23.2 C
Hyderabad
Tuesday, January 21, 2025

Hyundai: కనీవినీ ఎరుగని బెనిఫీట్స్ – హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్

Hyundai Discounts On February 2024: 2024 ప్రారంభంలోనే కొన్ని సంస్థలు తమ వాహనాల ధరలను అమాంతం పెంచిన విషయాలను గతంలో తెలుసుకున్నాం. అయితే కొత్త ఏడాది ప్రారంభమై కేవలం ఒక నెల రోజులు పూర్తయిన వెంటనే.. కొన్ని సంస్థలు ధరలను తగ్గించడం మొదలెట్టేశాయి. ఇప్పటికే ఈ జాబితాలో మహీంద్రా, హోండా వంటి కంపెనీలు చేరాయి. తాజాగా హ్యుందాయ్ కంపెనీ ఈ జాబితాలో అడుగుపెట్టింది. హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన కార్ల కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson)

కంపెనీ తన 2023 టక్సన్ మోడల్ మీద ఇప్పుడు 2 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ అఫ్సర్ వంటివి లభిస్తాయి. అయితే 2024 మోడల్ కొనుగోలుపైన కేవలం రూ. 50000 క్యాష్ డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది.

హ్యుందాయ్ టక్సన్ కారు ADAS వంటి ఆధునిక టెక్నాలజీ కలిగి.. రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది 156 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ చేత జతచేయబడి ఉంటుంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ మాత్రం 186 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ.. 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ పొందుతుంది. టక్సన్ ధరలు మార్కెట్లో రూ. 29.02 లక్షల నుంచి రూ. 35.95 లక్షల మధ్య ఉంటాయి.

హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)

దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెర్నా కొనుగోలుపైనా సంస్థ రూ. 55000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రూ. 30000 క్యాష్ డిస్కౌంట్ రూ. 25000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. 2024 మోడల్ వెర్నా కొనుగోలుపైన సంస్థ 35000 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 15000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)

గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపైన హ్యుందాయ్ రూ. 48000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రూ. 35000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10000 ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3000 ప్రయోజనాలు లభిస్తాయి. 2024 మోడల్ కొనుగోలుపైన సంస్థ రూ. 30000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది.

డిజైన్ మరియు అద్భుతమైన ఫీచర్స్ కలిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్ మరియు CNG ఇంజిన్లను కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. మారుతి స్విఫ్ట్ మరియు టాటా టియాగో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు రూ. 5.92 లక్షల నుంచి రూ. 8.23 లక్షల మధ్య ఉంటుంది.

హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar)

అల్కజార్ కొనుగోలుపైన ఫిబ్రవరిలో రూ. 45000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 25000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. 2024 మోడల్ కొనుగోలుపైన రూ. 35000 మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ. 15000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఆరా కొనుగోలుపైన రూ. 33000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.ఇందులో రూ. 20000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ వంటి వాటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.05 లక్షల మధ్య ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

ఎక్కువమంది ప్రజలకు ఇష్టమైన హ్యుందాయ్ కార్లలో ఒకటైన ‘వెన్యూ’ కొనుగోలుపైన కంపెనీ ఇప్పుడు రూ. 30000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 15000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉన్నాయి. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు మల్టిపుల్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 10.12 లక్షల నుంచి రూ. 13.43 లక్షల మధ్య ఉంది.

ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న ఖరీదైన లగ్జరీ బైక్ – కేవలం 350 మందికి మాత్రమే..

NOTE: హ్యుందాయ్ కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్‌లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ బెనిఫిట్స్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే లభిస్తాయి. మరిన్ని ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles