23.2 C
Hyderabad
Tuesday, January 21, 2025

సమంత ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?.. ఒక్కక్కటి ఇంత రేటా..

Samantha Ruth Prabhu Expensive Car Collection: సమంత (Samantha).. ఈ పేరుకు చిత్ర సీమలో ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఏమాయ చేసావే సినిమాతో అభిమానుల మనసుదోచిన ఈ అమ్మడు.. బృందావనం, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది వంటి అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత యువ సామ్రాట్ నాగచైతన్యతో పెళ్లి.. విడాకులు ఇవన్నీ దాదాపు అందరికి తెలుసు. సినిమా రంగంలో దూసుకెళ్తున్న సమంత ఖరీదైన కార్లను కూడా ఉపయోగిస్తుంది. బహుశా ఇది చాలా కొంతమందికి మాత్రమే తెలిసిఉంటుంది. ఈ కథనంలో సమంత ఉపయోగించే కార్లు ఏవి? వాటి ధర ఎంత ఉంటుందనే మరిన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.. ఇక ఆలస్యమెందుకు స్టోరీలోకి వెళ్ళిపోదాం.

నటి సమంత ఉపయోగించే కార్లు
బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series)

ఇతర సెలబ్రిటీల మాదిరిగానే సమంత జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ కారును కలిగి ఉంది. దీని ధర రూ. 1.42 కోట్లు. సమంత తరచుగా ఈ కారునే ఉపయోగిస్తుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే కాకుండా డీజిల్ మరియు హైబ్రిడ్ వంటి వెర్షన్లలో కూడా లభిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 335 హార్స్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 5.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF)

రూ. 70 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన జాగ్వార్ కంపెనీకి చెందిన ఎక్స్ఎఫ్ కూడా సమంత గ్యారేజిలో ఉందని సమాచారం. ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 197 బీహెచ్‌పీ పవర్.. 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 10 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ కారు గరిష్ట వేగం గంటకు 234 కిమీ. ఈ సెడాన్ 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 6.4 సెకన్లు మాత్రమే. మంచి డిజైన్ కలిగిన ఈ కారు.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇవి వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఆడి క్యూ7 (Audi Q7)

జాన్ అబ్రహం, బిపాసా బసు, దీపికా పదుకొనె వంటి ప్రముఖ సెలబ్రిటీల గ్యారేజిలో కనిపించే ఆడి క్యూ7 కారు.. సమంత గ్యారేజీలోనూ ఉంది. దీన్ని బట్టి చూస్తేనే.. ఈ కారు సెలబ్రిటీల మనసును ఎంతగా దోచేస్తోందో స్పష్టంగా అర్థమవుతోంది. రూ. 80 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు 3.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 241.4 Bhp పవర్ మరియు 550 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 12 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ కారు గరిష్ట వేగం గంటకు 215 కిమీ. యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్స్ క్యూ7 కారులో ఉన్నాయి.

Don’t Miss: రూ.3.5 కోట్ల కారు కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!

మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ (Mercedes Benz G63 AMG)

జర్మన్ బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంజ్ యొక్క జీ63 ఏఎంజీ కూడా సమంత గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. ఈ కారు పవన్ కళ్యాణ్, అంబానీ ఫ్యామిలీలో కూడా ఉంది. సుమారు రూ.2.3 కోట్ల ఖరీదైన ఈ కారు 5.5 లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది 572 బీహెచ్‌పీ పవర్ & 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ కారు టాప్ స్పీడ్ 210 కిమీ/గం.. కాగా ఇది 5.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతం అవుతుంది.

పోర్స్చే కేమాన్ జీటీఎస్ (Porsche Cayman GTS)

లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా.. సమంత గ్యారేజిలో పోర్స్చే స్పోర్ట్స్ కారు కూడా ఉంది. బహుశా ఇదే సమంత వద్ద ఉన్న ఏకక స్పోర్ట్స్ కారు అని తెలుస్తోంది. దీని ధర రూ. 1.19 కోట్లు అని తెలుస్తోంది. ఇందులో 3.5 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 330 Bhp పవర్ & 370 Nm టార్క్ అందిస్తుంది. 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ 283 కిమీ/గం. ఈ స్పోర్ట్స్ కారు మైలేజ్ 9 నుంచి 16 కిమీ/లీ అని తెలుస్తోంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles