Keeway K300 SF Launched In India: భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో రోజు రోజుకి గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన వాహనాలు దేశీయ విఫణిలో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో తాజాగా హంగేరి బేస్డ్ కంపెనీ మరియు ఆదీశ్వర్ ఆటో రైడ్ ద్వారా రిటైల్ చేస్తున్న కీవే (Keeway) ఎట్టకేలకు కే300 ఎస్ఎఫ్ (K300 SF) పేరుతో ఓ కొత్త బైక్ లాంచ్ చేసింది.
ధర
కీవే లాంచ్ చేసిన సరికొత్త కే300 ఎస్ఎఫ్ బైక్ ధర రూ. 1.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే. ఈ ధర మొదటి 100 మంచి కస్టమర్లకు లేదా 100 మంది కొనుగోలుదారులకు మాత్రమే. ఆ తరువాత ధరలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ బైక్ సీకేడీ మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.
చూడటానికి కీవే కే300ఎన్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కే300 ఎస్ఎఫ్ కొన్ని అప్డేట్స్ కలిగి ఉండటం గమనించవచ్చు. అప్డేటెడ్ డీకాల్స్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ మరియు డిజిటల్ కన్సోల్ వంటివన్నీ కూడా ఇందులో గమనించవచ్చు. ఈ బైక్ రెడ్, బ్లాక్ మరియు వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కొంత తక్కువ ధరలో.. ఓ మంచి స్ట్రీట్ ఫైటర్ బైక్ కావాలనుకునే వారికి ఇది తప్పకుండా మంచి ఎంపిక అవుతుంది.
ఇంజిన్ డీటెయిల్స్
కీవే కే300 ఎస్ఎఫ్ బైక్ 249.4 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 27.1 హార్స్ పవర్ మరియు 7000 rpm వద్ద 25 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
కీవే కే300 ఎస్ఎఫ్ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్‌తో ఒకే సింగిల్ డిస్క్ బ్రేక్, యూఎస్‍డీ ఫోర్క్, మోనోషాక్ వంటి వాటిని పొందుతుంది. కాబట్టి ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణానికి మాత్రమే కాకుండా.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.
భారతీయ మార్కెట్లో తక్కువ ధర వద్ద, మంచి పర్ఫామెన్స్ అందించే బైకులలో ఒకటైన కీవే కే300 ఎస్ఎఫ్.. హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310, కేటీఎమ్ డ్యూక్, సుజుకి జిక్సర్ 250 మరియు బీఎండబ్ల్యూ జీ310ఆర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.
మార్కెట్లోని కీవే బైక్
భారతీయ మార్కెట్లో కీవే బ్రాండ్ ఇప్పటికే ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 250, కే300 ఆర్, వీ302 సీ, సిక్స్టీస్ 300ఐ (Sixties 300i), విస్టే 300 (Veste 300) మరియు కే300 ఎన్ వంటి వాటిని విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు కంపెనీ కే300 ఎస్ఎఫ్ పేరుతో మరో బైక్ లాంచ్ చేసింది. మొత్తం మీద కంపెనీ దేశీయ విఫణిలో తన ఉనికిని చాటుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైందని స్పష్టమవుతోంది.
Also Read: కొత్త కారవ్యాన్ కొనుగోలు చేసిన ‘ప్రకాష్ రాజ్’ – ఇంద్రభవనమా అంటున్న నెటిజన్స్!
కంపెనీ అందిస్తున్న బైకులలో అత్యంత సరసమైన బైక్ ఎస్ఆర్ 125. దీని ధర రూ. 1.19 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే. 2022లో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బైక్ సింపుల్ డిజైన్ కలిగి.. అత్యుత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9000 rpm వద్ద 9.5 Bhp పవర్ 7500 rpm వద్ద 8.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14.5 లీటర్లు. కాబట్టి ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడమే కాకుండా.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఈ కారణంగానే చాలామంది బైక్ లవర్స్ దీనిని (ఎస్ఆర్ 125) ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.