌బోర్డ్ మీద సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి. యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు హుందాగా ఉండే డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇంజిన్ వివరాలు

మహీంద్రా థార్ రోక్స్ అనేది 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 152 Hp పవర్, 330 Nm టార్క్ అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 162 Hp పవర్, 330 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. అయితే 4×4 వేరియంట్ అనేది ఆప్షనల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది ఎలాంటి పనితీరును అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

సేఫ్టీ ఫీచర్స్

ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చాలా కార్లు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందాయి. 5 స్టార్ రేటింగ్ అంటే అది అత్యంత సురక్షితమైన కారుగా పరిగణిస్తారు. అయితే మహీంద్రా థార్ ఎలాంటి స్కోరింగ్ పొందుతుందనేది తెలియాల్సి ఉంది. థార్ రోక్స్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరెన్నో సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.

మహీంద్రా థార్ రోక్స్ అనేది.. థార్ 3 డోర్ మోడల్ మాదిరిగానే మంచి మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. ఇప్పటికి కూడా థార్ 3 డోర్స్ కారుకు ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. దీన్ని బట్టి చూస్తే థార్ రోక్స్ కారు కూడా ఎక్కువమందిని ఆకర్షిస్తుందని, గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎలాంటి బుకింగ్స్ పొందుతుందో.. త్వరలోనే తెలిసిపోతుంది.