భారత్‌లో అడుగెట్టిన కొరియన్ బ్రాండ్ కారు – ఫిదా చేస్తున్న డిజైన్ & ఫీచర్స్

Kia Sonet Facelift Revealed In India: అనేక టీజర్ల తరవాత సౌత్ కొరియా కార్ బ్రాండ్ ‘కియా మోటార్స్’ (Kia Motors) దేశీయ విఫణిలో కొత్త ‘సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌’ను (Sonet Facelift) ఆవిష్కరించింది. మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు బుకింగ్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బుకింగ్స్ (Bookings)

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా.. కాస్మెటిక్ అప్‌డేట్‌లను మరియు ఇతర అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.

ఎక్స్టీరియర్ డిజైన్ (Exterior Design)

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ పరిమాణం పరంగా దాని అవుట్‌గోయింగ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో పెద్ద ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటి వాటితో పాటు.. ఫ్రంట్ బంపర్ కూడా రీడిజైన్ చేయబడిన స్కిడ్ ప్లేట్‌లతో సరికొత్తగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి.

సైడ్ ప్రొఫైల్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బాడ్ కూడా ఉంటుంది. ఇది సి ఆకారంలో ఉన్న టెయిల్ లైట్‌లను అనుసంధానిస్తుంది. బంపర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ కూడా కొత్తగా కనిపిస్తాయి.

కలర్ ఆప్సన్స్ (Colour Options)

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎనిమిది మోనోటోన్ కలర్స్, రెండు డ్యూయెల్ టోన్ కలర్స్, ఒక మాట్ ఫినిషింగ్ పెయింట్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్యూటర్ ఆలివ్ కలర్ ఆప్సన్ అనేది పూర్తిగా కొత్త కలర్ ఆప్షన్ కావడం గమనార్హం.

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్లు (Interior Design & Features)

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగంలో కూడా ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, పెద్ద సెంట్రల్‌గా మౌంటెడ్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం వంటి ఉన్నాయి. ఇవన్నీ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషన్ కంట్రోల్ మాదిరిగా ఉపయోగపడతాయి. ట్రాక్షన్ అండ్ డ్రైవ్ మోడ్‌ల కోసం రెండు వరుసల టోగుల్‌లతో పాటు క్లైమేట్ కంట్రోల్ సమాచారాన్ని ప్రదర్శించడానికి దిగువన కొత్త చిన్న స్క్రీన్ ఉంటుంది.

కంపెనీ ఈ కారులోని సీట్ల కోసం కొత్త అపోల్స్ట్రే అందించింది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ADAS ఫీచర్ లభిస్తుంది. కాబట్టి ఈ కారులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటివి ఉంటాయి.

ఇవి మాత్రమే కాకుండా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ప్రామాణికంగా లభిస్తాయి. హై స్పెక్ వేరియంట్స్ కార్నర్ ల్యాంప్స్, ఫోర్-వే పవర్డ్ డ్రైవర్ సీటు మరియు బ్లైండ్-వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరాను పొందుతాయి.

పవర్‌ట్రెయిన్ డీటైల్స్ (Powertrain Details)

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ అదే పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందుతుంది. కాబట్టి పనితీరు కూడా దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్, 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.

Don’t Miss: దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు – రూ.1.40 లక్షల డిస్కౌంట్ కూడా..

వేరియంట్‌లు & అంచనా ధర (Variants & Expected Price)

కొత్త కియా సోనెట్ టెక్ లైన్, జీటీ లైన్ మరియు ఎక్స్-లైన్ వేరియంట్‌లలో అందించబడుతోంది. ఈ లేటెస్ట్ కారు ధరలు రూ. 7.79 లక్షల నుంచి రూ. 14.89 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. అధికారిక ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.

ప్రత్యర్థులు (Rivals)

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ , మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ మరియు ఇతర కాంపాక్ట్ SUVలకు ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉండనుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.