Hyundai: సంచలన ధర వద్ద లాంచ్ అయిన ‘క్రెటా ఫేస్‌లిఫ్ట్’ – పూర్తి వివరాలు

Hyundai Creta Facelift Launched In India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త ‘హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌’ (Hyundai Creta Facelift) దేశీయ విఫణిలో అధికారికంగా విడుదలైంది. మార్కెట్లో విడుదలైన కొత్త క్రెటా వేరియంట్స్, ధరలు, డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఏడూ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 11 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 20 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఐదు ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలతో లభించే ఈ 2024 మోడల్ మొత్తం 19 వేరియంట్లలో లభిస్తుంది.

డిజైన్ (Hyundai Creta Facelift Design)

కోట్ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ దాదాపు కొత్త డిజైన్ కలిగి ఉన్నట్లు ఇక్కడ గమనించవచ్చు. ముందు భాగంలో పారామెట్రిక్ వివరాలతో కూడిన పెద్ద గ్రిల్ ఉంటుంది. దీని వెడల్పు అంతటా కూడా ఎల్ఈడీ లైట్ ఉండటం చూడవచ్చు. స్ప్లిట్ సెటప్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్, సీక్వెన్షియల్ ఇండికేటర్‌లు ఇక్కడ చూడవచ్చు.

రియర్ ఫ్రొపైల్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఫుల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లలో యాంగ్యులర్ రూపాన్ని పొందుతుంది. వెనుక మొతం ఎల్ఈడీ లైట్ బార్ ఉండటం చూడవచ్చు. అల్లాయ్ వీల్స్ కూడా చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ (Hyundai Creta Facelift Interior Design)

2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొత్త అప్‌డేట్‌తో డ్యాష్‌బోర్డ్‌ పొందుతుంది. కాబట్టి ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను పొందుతుంది. అంతే కాకుండా హ్యుందాయ్ ఆల్కజార్ నుంచి తీసుకున్న 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా గమనించవచ్చు. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం కంట్రోల్స్ దిగువన ఉన్న సెంటర్ కన్సోల్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. బూట్ స్పేస్ 433 లీటర్ల వరకు ఉంటుంది.

ఇంటీరియర్ ఫీచర్స్ (Hyundai Creta Facelift Interior Features)

కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారులో గమనించదగ్గ విషయం ఫీచర్స్.. ఇందులో కంఫర్ట్ అండ్ సౌకర్యవంతమైన ఫీచర్లలో పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆన్‌బోర్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, టూ స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సీట్ బ్యాక్‌రెస్ట్, వెనుక సీటు హెడ్‌రెస్ట్‌ల కోసం దిండ్లు మరియు వెనుక సన్‌షేడ్‌లు ఉన్నాయి.

ఇందులోని 10.25 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లే చాలా స్పష్టంగా ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా అద్భుతంగా ఉంటుంది. బోస్ సౌండ్ సిస్టమ్ ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ADAS ఫీచర్లలలో భాగంగానే ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్టాప్ అండ్ గోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

ఇంజిన్ (Hyundai Creta Facelift Engine)

క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్న ఏకైక ప్రధాన యాంత్రిక మార్పు ఏమిటంటే, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్. ఇది 160 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 115 హార్స్ పవర్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 115 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా ఇవన్నీ కూడా చాలా ఉత్తమంగా ఉంటాయి.

Don’t Miss: BYD Seal EV: భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

ప్రత్యర్థులు (Hyundai Creta Facelift Rivals)

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, టొయోట హైరైడర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.