32.2 C
Hyderabad
Wednesday, March 19, 2025

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం: ఆ పదవికి నాగబాబు పేరు ఖరారు

Janasena Finalised Nagababu as MLA Quota MLC Candidate: జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో జనసేనకు 21 ఎంఎల్ఏ సీట్లను కేటాయించారు. అయితే పార్టీ అధినేత ‘పవన్ కళ్యాణ్’ అభ్యర్థన మేరకు ‘నాగబాబు’ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఆ తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి.. నాగబాబు వార్తల్లో వినిపిస్తూనే ఉన్నారు. టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్దమని తేలిపోయింది. కానీ ఇప్పుడు నాగబాబును ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది.

నిజానికి ప్రస్తుతం ఉన్న ఎంఎల్సీలు ఐదుమంది టీడీపీ అభ్యర్థులే. అందులో ఈ సారి జనసేనకు ఒకటి కేటాయించారు. దానికి నాగబాబు పేరును ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేయడానికి ఎంతోమంది సీనియర్ టీడీపీ నాయకులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి లోకేష్‌ను, సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

టీడీపీ ఇంకా తమ నలుగురు ఎంఎల్సీ అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. అయితే ఇప్పుడు యనమల రామకృష్ణుడు, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తిల పదవీకాలం ఈ నెల 28తో ముగుస్తుంది. వీరి స్థానంలో కొత్తవారు రానున్నారు. ఎవరు వస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

జనసేన పార్టీ అధికారిక ప్రకటన

ఇటీవలే గ్రాడ్యుయేట్స్, పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో.. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ అభ్యర్థుల నామినేషన్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగానే.. శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎంఎల్సీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వంలో భాగంగా.. కొణిదెల నాగబాబు పేరును, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న నాగబాబు.. ఎంఎల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు ఇప్పటికే సమాచారం అందించారు. నామినేషన్ వేయడానికి కావలసిన పాత్రలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు.. జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు.

కొణిదెల నాగబాబు

సినీ నటుడు, ప్రొడ్యూసర్ అయిన నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు సినిమాల్లో అరుదుగా కనిపించి.. ఆ తరువాత ప్రొడ్యూసర్ అయ్యారు. ఆ తరువాత కాలంలో ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు జడ్జ్(నాయనిర్ణేత)గా వ్యవహరించారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తరువాత, కొన్ని రోజులు ‘గల్లీ బాయ్స్’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.

Also Read: మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరువాత, తమ్ముడికి అండగా నిలబడి.. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఏ పదవీ ఆశించకుండా.. వయసులో పెద్దవాడైన తమ్ముడి కోసం ఎంఎల్ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకున్నారు. ఇప్పుడు ఆయన్నే ఎంఎల్సీగా పోటీ చేయమని పార్టీ అధినేత కోరారు. దీనిపైన నాగబాబు ఎలా స్పందిస్తారు?.. ఆ తరువాత జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తారా? లేదా? అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. మొత్తానికి నాగబాబును త్వరలోనే ఎంఎల్సీగా చూడబోతున్నారు. ఇది మెగా అభిమానవులకు ఓ మంచి శుభవార్త.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు