దుమ్ములేపే దమ్ముతో వచ్చేసింది.. ‘హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్’: ధర ఎంతంటే..

Hyundai Venue Adventure Edition Launched in India: ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ భారతీయ మార్కెట్లో కొత్త వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇప్పటికే భారీ అమ్మకాలతో దూసుకెళ్తున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌లో లాంచ్ అవ్వడం వాహన ప్రేమికులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఈ కొత్త ఎడిషన్ ధర, డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & కలర్ ఆప్షన్స్

కొత్త హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ (Hyundai Venue Adventure Edition) ప్రారంభ ధర రూ. 10.15 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఎడిషన్ రేంజర్ ఖాకీ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఈ ఎడిషన్ ఎస్(ఓ) ప్లస్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్(ఓ) అనే మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కొత్త ఎడిషన్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 15000 ఎక్కువ. వేరియంట్ వారీగా ధరలను కింద గమనించవచ్చు.

  • 1.2 లీటర్ పెట్రోల్ ఏంటీ ఎస్(ఓ) ప్లస్: రూ. 10.15 లక్షలు
  • 1.2 లీటర్ పెట్రోల్ ఏంటీ ఎస్ఎక్స్: రూ. 11.21 లక్షలు
  • 1.0 టర్బో పెట్రోల్ డీసీటీ ఎస్ఎక్స్(ఓ): రూ. 13.38 లక్షలు

డిజైన్

చూడటానికి దాదాపు సాధారణ హ్యుందాయ్ వెన్యూ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఈ కొత్త అడ్వెంచర్ ఎడిషన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్, రూఫ్ రైల్స్, వింగ్ మిర్రర్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి వాటిని బ్లాక్ కలర్ పొందుతాయి. డోర్ మీద అడిషినల్ సైడ్ క్లాడింగ్ చూడవచ్చు. బ్రేక్ కాలిపర్స్ రెడ్ కలర్ పొందుతుంది. ఫ్రంట్ పెండర్ మీద అడ్వెంచర్ ఎడిషన్ చిహ్నం, మరియు గ్రిల్ మీద హ్యుందాయ్ లోగో వంటివి బ్లాక్ కలర్ పొందుతాయి.

నిజానికి హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ రేంజర్ ఖాకీ కలర్ ఆప్షన్లో మాత్రమే కాకుండా.. అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే అనే రంగులలో లభిస్తుంది. ఇవన్నీ కూడా డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్ పొందుతాయి. అంటే రూప్ నలుపు రంగులో ఉంటుంది. మొత్తం మీద ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది.

ఫీచర్స్

కొత్త హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ డ్యూయెల్ టోన్ (గ్రే అండ్ బ్లాక్) కలర్ ఆప్షన్ పొందుతుంది. క్యాబిన్ మొత్తం కూడా బ్లాక్ కలర్ పొందుతుంది. అక్కడక్కగా.. సేజ్ గ్రీన్ కలర్ ఇన్సర్ట్‌లు మరియు కాంట్రాస్ట్ చూడవచ్చు. సీట్లు కూడా గ్రీన్ హైలెట్స్ పొందుతాయి. కొత్త 3డీ మ్యాట్స్, స్పోర్టీగా కనిపించే పెడల్స్ కూడా ఈ కొత్త ఎడిషన్ పొందుతుంది. డ్యూయెల్ కెమెరాతో కూడిన డాష్‌క్యామ్‌ను కూడా ఇక్కడ చూడవచ్చు.

ఇంజిన్ వివరాలు

హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. రెండో ఇంజిన్ అయిన 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్. ఇది 120 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ కొత్త ఎడిషన్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ పొందదు. కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో మాత్రమే ఈ ఎడిషన్ లభిస్తుంది.

కొత్త వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ అండ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. వెన్యూలో కొత్త మోడల్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. మా కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన అన్నారు.

Don’t Miss: ‘ఆషు రెడ్డి’ ఉపయోగించే లగ్జరీ కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

కొత్త ఎడిషన్ లాంచ్ చేయడానికి కారణం

ఆధునిక కాలంలో వాహన ప్రియులు కొత్త వాహనాలను లేదా అప్డేటెడ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి దీనిని కంపెనీలు దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు వాహనాలను లాంచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంపెనీ ఎప్పుడైతే అప్డేటెడ్ లేదా కొత్త వాహనాలను లాంచ్ చేయడం ఆపేస్తుందే.. మార్కెట్లో ప్రత్యర్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తరువాత ఆ సంస్థ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి హ్యుందాయ్ ఈ కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది.