Janhvi Kapoor Speak About Her Marriage Place and More: తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ మరియు అందరికి ఎంతోఇష్టమైన నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి.. అతిలోక సుందరిగా ఎదిగిన ఈమె ఇప్పుడున్న ఎంతోమంది సినీ ప్రముఖులకు ఆదర్శప్రాయం. ఈమె వారసురాలిగా తెరమీదకు వచ్చిన ‘జాన్వీ కపూర్’ (Janhvi Kapoor) కూడా తల్లికి తగ్గ కూతురుగా.. తనదైన రీతిలో ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
జాన్వీ కపూర్ మొదటి హిందీ సినీ పరిశ్రమలో.. తన కెరీర్ ప్రారంభించింది. కాగా దేవర సినిమాతో తెలుగు చిత్ర సీమలో కూడా అడుగుపెట్టింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న ఈ అమ్మడు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా నటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే.. టాలీవుడ్ పరిశ్రమలో కూడా జాన్వికి మంచి అవకాశాలు వస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఎనలేని భక్తి
ఇదిలా ఉండగా ‘జాన్వీ కపూర్’కు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి. ఎందుకంటే.. తన తల్లికి కూడా ఆ దేవదేవుడంటే అమితమైన భక్తి, ఈ కారణంగానే శ్రీదేవి బతికున్న రోజుల్లో చాలాసార్లు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ విధానాన్నే జాన్వీ కపూర్ కూడా వారసత్వంగా పాటిస్తోంది. దీంతో ఏడాదికి కనీసం నాలుగైదు సార్లు అయినా.. ఈమె తిరుమల దేవుణ్ణి దర్శించుకుంటుంది. అంతే కాకుండా శ్రీదేవి పుట్టిన రోజుకు, వర్థంతికి కూడా ఈమె తప్పకుండా తిరుమలకు మెట్లమార్గంలో కాలినడకన వెళ్తుంది.
కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? పెళ్లి తరువాత ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు.. జాన్వీ కపూర్ సమాధానం ఇస్తూ, నేను తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి తరువాత కూడా భర్తతో కలిసి తిరుమలలోనే ఉండాలనుకుంటున్నాను అని వెల్లడించింది. జాన్వీ కపూర్ సమాధానం ఎంతోమందిని ఫిదా చేసింది. సెలబ్రిటీలందరూ.. పెళ్లిళ్లు, పెళ్లి తరువాత ఉండే ప్రదేశాలు అన్నీ కూడా విదేశాలే. అలాంటిది.. శ్రీదేవి కుమార్తె.. తిరుమలలో దేవదేవుని చెంత ఉండాలనుకోవడం ప్రశంసనీయం.
పెళ్లిపై ఖుషి కపూర్ వ్యాఖ్యలు
జాన్వీ కపూర్ మాదిరిగానే.. శ్రీదేవి చిన్న కూతురు, జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ కూడా తన పెళ్లి గురించి ప్రస్తావించింది. తనకు పెళ్లిపై చాల గౌరవం ఉందని, అందుకే బంధువులు.. సన్నిహితుల పెళ్ళిలో ఎక్కువగా కనిపిస్తుంటానని చెప్పింది. నేను కూడా అక్క మాదిరిగానే తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. పెళ్లి తరువాత.. మా నాన్న మాతోనే ఉండాలని ఖుషి కపూర్ చెప్పుకొచ్చింది. నేను, నా భర్త, చాలా పెంపుడు కుక్కలు.. జీవితం ఇలా ఉండేలా ఊహించుకుంటానని ఆమె వెల్లడించింది.
అందాల తార శ్రీదేవి కూతుళ్లు ఇద్దరూ.. తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మంచి విషయం. సినీతారనటందరూ.. పెళ్ళికి ఇతర దేశాలు ఎంచుకుంటున్న వేళ ముంబైకి చెందిన అక్క చెల్లెల్లు (జాన్వీ, ఖుషి కపూర్) తిరుమల నాధుని చెంత పెళ్లి చేసుకోవాలనుకోవడం.. ఎందోమందికి ఆదర్శనీయం. కాబట్టి వారు అనుకున్న విధంగా తిరుమలలోనే పెళ్లి జరగాలని ఆశిద్దాం అని నెటిజన్లు చెబుతున్నారు.
జాన్వీ కపూర్ నెట్‍వర్త్
ఖుషి కపూర్ 2023లో సినీ రంగ ప్రవేశం చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈమె ‘లవ్ యాపా’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 7న తెరమీదకు రానుంది. ఇది తమిళంలో సూపర్ హిట్ మూవీ అయిన ‘లవ్ టుడే’ చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది. దీనికి కూడా ప్రదీప్ రంగనాథ్ నిర్మాతగా ఉన్నారు.
Also Read: దేవర భామ ‘జాన్వీ కపూర్’ కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే షాకవుతారు
ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. అటు సినిమాలు, ఇటు లెక్కకు మించిన యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె లెక్సస్ ఎల్ఎమ్, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 250 డీ, బీఎండబ్ల్యూ ఎక్స్5 మరియు లెక్సస్ ఎల్ఎక్స్ 570 అనే ఖరీదైన కార్లను ఉపయోగిస్తోంది. సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న జాన్వీ కపూర్ నెట్‍వర్త్ రూ. 82 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. కాగా ఈమె ఒక సినిమాలో నటించడానికి సుమారు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ తీసుకుంటుందని సమాచారం.